బ్రహ్మముడి ప్రోమో: కావ్యతో చేతులు కలిపిన లేడి డాక్టర్- బిడ్డలను మార్చడంపై ఎంక్వైరీ- కన్నబిడ్డను పట్టుకునేందుకు పోరాటం!

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్య వాళ్లు తీసుకొచ్చిన పాపకు ఉన్న గుండె సమస్య గురించి లేడి డాక్టర్ అనురాధ చెబుతుంది. దాంతో కావ్య డాక్టర్‌తో గొడవ పెట్టుకుంటుంది. తర్వాతి రోజు అనురాధ దగ్గరికి వచ్చి తల్లిగా ఆలోచించమని వేడుకుంటుంది. దాంతో కావ్యతో చేతులు కలుపుతుంది డాక్టర్ అనురాధ.

Published on: Jan 25, 2026, 08:47:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో మంత్రి ఇంటికి వెళ్లి నిలదీసిన డాక్టర్ చక్రవర్తి తలపై కొట్టి బంధిస్తాడు ధర్మేంద్ర. చంపకుండా, నిజం బయటపడకుండా ఉండేందుకు చక్రవర్తిని కిడ్నాప్ చేస్తాడు మంత్రి. ఇకనుంచి హాస్పిటల్‌కు చక్రవర్తి రాడని హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేసి చెబుతాడు ధర్మేంద్ర.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

పాప సమస్య చెప్పిన డాక్టర్

హాస్పిటల్‌లో ఏ విషయం జరిగినా తనకు సమాచారం అందించాలని నర్సుతో మంత్రి ధర్మేంద్ర అంటాడు. దానికి నర్స్ సరేనంటుంది. మరోవైపు కావ్య వాళ్లను పిలవడంతో లేడి డాక్టర్ అనురాధ దగ్గరికి వెళ్తారు. కావ్య ఎలా ఉన్నారు. ఇప్పుడు కుదుటపడ్డారా అని అనురాధ అడుగుతుంది. కానీ, కావ్య మాత్రం సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉంటుంది.

పాప రిపోర్ట్స్ చూడమని రాజ్ కోరడంతో అనురాధ చూస్తుంది. పాప రిపోర్ట్స్ చూసిన డాక్టర్ అనురాధ షాక్ అవుతుంది. అసలు పాపకు ఎందుకు అలా అయిందని రాజ్ అడిగితే.. పాపకు హైపో ప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అనే గుండె సమస్య ఉంది. దీని వల్ల బ్లడ్ పంపింగ్ సరిగా జరగదు. ఊపిరి అందదు అని డాక్టర్ అనురాధ చెబుతుంది. మరి ఇప్పుడు ఎలా అని రాజ్ అడిగుతాడు.

ఆపరేషన్ చేయాలని, దానికి చాలా ఖర్చు అవుతుందని, ఆపరేషన్ చేసిన కూడా పాప బతుకుతుందని గ్యారెంటీ ఇవ్వలేమని డాక్టర్ అనురాధ చెబుతుంది. దాంతో రాజ్, కావ్య కంగారుపడతారు. ఇంతలోనే తనకు జరిగింది గుర్తు చేసుకున్ కావ్య ఒక్కసారిగా డాక్టర్ అనురాధపై విరుచుకుపడుతుంది.

హెల్తీ బిడ్డను మార్చారు

ఎవరి బిడ్డకూ మీరు చెప్పిన వ్యాధి ఉంది. అదే సమయంలో నాకు పాప పుట్టింది. ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యంగా లేని ఆ బిడ్డని మాకిచ్చి హెల్తీగా ఉన్న నా బిడ్డను వాళ్లకు ఇచ్చారు. మర్యాదగా మా బిడ్డను మాకు ఇవ్వండి అని కావ్య గొడవ చేస్తుంది. ఏంటీ కావ్య గారు ఇలా మాట్లాడుతున్నారు. మేమెందుకు ఇలా చేస్తాం అని అనురాధ అంటుంది.

రాజ్ కూడా కావ్యను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ, కావ్య వినదు. డాక్టర్‌పై కోపంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నా పాపను నాకు ఇచ్చి ఈ పాపను వారికే ఇచ్చేయండి. ఇందుకే బిడ్డలను మార్చారని కావ్య రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో కావ్యను రాజ్ బలవంతంగా తీసుకెళ్తాడు. డాక్టర్ అనురాధ డిస్టర్బ్ అయిపోతుంది.

తర్వాత ఇంటికెళ్లిన రాజ్, కావ్యలను అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్ వాళ్లు పాపకు ఏమైందని అడుగుతారు. దాంతో పాపకు ఉన్న గుండె సమస్య గురించి చెబుతారు. దానికి అంతా ఒక్కసారిగా షాక్ అయి బాధపడతారు. పాప పుట్టిందని సంతోషించాలా, కావ్య పరిస్థితి, బిడ్డ అనారోగ్యం చూసి ఏడవాల అర్థం కావట్లేదని కుమిలిపోతారు.

కన్నబిడ్డను పట్టుకునేందుకు

తనకు జరిగింది అంతా గుర్తు చేసుకున్న కావ్య పాప అనారోగ్యంగా ఉందనే బిడ్డలను మార్చారు. అది ఎవరో కనిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. పాపను స్వప్నకు ఇస్తుంది కావ్య. నేను బయటకు వెళ్తున్నాను. వచ్చేదాకా పాపను జాగ్రత్తగా చూసుకో అని కావ్య అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అక్క అని పక్కనే ఉన్న అప్పు అడుగుతుంది.

నా కన్నబిడ్డను పట్టుకుందామని వెళ్తున్నా అని కావ్య చెబుతుంది. స్వప్న, అప్పు వద్దని వారిస్తారు. కానీ, కావ్య మాత్రం వినకుండా వెళ్తుంది. వెళ్లి డాక్టర్ అనురాధను కలుస్తుంది కావ్య. తన పాప మిస్సింగ్ గురించి అనురాధకు చెబుతుంది. కానీ, అనురాధ మాత్రం వినదు.

ఒక్కసారి మీరు పేషంట్లకు వైద్యం చేసే డాక్టర్‌గా కాకుండా బిడ్డకు ప్రాణం పోసే తల్లిగా ఆలోచించండి. ఈ అమ్మ వేదన ఏంటో మీకు అర్థం అవుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. ప్లీజ్ డాక్టర్ నాకు సహాయం చేయండి అని చేతులు జోడించి మొక్కుతూ ప్రాధేయపడుతుంది కావ్య.

కావ్యతో చేతులు కలిపిన లేడి డాక్టర్

కావ్య కన్నీళ్లకు కరిగిపోయిన లేడి డాక్టర్ అనురాధ తనవైపు నుంచి కూడా నిజం ఉండొచ్చని ఆలోచిస్తుంది. సరే, మీకోసం ఒక్కసారి పొరపాటు ఎక్కడైన జరిగిందా అని ఎంక్వైరీ చేస్తానని కావ్యకు మాట ఇస్తుంది డాక్టర్ అనురాధ.

కళావతి బిడ్డను పట్టుకునేందుకు, ఆస్పత్రిలో బిడ్డలను మార్చడంపై ఎంక్వైరీ చేసేందుకు కావ్యతో చేతులు కలుపుతుంది లేడి డాక్టర్ అనురాధ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More