నిన్ను కోరి జనవరి 19 ఎపిసోడ్: శాలిని గదిలో క్రాంతికి దొరికిన డేంజరస్ డ్రగ్- గెస్ట్ హౌజ్‌లో బయటపడిన శాలిని బాగోతం

నిన్ను కోరి సీరియల్ జనవరి 19 ఎపిసోడ్‌లో డాక్టర్ ప్రకాష్‌తో 15 లక్షలకు డీల్ కుదుర్చుకుంటుంది శాలిని. గెస్ట్ హౌజ్ లొకేషన్ పంపి అక్కడే రఘురాం మెమోరీ పూర్తిగా పోయేలా చేయమంటుంది. ఆ విషయం విరాట్, చంద్రలకు చెబుతాడు అర్జున్. ఫైల్స్ కోసం వెతుకుతున్న క్రాంతికి శాలిని గదిలో ట్యాబ్లెట్స్ దొరుకుతాయి.

Published on: Jan 19, 2026, 09:12:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫ్రెండ్‌తో మాట్లాడినట్లుగా ప్రకాష్ శాలినికి ట్రాప్ వేస్తాడు. ఈ డాక్టర్‌కు ట్రీట్‌మెంట్‌తో పాటు ఫ్రాడ్ చేసే టాలెంట్ కూడా ఉందన్నమాట. ఈ ముసలోడిని బయటకు పంపించే బదులు దీన్ని వాడుకుంటే అయిపోతుందిగా అని శాలిని అనుకుంటుంది.

నిన్ను కోరి సీరియల్ జనవరి 19 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జనవరి 19 ఎపిసోడ్‌

శ్రుతికి పులస చేపతో పోలిక

మరోవైపు జాలి రాజ్‌కు ఎంత అమ్మిన చేపలు అమ్ముడు కావు. ఇంట్లో మంచి పులసను పెట్టుకుని ఏంటిది అని ఓ కస్టమర్ అంటాడు. దాంతో అతన్ని తిట్టి పంపిస్తాడు రాజ్. వాడు అంటుంది నా భార్య గురించే. చేపలు అమ్మడానికి శ్రుతిని తీసుకురావడం తప్పు అని రాజ్ అంటాడు. ఇంతలో శ్రుతి అక్కడికి వస్తుంది. దాంతో చాలా కస్టమర్స్ ఒక్కసారిగా వస్తారు.

నేను రెండు రోజులు రాలేదు. ఏది అమ్ముడుపోలేదు. నా గ్లామర్ చూసి వస్తున్నారు అని శ్రుతి అంటుంది. అరగంటలో మొత్తం అమ్ముడుపోతాయి. కానీ, డబ్బు మొత్తం శ్రుతి పట్టుకెళ్తుంది. వారం నుంచి ఇదే తంతు. ఒక్కరూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఊరుకునేది లేదు అని రాజ్ తల్లి అంటుంది.

మరోవైపు ప్రకాష్ దగ్గరికి శాలిని వెళ్తుంది. మీరు చేసిన అప్పులు, తప్పుల గురించి తెలిసింది. ఇందాక మాట్లాడింది నేను విన్నాను. మీ గురించి పోలీస్‌లకు చెబితే జైలులో ఉంటారుగా అని శాలిని అనడంతో భయపడినట్లు నటించిన ప్రకాష్ డోర్ వేస్తాడు. తన గురించి బయటపెట్టొద్దని వేడుకుంటాడు. అయితే, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని శాలిని ట్విస్ట్ ఇస్తుంది.

ట్విస్ట్ ఇచ్చిన శాలిని

ఇదేంటీ బేరం ఆడుతుందనుకుంటే వెళ్లిపోమంటుంది అని డాక్టర్ ప్రకాష్‌గా ఉన్న అర్జున్ షాక్ అవుతాడు. వెళ్తే క్రాంతికి డౌట్ వస్తుందని, మీ మావయ్యకు క్యూర్ అవడం నీకు ఇష్టం లేదా. ఒకరికొకరం సహాయం చేసుకుందామని ప్రకాష్ అంటాడు. అలా అయితే సరే. మీరు మా మావయ్య మెమోరీ మొత్తం ఇరేజ్ చేసేయాలి. ఆయన జ్ఞాపకాలు తీసేసి ఆయన బ్రెయిన్ బ్లాంక్ చేస్తే మీ అకౌంట్‌లో 10 లక్షలు వేస్తాను అని శాలిని అంటుంది.

