మూడేళ్లుగా వేధింపులు, ఫిర్యాదులు చేసిన మారని తీరు- ట్విన్ బ్రదర్స్ అరాచకంపై డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి రవీనా రవి ఆవేదన

డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి రవీనా రవి గత మూడేళ్లుగా తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు హెచ్చరించిన కూడా స్టాకర్ల తీరు మారలేదని, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారంటూ రవీనా రవి తన గోడు వెళ్లబోసుకున్నారు.

Published on: Feb 7, 2026, 14:16:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవీనా రవి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత మూడేళ్లుగా ఇద్దరు వ్యక్తులు తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా బయటపెట్టారు. పోలీసులు ఫిర్యాదు చేసినా, హెచ్చరికలు జారీ చేసినా వారి వేధింపులు తగ్గకపోవడంతో రవీనా రవి బహిరంగంగా స్పందించాల్సి వచ్చింది.

మూడేళ్లుగా వేధింపులు, ఫిర్యాదులు చేసిన మారని తీరు- ట్విన్ బ్రదర్స్ అరాచకంపై డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి రవీనా రవి ఆవేదన
మూడేళ్లుగా వేధింపులు, ఫిర్యాదులు చేసిన మారని తీరు- ట్విన్ బ్రదర్స్ అరాచకంపై డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి రవీనా రవి ఆవేదన

అసలు ఏం జరిగింది?

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వేధింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను రవీనా రవి షేర్ చేశారు. శబరీష్ అనే వ్యక్తి, అతని కవల సోదరుడు (ట్విన్ బ్రదర్స్) కలిసి ఈ అరాచకానికి పాల్పడుతున్నట్లు రవీనా రవి గుర్తించారు. "ఇది పబ్లిక్ అవేర్‌నెస్ కోసం చేస్తున్న పోస్ట్.. ఎవరూ నిర్లక్ష్యం చేయకండి. నా కుటుంబాన్ని, స్నేహితులను రక్షించుకోవడానికే నేను ఈ విషయాన్ని బయటపెడుతున్నాను" అని రవీనా రవి పేర్కొన్నారు.

ట్విన్ బ్రదర్స్ వేధింపుల తీరు గురించి చెబుతూ.. "వారు మెసేజ్‌లు, కామెంట్లలో అత్యంత అసభ్యకరమైన భాషను వాడుతున్నారు. చట్టపరమైన మార్గాలను అనుసరించినా ఫలితం లేకపోయింది. నా వల్ల నా సన్నిహితులు, స్నేహితులు ఇబ్బందులు పడటం నాకు చాలా బాధగా ఉంది" అని రవీనా రవి ఆవేదన చెందారు.

స్టాకింగ్ మాస్టర్ మైండ్..

వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తులు అనేక రకాల ఫేక్ అకౌంట్లను వాడుతున్నట్లు రవీనా రవి తెలిపారు. కేవలం తననే కాకుండా మరికొంతమంది నటీమణులను కూడా వారు వేధిస్తున్నారని ఆమె వెల్లడించారు.

"నేను ముందే కలిశానని, మాకు పెళ్లి నిశ్చయమైందని లేనిపోని కథలు కల్పిస్తూ వారు వేధిస్తున్నారు. ఇలాంటి వారి ప్రొఫైల్స్ కనిపిస్తే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి" అని రవీనా రవి తన ఫ్యాన్స్‌ను కోరారు.

చెన్నై పోలీసులపై నమ్మకం ఉంది..

"మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం అని చెన్నైకి పేరుంది. ఈ నగరంలో మహిళల రక్షణను నిరూపించేలా అధికారులు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని రవీనా రవి కోరారు. ఈ సందర్భంగా ఆమె తమిళనాడు పోలీస్, సైబర్ క్రైమ్ వింగ్, జాతీయ మహిళా కమిషన్‌ను ట్యాగ్ చేశారు.

ఎవరీ రవీనా రవి?

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన రవీనా రవి.. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లకు ఆమె గొంతు అప్పు ఇచ్చారు.

నటిగా రవీనా రవి సినిమాలు

ఇక రవీనా రవి నటిగా 'మాస్టర్', 'లవ్ టుడే', 'రాకీ', 'కావల్తురై ఉంగల్ నన్బన్' వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం రవీనా రవికి ఎదురైన ఈ చేదు అనుభవంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More