బ్రహ్మముడి జనవరి 20 ఎపిసోడ్: డీఎన్‌ఏ టెస్టుకు సిద్ధమైన కావ్య.. మంత్రిలో మొదలైన టెన్షన్.. పాపను వదలని తులసి
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్ లో తన పాప కోసం కావ్య డీఎన్ఏ టెస్టుకు కూడా సిద్ధమవుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా తన చేతుల్లోని పాప తనది కాదని వాదించే కావ్య.. ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధమవుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 934వ ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. హాస్పిటల్లో బిడ్డలను తీసుకొని ఎవరికి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు ఇటు కావ్య, అటు తులసి. అయితే ఇంటికి వెళ్లినా ఆ బిడ్డ తన బిడ్డ కాదని కావ్య వాదించడంతో ఇక లాభం లేదనుకొని డీఎన్ఏ టెస్టుకు సిద్ధమవుతాడు రాజ్. అందుకు కావ్య సరే అంటుంది.

తన పాపను ఇస్తేనే వెళ్తానన్న కావ్య
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్ కావ్యను హాస్పిటల్ ను రెండు రోజుల ముందే డిశ్చార్జ్ చేయాల్సిందే అని డాక్టర్ చెప్పడంతో మొదలవుతుంది. తన బిడ్డ కోసం ఆమె హాస్పిటల్లో చేసిన గొడవతో ఆమెను తీసుకెళ్లాల్సిందే అని చెప్పడంతో రాజ్ కు మరో దారి లేక సరే అంటాడు.
కావ్య దగ్గరికి వెళ్లి ఇదే విషయం చెబితే ఆమె తన పాపను ఇస్తేగానీ వెళ్లేది లేదని తేల్చి చెబుతుంది. పాపను కూడా చేతుల్లోకి తీసుకోకపోవడంతో రాజ్ తీసుకుంటాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో రాజ్ సహనం కోల్పోతాడు. ఏం మాట్లాడినా తాను చచ్చినంత ఒట్టు అని అనడంతో కావ్య దిగి వస్తుంది. ఇటు కావ్య, అటు తులసి వెళ్లిపోతారు.
ఎగిరి గంతేసిన రుద్రాణి
అది చూసిన రుద్రాణి ఎగిరి గంతేస్తుంది. రాహుల్, రేఖలతో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక దుగ్గిరాల ఇంట్లో కావ్య వల్ల రోజూ నరకమే అని, ఆమె బిడ్డ ఎక్కడ ఉందో వాళ్లకు ఎప్పటికీ తెలియదని అంటుంది. ఇదే అదునుగా ఆస్తిని రాహుల్ సొంతం చేసి.. రాజ్ ను నీ సొంతం చేస్తానని రేఖకు రుద్రాణి మాటిస్తుంది. ఇంట్లో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తనకు చెబుతుండాలని, బయటి నుంచే తాను స్కెచ్ వేస్తుంటానని అంటుంది.
ఇంటికి వచ్చిన తర్వాతా కావ్యను నమ్మని ఫ్యామిలీ
ఇటు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కావ్య మొండిపట్టు కొనసాగిస్తుంది. అయినా ఇంట్లో వాళ్లు మాత్రం ఆమెను నమ్మరు. ఆడదానికి ప్రసవం మరో జన్మ అని, ఈ సమయంలో మనసు ఎన్నో రకాలుగా మారడం సహజమని ఇందిరా దేవి అంటుంది. అయినా కావ్య మాత్రం వినదు. ఈ పాప తన పాప కాదు అని వాదిస్తుంది. రాజ్ కోప్పడంతో పాపను అపర్ణ చేతిలో పెడుతుంది. తన పాప ఎక్కడుందో తానే తెలుసుకుంటానంటూ గదిలోకి వెళ్లిపోతుంది.
కావ్యను ఓదార్చిన రాజ్.. వెనక్కి తగ్గని కళావతి
ఓ సమస్య తీరగానే మరొకటి వచ్చి పడుతుంది.. ఎలా అని అపర్ణ బాధపడుతుంది. రాజ్ వెళ్లి కావ్యను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కన్న పేగు కాబట్టే ఈ పాప తన పాప కాదని చెబుతున్నానని అంటుంది. ఈరోజుల్లో హాస్పిటల్లో అలా పాపను మార్చడం అంత సులువు కాదని, నీదంతా కేవలం భ్రమే అని రాజ్ చెప్పి చూస్తాడు. అయినా కావ్య మాత్రం వినదు.
చేతిపై పుట్టు మచ్చ ఏదని ప్రశ్నించిన కావ్య
తన పాపను పుట్టగానే తాను చూశానని, చేతిపై ఉన్న పుట్టుమచ్చ వారం రోజుల్లోనే ఎలా మాయమైందని నిలదీస్తుంది. దీంతో రాజ్ కూడా ఆలోచనలో పడతాడు. కానీ తామంతా పాపతోనే ఉన్నామని, ఆ పుట్టమచ్చను ఎవరూ చూడలేదని, నువ్వు కొత్తగా చెబుతావేంటని అంటాడు. రాజ్ ఎంత చెప్పినా.. తాను తన పాప ఎక్కడుందో కనిపెట్టి తీరతానని మరోసారి తేల్చి చెబుతుంది.
అటు మంత్రి ధర్మేంద్ర ఇంట్లో కావ్యను పాపను చూసి తులసి మురిసిపోతుంది. ఆమె ఫ్యూచర్ ప్లాన్ కూడా రెడీ చేస్తుంది. కనీసం భర్తకు కూడా ఆ పాపను ఇవ్వదు. క్రమంగా కావ్య పాపపై మమకారం పెంచుకుంటూ ఉంటుంది.
ఇటు చేసేది లేక ఆ పాప మన పాపో కాదో తెలుసుకోవడానికి డీఎన్ఏ టెస్టు మాత్రమే మార్గమని కావ్యతో అంటాడు రాజ్. అందుకు ఆమె కూడా సిద్ధమంటుంది. తన పాప కోసం ఏం చేయడానికైనా రెడీ అంటుంది. అదే విషయం రుద్రాణి వెళ్లి మంత్రికి చెబుతుంది. అదే జరిగితే ఆ పాప వాళ్ల పాప కాదని తేలిపోతుందని అంటుంది. దీంతో ధర్మేంద్రలో ఆందోళన మొదలవుతుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


