బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్: రుద్రాణి కొత్త ప్లాన్- మంత్రికి దొరికిపోయిన రాజ్, కావ్య- కూతురుని చూసి నిజం నమ్మిన స్వరాజ్
బ్రహ్మముడి సీరియల్ జనవరి 30 ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్ర ఇంటికి వెళ్లిన కావ్య 15 రోజులు గడువు ఇచ్చి ఛాలెంజ్ చేసి వస్తుంది. ఇంటికొచ్చిన కావ్య భర్త రాజ్‌కు నిజం చెబుతుంది. రిపోర్ట్స్ చూపిస్తుంది. మంత్రి ధర్మేంద్ర ఇంటికి దొంగల్లా రాజ్, కావ్య వెళ్తారు. కానీ, అక్కడ పాప ఏడవడంతో ధర్మేంద్రకు దొరికిపోతారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్ర ఇంటికి వెళ్లిన కావ్య తన బిడ్డను మార్చినందుకు నిలదీస్తుంది. నేనే మార్చాను. నీ బిడ్డను నీ దగ్గరికి చేర్చను. నీ మీద నాకు ఎలాంటి పగ లేదు. ఆరోజు నా బిడ్డకు ఆరోగ్యం సరిగా లేదు. నా భార్య తట్టుకోలేదని అలా చేశాను. నా భార్య కోసం ఎంతదూరమైనా వెళ్తాను అని మంత్రి అంటాడు.

ఒక్క సాక్ష్యం లేదు
నీ భార్య కోసం ఇంకో తల్లిని వేధిస్తావా అని కావ్య అంటుంది. నా దగ్గర ఉన్న బిడ్డ నీ బిడ్డ అని చెప్పడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యం లేదు. డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్చింది నేనే. దేశంలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించినా నాకు అనుకూలంగానే వస్తుంది. మనం ఇద్దరం రాజీకి వద్దాం. మీరు మళ్లీ కనొచ్చు. మేము కనలేం. నీకు ఎంత కావాలో అంతా ఇస్తాం అని మంత్రి ధర్మేంద్ర అంటాడు.
పదవి, డబ్బు ఉందని విర్రవీగుతున్నావు కదు. నీ పవర్‌ను పెకిలిస్తాను. ఇక నీకు నాకే పోటీ. ఆట నువ్వు మొదలుపెట్టావ్ ముగింపు నేను ఇస్తాను. నా బిడ్డను నేను తీసుకెళ్తాను. నీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను. నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని నా చేతిలో పాపను పెట్టేలా చేస్తాను గుర్తుంచుకో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య.
దాని కాన్ఫిడెన్స్ ఏంటీ రుద్రాణి. మినిస్టర్‌తో మాట్లాడుతున్నా విషయమే మర్చిపోయింది. దాన్ని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది అని ధర్మేంద్ర అంటాడు. దానిది ఒంటరి పోరాటం. ఈరోజు నుంచి దాని ఇంట్లో అల్ల కల్లోలం అవుతోంది. కట్టుకున్న భర్త, ఇల్లే తనను పిచ్చిదానిలా చూస్తారు. కంగారు పడకండి అని రుద్రాణి చెబుతుంది.
కావ్యను తిట్టిన రాజ్
మరోవైపు ఇంటికి కావ్య వెళ్తే రాజ్ ఆగమంటాడు. ఎక్కడికెళ్లావని నిలదీస్తాడు. పాపకోసం అని కావ్య అంటుంది. కావ్యను ఇష్టమొచ్చినట్లు తిడతాడు రాజ్. అపర్ణ ఆపుతుంది. కావ్య ఎందుకు ఇలా చేస్తున్నావ్. నీ మాట మేమెప్పుడైన కాదన్నమా. నిజానికి భ్రమకు ఎందుకు తేడా తెలుసుకోలేకపోతున్నావ్ అని అపర్ణ అంటుంది. అంతా నచ్చ జెప్పాలని చూస్తారు.
