బ్రహ్మముడి జనవరి 24 ఎపిసోడ్: డాక్టర్ చక్రవర్తికి తెలిసిన మంత్రి మోసం- డాక్టర్‌ను రౌడీలతో కొట్టించి బంధించిన ధర్మేంద్ర!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 24 ఎపిసోడ్‌లో పాపకు నురగ రావడం, రంగు మారడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు రాజ్, కావ్య. అక్కడ పాపను చూసిన డాక్టర్ చక్రవర్తి షాక్ అవుతాడు. టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా మంత్రి ధర్మేంద్ర చేసిన మోసం గుర్తుకు తెచ్చుకుంటాడు. దాంతో నిలదీస్తాడు. చక్రవర్తిని కొట్టి కిడ్నాప్ చేస్తాడు మంత్రి.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య దగ్గర ఉన్న పాపకు నోట్లో నుంచి నురగ రావడం, శరీర రంగు మారడంతో కంగారు పడుతుంది కళావతి. వెళ్లి రాజ్‌కు, ఇంట్లోవాళ్లకు చెబుతుంది. అంతా టెన్షన్ అవుతారు. హాస్పిటల్‌కు రాజ్, కావ్య తీసుకెళ్తారు. డాక్టర్ అనురాధ గురించి డాక్టర్ చక్రవర్తిని రాజ్ అడుగుతారు.

పాప రంగు మారడం
పాప రంగు మారడం చూసి చక్రవర్తి షాక్ అవుతాడు. పక్కన ఉన్న నర్స్‌కు తను బిడ్డలను మార్చింది గుర్తుపడుతుంది. అనురాధ మేడమ్ ఆపరేషన్ థియేటర్‌లో ఉందని డాక్టర్ చక్రవర్తి పాపను చెక్ చేస్తాడు. డాక్టర్ వచ్చి ట్రీట్‌మెంట్ చేశాం. పాప నార్మల్ అయింది. టెస్ట్‌లు చేశాం. రిపోర్ట్స్ చూశాక ఏంటనేది తెలుస్తుందని చెబుతాడు. కావ్య, రాజ్ వెళ్లి పాపను చూస్తారు.
కళావతి ఏడుస్తుంది. రాజ్ ఓదారుస్తాడు. మరోవైపు పాప రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్ చక్రవర్తికి నర్స్ ఇస్తుంది. ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతాడు చక్రవర్తి. తర్వాత పిల్లలను మార్చిన విషయం మంత్రి ధర్మేంద్ర చెప్పింది గుర్తు చేసుకుంటాడు చక్రవర్తి. తన వృత్తికి ద్రోహం చేయలేనని, తులసికి నిజం చెప్పేస్తానని చక్రవర్తి అంటాడు. సరే నేనే టైమ్ చూసి చెబుతాను. కానీ, పిల్లలను మార్చిన విషయం చెప్పకండని మంత్రి అంటాడు.
దానికి చక్రవర్తి ఒప్పుకుంటాడు. అది గుర్తు చేసుకున్న డాక్టర్ చక్రవర్తి ఈ విషయం ఎవరికి చెప్పకని చెప్పి ఎవరికి తెలియకుండా పిల్లలను మార్చేశారన్నమాట. చాలా పెద్ద తప్పు చేశాడు. వెంటనే అడగాలి అని మంత్రి దగ్గరికి వెళ్తాడు డాక్టర్ చక్రవర్తి. పాప రిపోర్ట్స్ ఇంకా రావాలని, అర్జంట్‌గా బయటకు వెళ్తున్నా. గంట తర్వాత వస్తానని రాజ్, కావ్యకు చెప్పి డాక్టర్ చక్రవర్తి వెళ్లిపోతాడు.
