సింగరేణి నైని కోల్ బ్లాక్ వివాదం - టెండర్లపై కేంద్రం విచారణ

నైనీ కోల్ బ్లాక్ వివాదంపై కేంద్రం విచారణకు ఆదేశించింది. కేంద్ర బృందాన్ని సింగరేణికి పంపిచనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు అధికారుల్ని నియమించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వివరాలను పేర్కొన్నారు.

Published on: Jan 22, 2026, 22:16:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సింగరేణి బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ టెండర్లను రద్దు చేయడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

నైనీ కోల్‌ టెండర్లు
నైనీ కోల్‌ టెండర్లు

"నైనీ కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారుల బృందం(ఇద్దరు) సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను.. ఇతర అంశాలపైనా ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు" అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) అనే బొగ్గు గనుల సంస్థ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. 51:49 ఈక్విటీ ప్రాతిపదికన యాజమాన్యంలో ఉంది. నైనీ కోల్ బ్లాక్ లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఇటీవలే బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తాజాగా వెలుగు చూసిన పరిణామాలపై కేంద్ర బృందం విచారించనుంది. ఈ బృందం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుంది. మూడు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…. కేంద్రానికి 49 శాతం ఈక్విటీ ఉన్నప్పటికీ ఎస్సీసీఎల్ పై తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి పరిపాలనా అధికారాలు ఉన్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. టెండర్ల నుంచి కాంట్రాక్టుల వరకూ అన్నీ కేసీఆర్‌ కుటుంబమే చూసేదన్నారు. ఆ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులు కూడా దుర్వినియోగం చేశారని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగరేణిలో అవినీతి, అవకతవకలు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.ఈ రెండు పార్టీలు కూడా సింగరేణిని బలహీనపర్చాయని విమర్శించారు. టెండర్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమని గుర్తుచేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More