నాకున్న అప్పులకు పది లక్షలు సరిపోవు. 15 లక్షలు కావాలి అని అర్జున్ అంటాడు. సరే అని దానికి ఒప్పుకున్న శాలిని వెంటనే పని చేయమని అంటుంది. వెంటనే కుదరదు. కొన్ని అరెంజ్‌మెంట్స్ చేయాలి. స్పెషల్ ఇంజక్షన్, షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. వేరే ప్లేసులో ఇదంతా చేస్తాను అని ప్రకాష్ అంటాడు. వెంటనే జరిగిపోవాలి. మా గెస్ట్ హౌజ్ లొకేషన్. అక్కడ ఎవరుండరు. అక్కడే చేయండి అని శాలిని లొకేషన్ పంపిస్తుంది.

మరోవైపు నుదుట సింధూరం పెట్టించుకుని మురిసిపోతుంది చంద్రకళ. యెల్లో కలర్ చీరలో ముద్దబంతిలా ఉన్నావ్, ముద్దొస్తున్నావ్ అని కిస్ చేయబోతాడు విరాట్. ఇంతలో అర్జున్ డోర్ కొడతాడు. గదిలోకి వచ్చి శాలిని మన దారిలోకి వచ్చిందని, బేరం కుదుర్చుకుందన్న విషయం చెబుతాడు. ఈరోజుతో చంద్రగారి కష్టాలు తీరిపోతాయి అని అర్జున్ అంటాడు.

చంద్ర, విరాట్, అర్జున్ ప్లాన్

గెస్ట్ హౌజ్ గురించి చెబుతాడు ప్రకాష్. అక్కడికి శాలిని కూడా వెళ్లిపోయిందని అంటాడు. అర్జున్‌తో వెళ్లు. కానీ గెస్ట్ హౌజ్‌లోపలికి వెళ్లకు. కాస్తా బయట వెయిట్ చేయు. నేను క్రాంతితో వస్తాను. అప్పుడు శాలిని, డాక్టర్ ఏదో ప్లాన్ చేస్తున్నారని రెచ్చగొట్టు. అప్పుడు శాలిని ఓపెన్ అవుతుంది అని విరాట్ అంటాడు. చంద్ర, అర్జున్ వెళ్తారు.

మరోవైపు పర్మిషన్ గురించి క్రాంతి ఫోన్ మాట్లాడుతాడు. కంపెనీ లైసెన్స్ పేపర్స్ కావాలని శాలినిని పిలుస్తాడు క్రాంతి. ఇంట్లో లేదని కామాక్షి చెబుతుంది. ఆ పేపర్స్ కోసం క్రాంతి వెతుకుతుంటాడు. ఇంతలో విరాట్ వచ్చి మినిస్టర్ పీఏ ఫోన్ చేశాడు. నీ బిజినెస్ గురించి ఓ వ్యక్తిని పంపిస్తానన్నాడు. మన గెస్ట్ హౌజ్‌లో మీటింగ్ ఏర్పాటు చేశానని విరాట్ అంటాడు.

డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నా కాసేపు అయ్యాక వెళ్దామని క్రాంతి అంటాడు. దాంతో సరేనని విరాట్ అంటాడు. మరోవైపు రఘురాంతోపాటు శ్యామల కూడా వస్తానంటుంది. ఈవిడ పిచ్చి ప్లాన్‌కు చిచ్చు పెట్టేలా ఉందని చంద్రకళ అనుకుంటుంది.

మీరు బీరకాయ పప్పు బాగా చేస్తారట కదా. మీరు మాతో వస్తే నేను మిస్ అవుతాను. మీరు ఇంట్లోనే ఉండి రెడీ చేయండంటాడు ప్రకాష్. దాంతో సరేనంటుంది శ్యామల. తండ్రితో చంద్రకళను పంపిద్దామని విరాట్ అంటాడు. మరోవైపు గదిలో ఫైల్స్ కోసం వెతుకుతున్న క్రాంతి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అవి విరాట్‌కు చూపిస్తాడు.

డేంజరస్ డ్రగ్

వాటి గురించి తెలుసుకోడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవి డేంజరస్ డ్రగ్ అని, మెమోరీ ఇరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతాడు. దాంతో క్రాంతి, విరాట్ షాక్ అవుతారు. గెస్ట్ హౌజ్‌లో రఘురాంను స్పృహ కోల్పోయేలా చేసిన ప్రకాష్ మీరు అన్నట్లుగానే మెమోరీ పూర్తిగా ఇరేజ్ చేస్తానంటాడు. అప్పుడే చంద్రకళ వచ్చి వింటుంది. చంద్రను చూసి శాలిని, ప్రకాష్ షాక్ అవుతారు. గెస్ట్ హౌజ్‌లో శాలిని బాగోతం బయటపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More