బ్రహ్మముడి ఫిబ్రవరి 6 ఎపిసోడ్: మంత్రికి దినదిన గండం- తప్పు ఒప్పుకున్న ధర్మేంద్ర- ఇంట్లోవాళ్లకు నిజం చెప్పిన రాజ్
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్రకు చుక్కలు చూపిస్తుంది కావ్య. ప్రతి రోజు ఇంటికి వెళ్తుంది. దీంతో ఈ టార్చర్ పడలేను అని బిడ్డలను మార్చిన వాళ్లకు కారణం ఉంటుంది కదా అని తులసితో చెబుతాడు. రాజ్‌తో డీల్ చేసుకుంటాడు. కానీ, రాజ్ వినడు. రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మీ గొడవ చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ధర్మేంద్ర భార్యకు ఎప్పుడు నిజం చెబుతామో అని భయపడుతున్నాడని రాజ్ అంటాడు. భార్యను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించుతాడనిపిస్తోందని కావ్య అంటుంది.

తల్లి అనురాగం ముందు
అలాంటి వాడికి తెలివితోనే బుద్ధి చెప్పాలని, తెగింపు కోసం ఒక మెట్టు మనమే ఎక్కువ ఉంటాం. వాడిది ఆరాటం మనది పోరాటం. తల్లి అనురాగం ముందు వాడు ఓడిపోక తప్పదు. ఈరోజు నుంచి వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూస్తూ ఉండూ అని రాజ్ అంటాడు. మరోవైపు కావ్య పాప గురించి ధర్మేంద్రను అడిగితే షాక్ అవుతాడు. కవర్ చేసి వెళ్లిపోతాడు.
తర్వాత గుడిలో తులసిని కావ్య కలుస్తుంది. అది చూసిన ధర్మేంద్ర షాక్ అవుతాడు. రోజులు గడుస్తుంటాయి. ధర్మేంద్ర, తులసి భోజనం చేస్తుంటే కావ్య వస్తుంది. తులసి లేచి వెళ్లి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్‌పై కావ్యను కూర్చోపెడుతుంది. మంత్రి ధర్మేంద్ర ఇంట్లో కావ్య టిఫిన్ చేస్తుంది. తులసికి చాలా క్లోజ్ అవుతుంది. పాపను కావ్య తీసుకెళ్తుంది.
మంత్రి వచ్చి మా పాపను మాకిచ్చేయ్ అంటాడు. కానీ, అదంతా కల కంటాడు ధర్మేంద్ర. పాపను కావ్య తీసుకెళ్లిపోయినట్లు ధర్మేంద్ర కల అంటాడు. అంతలా ధర్మేంద్రకు చుక్కలు చూపిస్తుంది కావ్య. ఈ టెన్షన్, ఈ టార్చర్ పడలేను. భయపడుతూ బతకలేను. ప్రశాంతంగా ఉండాలి. నాకు నేనుగా నా భార్య ముందు నిజం ఒప్పుకోవాలి. క్షమించమని కోరాలి. ఇలా దిన దిన గండంగా బతకలేను అని మంత్రి ధర్మేంద్ర అనుకుంటాడు.
తులసికి నిజం చెప్పిన మంత్రి
తులసి దగ్గరికి వెళ్తాడు ధర్మేంద్ర. కావ్య పాప గురించి మాట్లాడుతూ బిడ్డను మార్చే పరిస్థితి వరకు వెళ్లారంటే వాళ్లకు ఎంత పెద్ద సమస్య, బలమైన కారణం ఉందేమో అని నిజం చెబుతాడు ధర్మేంద్ర. కారణం ఏదైనా తల్లికి బిడ్డను దూరం చేస్తారా. వాళ్లు దుర్మార్గులు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. చివరికి అది మీరైనా అని తులసి తెగేసి చెబుతుంది.
నేనెందుకు చేస్తానని ధర్మేంద్ర అంటే.. ఛీ ఛీ ఉదాహరణకు చెప్పాను. మీరు అలా చేస్తే నేను బతకగలనా అని తులసి అంటుంది. దాంతో షాక్ అయిన ధర్మేంద్ర రాజ్‌కు కాల్ చేసి కలుద్దామంటాడు. దాంతో రాజ్‌తో డీల్ చేసేందుకు మంత్రి ధర్మేంద్ర కలుస్తాడు. నాకు హక్కు లేదు. కానీ పాపను ఇవ్వలేను. భార్యకు నిజం చెప్పలేను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని ధర్మేంద్ర అంటాడు.
మరి నా భార్య సంగతి ఏంటీ అని రాజ్ అడుగుతాడు. ఎమోషనల్‌గా డైలాగ్స్ చెబుతాడు రాజ్. బిడ్డ గురించి కావ్య పడిన వేదన, గండాలు, అన్ని చెబుతాడు రాజ్. నా నిర్ణయం మాత్రం మారదు అని ధర్మేంద్ర అంటాడు. రేపే నీ కన్నబిడ్డకు ఆపరేషన్ చేయిస్తున్నావ్. రేపటివరకే నీకు గడువు. అది దాటాక నిజాలన్నీ బయటపడిపోతాయ్ అని రాజ్ వెళ్లిపోతాడు.
బారసాల చేయిస్తున్నాం
మరోవైపు తులసి దగ్గరికి పాపతో కావ్య వెళ్తుంది. ఇంటికొచ్చిన కావ్యకు మా పాపకు బారసాల చేయిస్తున్నాం. మీరు తప్పకుండా రావాలని చెబుతుంది తులసి. తన దగ్గరున్న పాపకు ఆపరేషన్ చేయిస్తున్నామని కావ్య చెబుతుంది. పరాయి బిడ్డకు కూడా ఆయుష్షు పోయాలని చూస్తున్న నీకు అంతా మంచే జరుగుతుందని తులసి అంటుంది.
మీరు కన్నతల్లేగా మీరు కూడా ఈ పాపను ఆశీర్వదించండి అని కావ్య అంటే.. తన కన్నబిడ్డకే దీవెనలు అందిస్తుంది తులసి. తర్వాత రాజ్, కావ్య రూట్ మార్చారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రుద్రాణికి కంగారుగా చెబుతాడు మంత్రి. ఇంతదూరం ఎందుకు రానిచ్చారు అని రుద్రాణి అంటుంది.
ఆరోజు పిల్లలను మార్చినప్పటి నుంచి నాకు తప్పు చేసిన ఫీలింగ్ ఉంది. ఇదంతా చేసింది కేవలం నా భార్య కోసమే. మరో తల్లి గురించి ఆలోచించలేదు అని ధర్మేంద్ర అంటాడు. ఇకపై నేను నడిపిస్తాను. నేను చెప్పింది వినండి అని రుద్రాణి అంటుంది. ధర్మేంద్రకు బ్రెయిన్ వాష్ చేస్తుంది రుద్రాణి. నేను చేస్తాను చూడండి అని మంత్రిని పంపించేస్తుంది రుద్రాణి.
నిజం చెప్పిన రాజ్
రుద్రాణి చెప్పుడు మాటలు విన్న ధాన్యలక్ష్మీ ఇంట్లో గొడవ చేస్తుంది. దాంతో మంత్రి బిడ్డలను మార్చిన నిజాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పేస్తాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


