నిన్ను కోరి జనవరి 13 ఎపిసోడ్:పనిచేస్తున్న ప్రకాష్ ట్రీట్మెంట్-డాక్ట‌ర్‌ను పంపించేలా శాలిని ప్లాన్-విరాట్, చంద్ర రొమాన్స్

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో రఘురాం, ప్రకాష్ చెస్ ఆడుతుంటారు. రఘురాం మెమోరీ రికలెక్ట్ చేసేందుకు ప్రకాష్ ప్రయత్నిస్తాడు. శాలిని టెన్షన్ పడుతుంది. విరాట్, చంద్రకళ గదిలో రొమాన్స్ చేస్తారు. డాక్టర్ ను పంపించేందుకు శాలిని ప్లాన్ కోసం ఆలోచిస్తుంది.

Published on: Jan 13, 2026, 07:32:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో రఘురాం, ప్రకాష్ చెస్ ఆడతారు. చెస్ ఆడటం రాకపోవడంతో మాటలతో మ్యానేజ్ చేద్దామని ప్రకాష్ అనుకుంటాడు. ఇంటి దొంగను పట్టడం అన్నింటికంటే కష్టమైన పని అని ప్రకాష్ అంటాడు. వాళ్లే డేంజర్ అని క్రాంతి, అలాంటి వాళ్లను నామరూపాలు లేకుండా చేయాలని విరాట్ చెప్తారు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

అన్నీ గుర్తొస్తాయి

మనిషి మర్చిపోవడం జరగదు. ప్రతి మెమోరీ బ్రైన్ లో ఉంటుందని ప్రకాష్ అంటాడు. నాకు అన్ని గుర్తొస్తాయి. కానీ చెప్పకుండా ఏదో ఆపుతుంది. కేవలం నన్ను కొట్టిన వాళ్లు గుర్తుకు రాకుండా ఉండటం ఏంటీ? అని రఘురాం అంటాడు. వీళ్లను డైవర్ట్ చేయాలని చెస్ బోర్డుపై మంచినీళ్లు పడేలా చేస్తుంది శాలిని.

చంద్ర, విరాట్ రొమాన్స్

ఇక గదిలోకి వెళ్లిన చంద్రకళను వెనకాల నుంచి హగ్ చేసుకుంటాడు విరాట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం చేస్తుంది డ్రామానే అయినా నాన్నలో ఉత్సాహం కనిపిస్తోందని విరాట్ అంటాడు. దీనికి కారణం నువ్వు, క్రాంతి గొడవ పడకుండా ఉండటమే. మనం రివర్స్ డ్రామా మొదలుపెట్టినప్పటి నుంచి అంతా సర్దుకుందని చంద్రకళ అంటుంది.

శాలినికి షాక్

ఇంట్లో శాలిని లాంటి నెగెటివ్ పర్సన్ ఉంటే గొడవలు అవుతాయి. అదే నీలాంటి పాజిటివ్ పర్సన్ ఉంటే ప్రశాంతంగా ఉంటుందని విరాట్ చెప్తాడు. శాలిని గేమ్స్ అన్నింటికీ చెక్ పెట్టడం ఖాయమని చంద్ర చెప్తుంది. మరోవైపు శాలిని నువ్వు డాక్టర్ పై డౌట్ పడ్డావు కదా. కానీ తన ట్రీట్మెంట్ తో నాన్నలో మార్పు తీసుకొచ్చాడు. ఒక్క రోజులో ఇంత ఇప్రూమెంట్ ఉంటే, మూడు రోజుల్లో మొత్తం గుర్తొస్తుంది. అప్పుడు నేరం చేసింది ఎవరనేది తెలుస్తుందని క్రాంతి అనడంతో శాలిని షాక్ అవుతుంది.

ప్రకాష్ కోసం జున్ను

మీరు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మామయ్యలో మార్పు వచ్చింది. శాలిని అలా కాకుండా చేస్తుంది. మిమ్మల్ని పంపించాలని అనుకుంటుందని అర్జున్ కు చంద్ర చెప్తుంది. శాలినిని నేను చూసుకుంటానని అర్జున్ అంటాడు. అప్పుడే శ్యామల వస్తుంది. దీంతో విరాట్, చంద్ర కోప్పడుతూ డ్రామా ఆడతారు. ప్రకాష్ కోసం శ్యామల జున్ను తీసుకొస్తుంది. నాకు జున్ను ఇష్టమని మీకు ఎలా తెలుసు? అంటూ లాగించేస్తాడు ప్రకాష్.

డాక్టర్ ప్లాన్

డాక్టర్ ను పంపించేయాలని శాలిని ఆలోచిస్తుంది. అప్పుడే అందరూ వస్తారు. రఘురాంను లాన్ లో వెయిట్ చేయమంటాడు ప్రకాష్. సంఘటనకు ముందు, తర్వాత జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే మర్చిపోయిన విషయాలు గుర్తుకొస్తాయని జగదీశ్వరితో ప్రకాష్ అంటాడు. ఆయన్ని ఆ టైమ్ జోన్ లోకి తీసుకెళ్లాలని ప్రకాష్ అంటాడు. అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది ఎవరు? ఆయనపై దాడి చేసింది ఎవరు? అనేది మర్చిపోయారని శ్యామల అంటుంది.

ముందు చిన్న విషయాలు గుర్తు చేద్దామని ప్రకాష్ అంటాడు. విరాట్ చిన్నప్పుడు జ్వరంతో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డాం. ఆ విషయం ఆయనకు గుర్తు లేదని జగదీశ్వరి అంటుంది. ఆ విషయం గుర్తుకు వచ్చేలా చేద్దామని ప్రకాష్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More