నిన్ను కోరి జనవరి 12 ఎపిసోడ్: ప్రకాష్‌పై శ్యామ‌ల ప్రేమ‌-గెట‌ప్ బ‌య‌ట‌ప‌డ‌కుండా కాపాడిన విరాట్‌, చంద్ర‌- శాలిని టెన్ష‌న్‌

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ లో డాక్టర్ ప్రకాష్ పై శ్యామల ప్రేమ ఒలకబోస్తుంది. పదో తరగతి ఫ్రెండ్ అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. మరోవైపు రాజ్ ను శ్రుతి టార్చర్ చేస్తుంది. ప్రకాష్ మీసం ఊడిపోవడంతో విరాట్, చంద్ర కాపాడతారు. చెస్ రాకపోయినా ప్రకాష్ గేమ్ కు రెడీ అయిపోతాడు. 

Published on: Jan 12, 2026, 07:40:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ లో మీరు హెల్త్ మీద మాత్రమే కాన్సట్రేట్ చేయండని డాక్టర్ ప్రకాష్ గెటప్ లో ఉన్న అర్జున్ చెప్పడంతో శ్యామల సిగ్గు పడుతుంది. అర్జున్ మీరు శాలినిని ఏమో కానీ మా అత్తను ఏదో చేశారని విరాట్ సరదాగా అంటాడు. మూడు రోజుల్లో మామయ్యను ఎలా క్యూర్ చేస్తారని శాలిని టెన్షన్ పడుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

అదే పేరు

ప్రకాష్ కోసం ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానని విరాట్ తో చెప్తుంది శ్యామల. ఆయన మీద ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నారు? ఆయనను చూడగానే మనసులో వీణలో మోగాయా? అని చంద్రకళ అడుగుతుంది. అతనికి, నాకు ఫ్లాస్ బ్యాక్ లో ఒక బ్యూటీఫుల్ కనెక్షన్ ఉందని పదో తరగతి రోజుల్లో జరిగిన దాన్ని శ్యామల చెప్తుంది. ఇన్నాళ్లకు మళ్లీ అదే పేరు వినేసరికి నాలో చిన్న ఎగ్జైట్మెంట్ కలిగిందని అంటుంది.

శ్రుతి టార్చర్

ఆ ప్రకాష్, ఈ ప్రకాష్ ఒక్కరు కాదని నా డౌట్ అని చంద్ర అంటుంది. నాకు తెలుసా? నీకు తెలుసా? అని శ్యామల మండిపడుతుంది. శాలినిని చూసి విరాట్ చేయి పట్టుకుని ప్రేమగా బయటకు వెళ్తుంది చంద్ర. మరోవైపు ఇంట్లో కూర్చుని కలెక్షన్ మొత్తం అదే నొక్కేసిందని శ్రుతి గురించి రాజ్ కు చెప్తుంది సరోజా. పెళ్లాం కోతిలా ఉంటే ఎవరూ చూడరని ఆమె అంటుంది. అందమైన భార్య ఉంటే ఇంత టార్చర్ గా ఉంటుందని అనుకోలేదని రాజ్ అంటాడు.

ఊడిన మీసం

శ్రుతికి కాల్ చేసి త్వరగా వాళ్లంతటే వాళ్లు వదిలేసుకునేలా చేయమని కామాక్షి చెప్తుంది. టార్చర్ పెడతానని శ్రుతి అంటుంది. బర్గర్ లో ఒక బైట్ కావాలని రాజ్ అడిగితే అతని చేతిని కొరుకుతుంది శ్రుతి. సెపరేట్ ఫుడ్, సెపరేట్ బెడ్ అని చెప్తుంది శ్రుతి. శ్యామల కాఫీ తీసుకుని ప్రకాష్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అతని మీసం ఊడిపోతుంది. విరాట్, చంద్ర వెళ్లి శ్యామలను డైవర్ట్ చేసి అర్జున్ ను కాపాడతారు.

రఘురాంతో చెస్

ఇది స్పెషల్ గా ప్రకాష్ కోసం కలిపిన ఫిల్టర్ కాఫీ అని ఇస్తుంది శ్యామల. జస్ట్ శ్యామ అని పిలవమంటుంది. శ్యామల చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ను అర్జున్ కు చెప్తారు విరాట్, చంద్ర. ఇదేం బంపరాఫర్ విరాట్. త్వరగా చెప్పడం మంచిదని అర్జున్ అంటాడు. అప్పుడే రఘురాం హ్యాపీగా వస్తాడు. డాక్టర్ చెప్పిన ఈ బుక్ చదవడం వల్ల రాత్రి ప్రశాంతంగా పడుకున్నానని రఘురాం చెప్తాడు.

చెస్ ఆడి రఘురాం ఎబిలిటీ టెస్ట్ చేస్తానని ప్రకాష్ అంటాడు. క్రాంతి అరెంజ్ చేయ్ ఈ రోజు నేనో, ప్రకాష్ గారో తేలిపోవాలని రఘురాం అంటాడు. కానీ ప్రకాష్ కు చెస్ ఆడటం రాదని విరాట్, చంద్రతో చెప్తాడు. చెస్ గేమ్ కు ఏర్పాట్లు చేస్తారు. కచ్చితంగా ప్రకాష్ గెలుస్తాడు కామా అని శ్యామల చెప్తుంది. జస్ట్ ఏ మినిట్ అని ఫోన్లో రెండు మూవ్స్ చూసి రెడీ అయిపోతాడు. ఇక్కటితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More