తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2025 : జ్యూరీలో కీలక మార్పు - కొత్త చైర్మన్‌గా తమ్మారెడ్డి

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డ్స్‌-2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది.  స్పెషల్‌ అవార్డ్స్‌ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజని నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Feb 20, 2026, 15:43:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డ్స్‌-2025 ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉగాదికి అవార్డులు ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. అయితే తాజాగా జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పెషల్‌ అవార్డ్స్‌ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఛైర్మన్‌గా ఉన్న సీనియర్ డైరెక్టర్ రాఘ‌వేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డిని నామినేట్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2025  : జ్యూరీలో కీలక మార్పు
తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2025 : జ్యూరీలో కీలక మార్పు

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో ప్రదానం చేస్తున్న సినిమా అవార్డులలోని వివిధ విభాగాలకు ఇప్పటికే జ్యూరీలను నియమించింది. అందులో 2025 సినిమా అవార్డుల ఎంపిక కోసం వేసిన కమిటీకి జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఉన్నారు. గత రెండు వారాలుగా ఆయన నేతృత్వంలో కమిటీ సభ్యులు సినిమాలను చూస్తున్నారు. ఉత్తమ సినీ విమర్శకుడు, ఉత్తమ సినిమా గ్రంథం అవార్డుల కమిటీకి తనికెళ్ళ భరణి ని జ్యూరీ ఛైర్మన్‌గా నియమించగా…. ఇక బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయ్‌ జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్నారు.

కొత్త ఛైర్మన్ గా తమ్మారెడ్డి…

ఇక స్పెషల్ అవార్డుల కమిటీకి(స్పెషల్‌ అవార్డ్స్‌ జ్యూరీ) ఛైర్మన్‌గా ప్రముఖ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావుని నియమించారు. అయితే ఆయన స్థానంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. స్పెషల్ అవార్డ్స్ కమిటీలో ఛైర్మన్ కాకుండా నలుగురు సభ్యులు ఉన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలానే ఉద్దేశ్యంతో గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ అవార్డులను నిర్వహిస్తోంది.తెలుగు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి పురస్కారాలను అందజేస్తోంది. 2025లో తొలిసారిగా గద్దర్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ అందజేశారు. 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు పురష్కారాలు ప్రధానం చేశారు.

మార్చి 19న అవార్డుల ప్రదానం…

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ అయింది. ఉగాది పండగ వేళ మార్చి 19వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా.. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More