Telangana Gaddar Film Awards - 2025 : ఉగాది రోజు గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానం
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ -2025పై కీలక ప్రకటన వచ్చేసింది. ఉగాది పండగ వేళ మార్చి 19వ తేదీన అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల పంపిణీకి ముహుర్తం ఫిక్స్ అయింది. ఉగాది పండగ వేళ మార్చి 19వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా.. ఈనెల 6వ తేదీ నుంచి అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మార్చి 19న పంపిణీ - డిప్యూటీ సీఎం భట్టి
గద్దర్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించి జ్యూరీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఉగాది పండుగ రోజైన మార్చి 19న అత్యంత వైభవంగా ‘గద్దర్ ఫిలిం అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించారు. దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీలను హైదరాబాద్‌లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకం ఉన్నాయని చెప్పారు.
“ప్రజా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్త చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.తద్వారా మన యువతకు, టెక్నీషియన్లకు, రచయితలకు మరియు దర్శకులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేము విశ్వసిస్తున్నాము” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
“ప్రజా గాయకుడు గద్దర్ సమాజం, కళల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన స్మరణార్థం ఈ అవార్డులను ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాము. కేవలం ప్రతిభ, పారదర్శకత మాత్రమే ఈ అవార్డుల ఎంపికలో ప్రధాన ప్రమాణాలుగా ఉంటాయి. ఈనెల 6వ తేదీ నుండి అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
గత సంవత్సరం జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి, అభినందనలు పొందిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి… ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినీ రంగ ప్రముఖులకు ఉన్న అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగం పట్ల వారికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్ డి సి ద్వారా అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రేపు స్క్రీనింగ్ కార్యక్రమం:
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ -2025లో భాగంగా రేపు(ఫిబ్రవరి 6) అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు హాజరవుతారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

