నిన్ను కోరి జనవరి 9 ఎపిసోడ్: డాక్టర్ ప్రకాష్‌గా అర్జున్ ఎంట్రీ-కంగారులో శాలిని-ప్రకాష్‌కు కనెక్ట్ అయిన శ్యామల
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 9 ఎపిసోడ్ లో రఘురాంను మరో డాక్టర్ కు చూపించాలని జగదీశ్వరి చెప్తుంది. డాక్టర్ ప్రకాష్ గెటప్ లో అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. శాలిని కంగారు పడుతుంది. మరోవైపు ప్రకాష్ కు శ్యామల కనెక్ట్ అవుతుంది. ప్రేమ ఒలకబోస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 9 ఎపిసోడ్ లో ట్రీట్మెంట్ మారితే బెటర్ అని రఘురాం గురించి చెప్తుంది జగదీశ్వరి. కరెక్ట్ గా చెప్పారని విరాట్, చంద్రకళ అంటారు. క్రాంతికి డాక్టర్ ను పిలిపించమని చెప్తుంది జగదీశ్వరి. మరోవైపు మార్కెట్లో సరోజా, జల్ రాజ్ చేపలు అమ్ముతుంటే శ్రుతి గల్లా పెట్టె దగ్గర కూర్చుంటుంది. శ్రుతి అరిస్తే జనాలు వరుస కడతారు.

డాక్టర్ గెటప్ లో అర్జున్
చేపల గురించి వచ్చినవాళ్లు శ్రుతిని చూస్తూ డబుల్ మీనింగ్ తో మాట్లాడతారు. రాజ్ చేపలన్నీ అమ్మేస్తారు. శ్రుతితో నాకు అల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పేస్తాడు రాజ్. మరోవైపు డాక్టర్ వస్తాడని శాలిని టెన్షన్ పడుతుంది. అందరూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటే అర్జున్ డాక్టర్ గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. నా పేరు ప్రకాష్. ఐయామ్ స్టిల్ బ్యాచిలర్ అనగానే శ్యామల కనెక్ట్ అయిపోతుంది.
శాలిని కంగారు
మీది గోదావరి జిల్లా కదా. 1995లో పదో బ్యాచ్ కదా అని అడుగుతుంది శ్యామల. ప్రకాష్ నీకు నేను ఎవరో గుర్తొచ్చేలా చేస్తానని శ్యామల అనుకుంటుంది. మీరేనా పేషెంట్? మీకు అంత గుర్తొచ్చేలా చేస్తానని డాక్టర్ అంటాడు. నేను మెడిసన్ తో కాదు మెదడుతో ట్రీట్ చేస్తాను. ముందుగా రఘురాం బ్రెయిన్ ను స్టడీ చేస్తా. ఆయనకు ఏం గుర్తుందో అడిగి తెలుసుకుంటా. మెమొరీ ఎలా గుర్తుకురావాలో చేస్తానని డాక్టర్ గెటప్ లో ఉన్న అర్జున్ అంటాడు.
సింగిల్ సింగిల్
ప్రకాష్ అంటూ ప్రేమగా మాట్లాడుతుంది శ్యామల. నానా హంగామా చేస్తుంది. గది లోపలికి వెళ్లిన తర్వాత మీ గెటప్ వర్కౌట్ అయిందని అర్జున్ తో విరాట్ అంటాడు. శ్యామల పిన్ని కనెక్ట్ అయింది. ప్రకాష్ స్టిల్ సింగిల్ అని చెప్పారు కదా. సింగిల్ సింగిల్ మింగిల్ అయిపోయారని చంద్రకళ అంటుంది. మాకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోందని చెప్తుంది.
శ్యామల ప్రేమ
శాలినిలో కంగారు మొదలైంది. థ్యాంక్ యూ అర్జున్. మీ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనిపిస్తోందని విరాట్ అంటాడు. మరోవైపు ప్రకాష్ కు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. నాకు పదో తరగతిలోనే పడిపోయాడు. నా క్లాస్ మేట్. అప్పుడే ఓకే చెప్పి ఉంటే సోల్ మేట్ అయ్యేవాడు. నా కోసం పెళ్లి చేసుకోకుండా ఒంటరివాడైపోయాడు. నేను ముందు బెంచ్ లో కూర్చుంటే అతను వెనకాల కూర్చునేవాడు. అతని చూపులు నా వీపునకు గుచ్చుకునేవి. ఇప్పటికీ ప్రకాష్ మనసులో నేనుంటే ఒక్కటైవడం తప్పు కాదు కదా అని శ్యామల అంటుంది.
తేజు డాక్టర్ చంద్రకు ఫోన్ చేస్తుంది. మీరు వస్తే కానీ బ్రేక్ ఫాస్ట్ తిననని గొడవ చేస్తుంది. మీరు వెంటనే రాకపోతే ప్రాబ్లెం మొదటకి వచ్చేస్తుందని డాక్టర్ చెప్తుంది. అరగంటలో వస్తానని చంద్ర చెప్పడంతో ఈ రోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