ఇప్పటివరకు నా అనుమానంతో మిమ్మల్ని కంగారుపెట్టాను. ఇప్పుడే నిజం తెలుసుకున్నాను. ఈరోజే నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. ఈరోజు నా కంటికి నా గమ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎలా చేరుకోవాలనే ఉంది. మీకు ఏ బాధ ఉండదు అన్న కావ్య పాపను తీసుకుని వెళ్తుంది. కావ్య చెప్పింది అర్థం కాలేదని అంతా అంటారు.
ఇవాళ ఒక పాపను చూసి ఉంటుంది. తనే తన బిడ్డ అని అనుకుంటుంది. వేరే వాళ్ల పాపను తన పాప అంటే ఇంకెన్ని గొడవలు వస్తాయో అని రేఖ అంటుంది. రేఖ చెప్పింది నిజమే కావ్యతో ప్రశాంతంగా మాట్లాడు అని రాజ్‌తో అపర్ణ అంటుంది. మరోవైపు రేఖకు రుద్రాణి కాల్ చేస్తుంది. కావ్యను పిచ్చిదానిలా చిత్రీకరించాను అని రేఖ అంటుంది.
15 రోజుల గడువు
కానీ, కావ్య వచ్చి అందరిని కన్విన్స్ చేసింది అని రేఖ అంటుంది. దాంతో మినిస్టర్ ఇంటికి కావ్య వచ్చింది. 15 రోజుల గడువు గురించి చెబుతుంది రుద్రాణి. తల్లి ఇచ్చిన మాట గురించి అడిగి తిడుతుంది రేఖ. కావ్యను ఎలా అడ్డుకోవాలో. అది ఎప్పటికీ దాని కూతురును చేరుకోలేదు. నేను అనుకున్నంతవరకు కావ్యను ఇల్లు దాటి బయటకు వెళ్లకుండా చూసుకో. కావ్య మీద అనుమానం వచ్చేలా చేయు అని రుద్రాణి అంటుంది.
ఈరోజు నువ్వు మినిస్టర్ ఇంటికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావ్ కావ్య. ఈ విషయం నాకు తెలిసేలా చేసి నీ బిడ్డను నువ్వే దూరం చేసుకోబోతున్నావ్ అని రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. రాత్రి పూట పాపను ఆడిస్తుంది కావ్య. రాజ్ వచ్చి మాట్లాడుతాడు. నేను చివరి ప్రయత్నంగా ఇవాళ హాస్పిటల్‌కు వెళ్లాను అని గుడికి వెళ్లింది, నీలవేణి నిజం ఒప్పుకుంది, మంత్రితో 15 రోజుల ఛాలెంజ్ గురించి చెబుతుంది కావ్య.
అదంతా విన్న రాజ్ షాక్ అవుతాడు. కావ్య రిపోర్ట్స్ చూపిస్తుంది. మీకు నమ్మకం లేకుంటే మీ కళ్లముందే నిజం నిరూపిస్తాను. మినిస్టర్ ఇంటికి వెళ్దాం. నన్ను నమ్మి ఒక్కసారి రండి అని కావ్య అంటుంది. రాజ్ సరే అంటాడు. మంత్రి ఇంటికి ఇద్దరు వెళ్తారు. పాపను ఎత్తుకుని కావ్య ఏడుస్తుంది. రాజ్‌కు మీ కూతురు అని చూపిస్తుంది.
మంత్రికి దొరికిన రాజ్, కావ్య
స్వరాజ్ కూతురుని చూసి కావ్య చెప్పింది నిజమే అని నమ్ముతాడు. అచ్చం నీలాగే ఉందని రాజ్ అంటాడు. ఇంతలో పాప ఏడుస్తుంది. రాజ్, కావ్య కంగారుపడతారు. పైకి తులసి, మంత్రి ధర్మేంద్ర వస్తారు. మంత్రి ధర్మేంద్రకు రాజ్, కావ్య దొరికినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


