ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు..?సింగరేణి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

సింగరేణిపై కట్టు కథలు విషపు రాతలు రాస్తున్నారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మేలు కోసము ఈ కథనాలు రాశారో తేలాలంటూ కామెంట్స్ చేశారు. , సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న నాపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావులేదన్నారు.

Published on: Jan 24, 2026, 15:49:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు అల్లుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన… కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వండివారుస్తున్నారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

“ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు.

సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనలు ఉన్నాయని భట్టి చెప్పారు. ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాసిన కథనాలు తప్పు అని ప్రజలకు తెలియజేయయాలని సూచించారు.

“2021లో సెంట్రల్‌ మైనింగ్‌ కూడా సైట్‌ విజిట్‌ తప్పనిసరి అని చెప్పింది. టెండర్‌ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం లేదు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచింది. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారు. సైట్‌ విజిట్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి అని NMDC కూడా చెప్పింది”అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.

“నేను ఎలాంటి చిల్లర పనుల కోసం రాలేదు. నాకున్న ఉన్నతమైన ఆలోచనల్ని అమలు చేయాలనేదే నా లక్ష్యం. నిజానిజాలు బయటకు రావాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అడ్డగోలు ప్రచారం చేసే వారి అసలు రూపం బయటపడాలి..పత్రికలు, నాయకులే కాదు.. సోషల్‌ మీడియాలో కూడా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డాక్యుమెంట్లు కూడా ఇస్తాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఏ గద్దను వాలనీయను - భట్టి

అడ్డగోలుగా ఏదిపడితే అది రాస్తే నడవదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. “నేను ఆస్తులు సంపాదించుకునేందుకు రాలేదు.. సమాజంలో మార్పు కోసం వచ్చా. నా పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి కోసం పోరాడా.. సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయను. బొగ్గు బావులు తెలంగాణకు ఎంత అవసరమో నాకు తెలుసు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. “హరీష్‌రావు లేఖ రాయాలనుకుంటే నాకు రాయండి. వాళ్లకు, వీళ్లకు లేఖ రాసి ఎందుకు ఇబ్బంది పెడతావ్. ఆ లేఖ ఏదో నాకే రాస్తే.. నేనే విచారణకు ఆదేశిస్తా కదా..?” అంటూ భట్టి మాట్లాడారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More