Sign in

నిన్ను కోరి జనవరి 20 ఎపిసోడ్: శాలిని గేమ్ ఓవర్-క్రాంతి చేతికి డేంజరస్ డ్రగ్-డాక్టర్ చెప్పింది విని షాక్ అయిన అన్నదమ్ములు

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 20 ఎపిసోడ్ లో జల్ రాజ్ కు కామాక్షి వార్నింగ్ ఇస్తుంది. లాకర్ లో క్రాంతికి టాబ్లెట్స్ దొరుకుతాయి. మరోవైపు ప్లాన్ ప్రకారం ప్రకాష్, చంద్ర కలిసి రఘురాం ను గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్తారు. ఆ టాబ్లెట్స్ తో మొమొరీ లాస్ అవుతుందని, డేంజరస్ డ్రగ్ అని డాక్టర్ చెప్తాడు.

Published on: Jan 20, 2026, 07:36:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 20 ఎపిసోడ్ లో డాక్టర్ ప్రకాష్, రఘురాంతో చంద్రకళ వెళ్తుంది. మరోవైపు జల్ రాజ్, సరోజా ఇంటికి వచ్చేసరికి తాళం ఉంటుంది. రాజ్ ఫోన్ చేసినా శ్రుతి లిఫ్ట్ చేయదు. పోతే పోనీ నాకు భారం తగ్గిందని సరోజా అంటుంది. అత్త కామాక్షికి ఫోన్ చేస్తాడు రాజ్. అత్త నీ కూతురు వచ్చిందా? అని రాజ్ అడుగుతాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

లాకర్ లో టాబ్లెట్స్

నా కూతురు నీతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది వెయిట్ చేయ్. గిలగిల కొట్టుకుని రోజు దగ్గర్లోనే ఉంది. అయిపోయార్రా నీ చాప్టర్ క్లోజ్ అని కాల్ కట్ చేస్తుంది కామాక్షి. లాకర్ లో క్రాంతికి టాబ్లెట్స్ దొరుకుతాయి. అప్పుడే విరాట్ వస్తాడు. శాలినికి ఇంత సీక్రెట్ గా టాబ్లెట్స్ దాచాల్సిన అవసరం ఏముందని విరాట్ అడుగుతాడు. శాలినికి ఏమైనా ప్రాబ్లెం ఉందా? నీ దగ్గర ఏమైనా దాస్తుందేమోరా. నువ్వు బాధపడతావని సీక్రెట్ ట్రీట్మెంట్ తీసుకుంటుందేమోనని విరాట్ అంటాడు.

శాలిని ప్లాన్

ఫ్యామిలీ డాక్టర్ ను కలిసి ప్రాబ్లెం ఏంటో తెలుసుకుందాం. డాక్యుమెంట్ తీసుకుని రా అటు నుంచి అటే మినిస్టర్ ను కలవడానికి వెళ్లాలని విరాట్ చెప్తాడు. ఈ రోజు నిన్ను శాలిని చెర నుంచి విడిపిస్తారా అని విరాట్ అనుకుంటాడు. మరోవైపు శాలిని గెస్ట్ హౌజ్ లో వెయిట్ చేస్తుంది. ఈ రోజు నుంచి మామయ్య మైండ్ ప్లెయిన్ పేపర్ లా మారిపోతుంది. ఆ నింద కూడా చంద్రకళపై పడేస్తే అయిపోతుందని శాలిని అనుకుంటుంది.

రఘురాం భయం

కార్లో ప్రకాష్, రఘురాం, చంద్రకళ వెళ్తారు. మీ మీద నాకు నమ్మకం ఉంది డాక్టర్. గతం గుర్తొచ్చేలా చేస్తారని అనుకుంటున్నా. నా తలపై ఎవరు కొట్టారనే విషయంలో నా కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు గతం గుర్తొస్తే తలపై కొట్టింది ఎవరనే నిజం తెలిసిపోతుంది. అది బయట పెట్టడం వల్ల మళ్లీ గొడవలు రేగుతాయని భయంగా ఉంది. నేను చెప్పినా చెప్పకపోయినా సమస్యలైతే తీరవనేది నా బాధ అని రఘురాం అంటాడు.

నిజం తెలియాల్సిందే

నిజం బయటకు వస్తే ఏ కొడుకు జీవితం దెబ్బతింటుందని బాధగా ఉందని రఘురాం అంటాడు. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. అది మొత్తం ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెగెటివ్ ఫోర్స్ ను నిర్దాక్షిణ్యంగా బయటకు తరిమేయాలని ప్రకాష్ అంటాడు. ఎంతటి సొంతవాళ్లయినా ఇంటికి నష్టం చేసేవాళ్లను తరిమేయాలని చంద్ర అంటుంది. ప్లాన్ ప్రకారం చంద్ర కారు దిగిపోతుంది.

డేంజరస్ డ్రగ్

డాక్టర్ దగ్గరకు వచ్చి టాబ్లెట్స్ చూపిస్తారు క్రాంతి, విరాట్. ఇవి డేంజరస్ డ్రగ్ కాంబినేషన్. ఇవి లీగల్ గా ఇండియాలో అమ్మరు. ఇవి తీసుకుంటే గతం మర్చిపోతారు. మొమొరీ ఎరేజ్ చేయడానికి ఎవరో వాడుతున్నారని డాక్టర్ చెప్తాడు.

ఇవి ఎవరి దగ్గర దొరికాయో వాళ్లు తప్పు చేస్తున్నారు. మీ నాన్నకు మీ ఇంట్లోనే థ్రెట్ ఉంది. ఇది సీరియస్ ఇష్యూ అని డాక్టర్ చెప్తాడు. మేం చూసుకుంటామని విరాట్ అంటాడు. అన్నయ్య శాలిని నాన్నను నమ్మలేకపోతున్నానని క్రాంతి అంటాడు. ముందు గెస్ట్ హౌజ్ కు వెళ్దామని విరాట్ చెప్తాడు. గెస్ట్ హౌజ్ లో శాలినిని చూసి ప్రశ్నలు అడుగుతాడు రఘురాం. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More