ఏం ఆశించి, ఎవరి కోసం రాశారు? ఓ న్యూస్ ఆర్టికల్‌పై భట్టి విక్రమార్క సీరియస్

ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఏం ఆశించి రాశారో, ఎవరి మెప్పు కోసం రాశారో బయటపడుతుందని అన్నారు.

Published on: Jan 18, 2026 4:58 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో, అధికారం హోదాను అనుభవించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులోని ప్రజా భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, దారి దోపిడీదారులు, బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తులను వనరులను రక్షించి, వాటిని ప్రజలకు అందజేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

'సింగరేణి బొగ్గు సంస్థలకు టెండర్లపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులో తనకు తోసింది రాశారు. ఓ కట్టు కథనాన్ని ఎవరి ప్రయోజనం కోసమో వండి వార్చారు. టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డ్ ఖరారు చేస్తుంది. మంత్రికి సంబంధం ఉండదు. ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయాలని సూచించాను. తాను సింగరేణి బోర్డు సభ్యులకు చెప్పి వెంటనే సదరు బోర్డు మాత్రం టెండర్లు పిలిచిన ఇంకా ఎవరూ రాలేదని చెప్పారు. అయినప్పటికీ టెండర్లు రద్దు చేసి ఫ్రెష్‌గా పిలవమని సూచించా.' అని భట్టి విక్రమార్క అన్నారు.

తాను దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాడినని భట్టి విక్రమార్క గుర్తుచేసుకున్నారు. వైఎస్‌పై ఉన్న కోపంతో తనపై ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు. ఈ వార్త వల్ల అధికారులకు, మంత్రులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. తాను ఆత్మగౌరవం కోసం బతుకుతామని, దోపిడిదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి గాలికి రాలేదని 40 సంవత్సరాలుగా సభలో, బయట ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చానన్నారు. ఏం ఆశించి రాశారో, ఎవరి మెప్పు కోసం రాశారో బయటపడుతుందని అన్నారు. ఈ కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని తాను స్పందించడం జరిగిందన్నారు. త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తానని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More