Engagement: రేపే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్- లాయర్ ఇంటికి అల్లుడిగా హీరో- ట్రెండింగ్‌లో కాబోయే భార్య పేరు!

Bellamkonda Sai Sreenivas Engagement: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం రేపే (మార్చి 8) జరగనున్నట్లు సమాచారం. విజయ్, అల్లు శిరీష్ తర్వాత ఈ హీరో నిశ్చితార్థం జరగనుండటంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

Mar 7, 2026, 13:35:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్న రష్మిక-విజయ్ దేవరకొండ, నిన్న అల్లు శిరీష్.. ఇలా వరుసగా యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది.

రేపే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్- లాయర్ ఇంటికి అల్లుడిగా హీరో- ట్రెండింగ్‌లో కాబోయే భార్య పేరు!
రేపే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్- లాయర్ ఇంటికి అల్లుడిగా హీరో- ట్రెండింగ్‌లో కాబోయే భార్య పేరు!

పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో

ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అతనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల కిష్కింధపురి సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

రేపే నిశ్చితార్థం?

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ఇంట్లో పూర్తయ్యాయని, రేపే అంటే మార్చి 8నే నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని సమాచారం. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎంగేజ్‌మెంట్ పూర్తయిన వెంటనే పెళ్లి తేదీ, వేదిక వంటి వివరాలను బెల్లంకొండ కుటుంబం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్.

ఎవరీ కావ్య రెడ్డి?

అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే యువతితో ఆయన ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.

కావ్య రెడ్డి కుటుంబ నేపథ్యం

కావ్య రెడ్డి తాతగారు గతంలో జడ్జిగా పనిచేశారని, తండ్రి ప్రముఖ లాయర్ అని సమాచారం. అంటే లాయర్ ఇంటికి హీరో సాయి శ్రీనివాస్ అల్లుడు కానున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా పరిచయం ఉందని, పెద్దలు కుదిర్చిన సంబంధం ఇదని సన్నిహితులు చెబుతున్నారు. సాయి శ్రీనివాస్ కాబోయే భార్య కావ్య రెడ్డి గురించి వివరాలు తెలియడంతో అప్పుడే సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

‘అల్లుడు శీను’ నుంచి ‘కిష్కింధపురి’ దాకా

2014లో ‘అల్లుడు శీను’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడి అవార్డును అందుకున్నారు. ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

వందల మిలియన్ల వ్యూస్

ముఖ్యంగా ఆయన నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. దీనివల్ల ఉత్తరాదిలోనూ శ్రీనివాస్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ కారణంతోనే హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేశారు. ఇక ఇటీవల భైరవం, కిష్కింధపురి సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్

కొత్త అధ్యాయం

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’, ‘హైందవం’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితం పరంగా శ్రీనివాస్ ఇప్పుడు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More