Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ ప్రకటన- ఉత్తమ నటుడిగా చైతూ, నటిగా రష్మిక- చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డ్-పూర్తి జాబితా ఇదే!

Gaddar Film Awards 2025 Announced: ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ ఈ గద్దర్ పురస్కారాలను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ వరించగా.. కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ పురస్కారం లభించింది.

Mar 7, 2026, 12:43:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినీ నటీనటుల్లో ఉత్సాహం నింపేందుకు ఇచ్చే పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో తెలుగు సినీ తారలను నంది అవార్డ్స్‌తో సత్కరించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీలకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇచ్చేందుకు పూనుకుంది రాష్ట్ర సర్కార్.

గద్దర్ అవార్డ్స్ ప్రకటన- ఉత్తమ నటుడిగా చైతూ, నటిగా రష్మిక- చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డ్-పూర్తి జాబితా ఇదే!
గద్దర్ అవార్డ్స్ ప్రకటన- ఉత్తమ నటుడిగా చైతూ, నటిగా రష్మిక- చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డ్-పూర్తి జాబితా ఇదే!

అవార్డ్స్ వెల్లడించిన తమ్మారెడ్డి భరద్వాజ

ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (మార్చి 7) 2025 సంవత్సరానికి గానూ గద్దర్ అవార్డ్స్‌ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే, గతేడాదికి సంబంధించిన స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ఛైర్మన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌ను ఈ అవార్డులకు సెలెక్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి 'ఎన్టీఆర్ జాతీయ పురస్కారం'ను అందించనున్నారు.

కమల్ హాసన్-జయసుధలకు అవార్డ్స్

అలాగే, లోక నాయకుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డ్, సహజ నటి జయసుధకు ఏఎన్నార్ పురస్కారం, అగ్ర నిర్మాత అశ్విని దత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్, రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే పురస్కారం, డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావుకు బీఎన్ రెడ్డితోపాటు చిత్రపాణి ఫిల్మ్ అవార్డు, ఆర్.నారాయణ మూర్తికి కాంతారావు పురస్కారం వరించాయి.

ఉత్తమ నటీనటులుగా రష్మిక, నాగ చైతన్య

ఇక గద్దర్ అవార్డ్స్ ఉత్తమ నటుడుగా నాగ చైతన్య (తండేల్ మూవీ) నిలవగా.. బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (ది గర్ల్‌ఫ్రెండ్) ఎంపిక అయింది. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డ్ అందుకోనుంది.

గద్దర్ అవార్డ్స్ 2025 జాబితా:

>ఉత్తమ రెండవ చిత్రంగా 'దండోరా'. మూడవ ఉత్తమ చిత్రంగా 'వెడ్డింగ్ ఫోటోగ్రఫీ'. ఉత్తమ పర్యావరణ చిత్రం 'ఇగ్వా'. ఉత్తమ వినోదాత్మక చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఆర్. నారాయణ మూర్తికి 'కాంతారావు అవార్డ్'.

>ఉత్తమ సంగీత దర్శకుడుగా మార్క్ కె రాబిన్‌ (దండోరా). ఉత్తమ నేపథ్య గాయకుడుగా అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి). ఉత్తమ నేపథ్య గాయనిగా సాహితి చాగంటి (కన్నప్ప). ఉత్తమ హాస్యనటుడు కృష్ణ తేజ (జిగ్రీస్‌). ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ గా అనిల్‌ రావిపూడి . ఉత్తమ గేయ రచయితగా నందకిశోర్‌ (కుబేర). ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌).

>ఉత్తమ ఎడిటర్‌ 'శ్రీకర్‌ ప్రసాద్‌' (మిరాయ్‌). ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ గా ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి). ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ గా తోట తరణి (ఛాంపియన్‌). ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ గా గోవింద్‌ (అఖండ). ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా చంద్రకాంత్‌ (ఛాంపియన్‌).

స్పెషల్ జ్యూరీ కేటగిరిలో..

>ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - 23. ఉత్తమ మేల్‌ యాక్టర్‌ గా చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి). ఉత్తమ నటిగా అనంతిక (8 వసంతాలు). స్పెషల్‌ జ్యూరీ హీరోగా రోషన్‌ (ఛాంపియన్).

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More