నిన్ను కోరి జనవరి 10 ఎపిసోడ్: రఘురాంకు సైకియో మెమోరీ టెక్నిక్- మీసం ఊడిపోవడంతో దొరికిపోయిన అర్జున్- శ్యామల ఆగ్రహం

నిన్ను కోరి సీరియల్ జనవరి 10 ఎపిసోడ్‌లో రఘురాంకు సైకియో మెమోరీ టెక్నిక్ ద్వారా ట్రీట్‌మెంట్ చేసి మూడు రోజుల్లో గతం గుర్తుకు తెప్పిస్తానని డాక్టర్ ప్రకాష్‌గా వచ్చిన అర్జున్ చెబుతాడు. శ్యామల ప్రకాశ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాఫీ ఇవ్వబోతుంటే అర్జున్ మీసం ఊడిపోతుంది. దాంతో అర్జున్ దొరికిపోతాడు.

Published on: Jan 10, 2026, 09:11:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సైకియార్టిస్ట్ ప్రకాష్‌కు సేవలు చేస్తుంది శ్యామల. రఘురాంకు ట్రీట్‌మెంట్ ఇప్పుడే మొదలు పెడతానని ప్రకాష్‌‌గా వచ్చిన అర్జున్ అంటాడు. ఇంతలో అర్జున్‌కు మెసేజ్ వస్తుంది. పాప ఇద్దరం లేవని మారం చేస్తుంది. నేను వెళ్తాను అని చెబుతుంది చంద్రకళ.

నిన్ను కోరి సీరియల్ జనవరి 10 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జనవరి 10 ఎపిసోడ్‌

వెళ్లిపోయిన చంద్రకళ

బ్యాగ్‌తో వచ్చిన చంద్రకళ ఆఫీస్‌లో వర్క్ ఉందని చంద్రకళ వెళ్తుంది. యాక్సిడెంట్ తర్వాత ఎవరు గుర్తున్నారని ప్రకాష్ అడుగుతాడు. తన భార్య జగదీశ్వరి అని రఘురాం చెబుతాడు. రఘురాంను ఒక్కో ప్రశ్న అడుగుతాడు. అన్ని కరెక్ట్‌గా చెబుతాడు రఘురాం.

నేను సైకియో మెమోరీ అనే కొత్త టెక్నిక్ వాడుతున్నాను. దాంతో మూడు రోజుల్లో రఘురాం గారు అన్ని గుర్తు చేసుకుంటారు అని చెబుతాడు ప్రకాష్. ఇక తనకు రెస్ట్ కావాలని ప్రకాష్ వెళ్లిపోతాడు. ఎలాంటి మందులు లేకుండా బాగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. మంచి డాక్టర్‌ను తీసుకొచ్చావురా క్రాంతి అని జగదీశ్వరి మెచ్చుకుంటుంది.

దాంతో కోపంగా పక్కన ఉన్న షోకేజ్ విగ్రహాన్ని నెట్టేస్తుంది శాలిని. దానికి రఘురాం అప్పటివరకు జరిగింది మర్చిపోతాడు. శ్యామలను చూసి మీరు ఎవరు. ట్రీట్‌మెంట్‌కు వచ్చిన డాక్టర్ భార్యన అని అంటాడు. దాంతో శ్యామల సిగ్గు పడుతుంది. తను మీ చెల్లెలు శ్యామల అని చెప్పి తీసుకెళ్లిపోతుంది జగదీశ్వరి.

తేజు గురించి ఆరా

మరోవైపు తేజు అన్నం తినను అని మారం చేస్తుంది. ఇంతలో చంద్రకళ వచ్చి సర్దిచెబుతుంది. చంద్రకళకు అర్జున్ కాల్ చేసి తేజు గురించి అడుగుతాడు. ఇప్పుడు తింటుంది అని చెబుతుంది చంద్రకళ. పాపతో అర్జున్ మాట్లాడుతాడు. అమ్మను ఇబ్బంది పెట్టొద్దు అని అర్జున్ చెబుతాడు. తర్వాత ఫోన్‌లో హస్బండ్ అని ఉండకుండా అర్జున్ గారు అని ఎందుకుంది. మీరు అని ఎందుకు అంటున్నావ్ అని అడుగుతుంది తేజు.

అది సరదాకి. మేము పరిచయం అయినప్పుడు అలాగే పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం అని చంద్రకళ కవర్ చేస్తుంది. మరోవైపు ఛార్జర్ కోసం వెతికిన కామాక్షి శ్రుతిని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో శ్యామల పడుచు పిల్లలా అందంగా రెడీ అయి వస్తుంది. గజ్జెల గుర్రంలా రెడీ అయ్యావేంటీ అని కామాక్షి అంటుంది. శ్యామలపై సెటైర్లు వేస్తుంది కామాక్షి.

ప్రకాష్‌కు నచ్చుతానంటావా అని శ్యామల అడుగుతుంది. సైలెంట్‌గా ఉంటుంది కామాక్షి. ఆ డాక్టర్‌ను నీ పిచ్చి తగ్గించమని చెప్పు అని కామాక్షి అంటుంది. ముదిరిన వయసులో పుట్టిన ప్రేమ పిచ్చిగానే ఉంటుందే అని శ్యామల అంటుంది. మరోవైపు విరాట్ గదిలో అర్జున్ గడ్డం తీస్తాడు. ఇంతలో శ్యామల వచ్చి డోర్ కొడుతుంది. దాంతో కంగారుగా గడ్డం పెట్టుకుంటాడు ప్రకాష్.

బ్లూటూత్ పతి

తర్వాత విరాట్ డోర్ తీస్తాడు. డోర్ తీయడం ఇంతసేపు ఏంట్రా అని శ్యామల అంటే బ్లూటూత్ పతి అని విరాట్ అంటాడు. అదేంట్రా అని శ్యామల అంటే.. పేషంట్స్ మాట్లాడేందుకు మొహమాట పడితే పక్కకు వెళ్లి బ్లూటూత్‌లో కౌన్సిలింగ్ ఇస్తామని అర్జున్ కవర్ చేస్తాడు. ప్రకాశ్ మీకు ఏం ఇష్టం అని శ్యామల అడుగుతుంది.

అదే ఫుడ్, లంచ్ కోసం అని శ్యామల అంటుంది. ఇంతలో చంద్రకళ వస్తే చిరాకు పడుతుంది శ్యామల. నీ పచ్చళ్లదో ఓ కంపెనీ. దానికో పార్టనర్. ఆ అర్జున్‌కు అసలు బుద్ధే లేదు. నీ వల్ల నష్టం వచ్చిన నిన్నే పట్టుకుని ఊగులాడుతున్నాడు అని శ్యామల అంటుంది. దాంతో రిలాక్స్ శ్యామల అని ప్రకాష్ అంటాడు. దానికి పులకరించిపోతుంది శ్యామల.

దొరికిపోయిన అర్జున్

ఎంత మధురంగా ఉందో అంటుంది. అలా టెన్షన్ పడకండి. మీరు మీ హెల్త్ మీద జాగ్రత్త వహించండి అని రొమాంటిక్‌గా చెబుతాడు ప్రకాష్. తర్వాత ప్రకాష్‌కు కాఫీ ఇచ్చేందుకు శ్యామల వెళ్తుంది. అర్జున్ డోర్ తీస్తాడు. కానీ, మీసం ఊడిపోయి కనిపిస్తుంది. అలా అర్జున్ దొరికిపోతాడు. అది శ్యామల చూసిన ఆగ్రహంతో ఊగిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More