తులసిని పంపించి
మరోవైపు పాపను రుద్రాణి ఎత్తుకుని ఆడిస్తుంది. తులసి వచ్చి మీరు మాకు ఏ సహాయం చేశారో చెప్పలేదు అని అడుగుతుంది. మీ డెలివరి టైమ్‌లో ఓ కేసు విషయంలో కోర్టుకు వెళ్లకుండా సాల్వ్ చేశాను అని అబద్ధం చెబుతుంది రుద్రాణి. ఇంతలో మంత్రి ఇంటికి డాక్టర్ చక్రవర్తి వస్తాడు. అది చూసిన ధర్మేంద్ర పాపకు పాలు పట్టే టైమ్ ఉందని పంపిస్తాడు.
ఇది కరెక్ట్ కాదు సర్. మీరు చాలా పెద్ద తప్పు చేశారని పాపలను మార్చిన విషయం గురించి, తనను మోసం చేయడం గురించి మంత్రిని డాక్టర్ చక్రవర్తి నిలదీస్తాడు. కావ్య వాళ్లు వచ్చింది చెబుతాడు. నేను నిజం చెప్పలేదు. కానీ, మీరు వచ్చి నిజం చెప్పి ఈ పాపను వాళ్లకు అప్పగించాలని డాక్టర్ చక్రవర్తి అంటాడు. మీకు ఏం కావాలో చెప్పండి మంత్రి ఇస్తారు అని రుద్రాణి అంటుంది.
నేను అమ్ముడు పోను. నేను ఇప్పుడే వెళ్లి, రాజ్ కావ్య వాళ్లకు చెప్పేస్తాను. వాళ్లే ఎలా తెచ్చుకోవాలో తేల్చుకుంటారు అన డాక్టర్ చక్రవర్తి వెళ్తుంటాడు. పక్కన ఉన్న రౌడీలకు మంత్రి ధర్మేంద్ర సైగ చేయడంతో వాళ్లు కర్రతో చక్రవర్తి తలపై కొడతారు. అక్కడికక్కడే పడిపోతాడు చక్రవర్తి.
చక్రవర్తిని బంధించిన మంత్రి
మరి ఇంత నిజాయితీగా ఉండకూడదు చక్రవర్తి. గతంలో నువ్వు నాకు చేసిన సహాయం కారణంగా చంపట్లేదు. కానీ, నిన్ను నా దగ్గరే ఉంచుతాను అని కిడ్నాప్ చేయిస్తాడు మంత్రి ధర్మేంద్ర. హాస్పిటల్‌లో రాజ్, కావ్యను మ్యానేజ్ చేసేందుకు బిడ్డలను మార్చిన హెడ్ నర్స్ నీలవేణి ఉందిగా అని కాల్ చేస్తాడు మంత్రి.
చక్రవర్తి ఇక నుంచి హాస్పిటల్‌కు రాడు. నేను చెప్పినట్లుగా చేయాలి అని అనురాధ మేడమ్‌తో రాజ్, కావ్య వాళ్లకు సమస్య గురించి చెప్పించమని మంత్రి అంటాడు. దానికి సరే అంటుంది నీలవేణి. డాక్టర్ అనురాధకు కావ్య, రాజ్ పాప గురించి చెప్పి, రిపోర్ట్స్ ఇస్తుంది నీలవేణి. అనురాధ మేడమ్ రమ్మంటున్నారని రాజ్, కావ్యకు నీలవేణి చెబుతుంది.
అనురాధ దగ్గరికి రాజ్, కావ్య వెళ్తారు. రిపోర్ట్స్ చూసిన అనురాధ షాక్ అవుతుంది. పాప పుట్టినప్పుడు హెల్తీగానే ఉంది. కానీ, ఇంతలోనే ఎలా జరిగిందో తెలియట్లేదు. పాపకు హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంది. బ్లడ్ పంపింగ్ సరిగా ఉండదు. ఊపిరి ఆడదు. ఆపరేషన్ చేయాలి అని అనురాధ చెబుతుంది. దానికి రాజ్, కావ్య షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


