ఓటీటీలోకి నిన్న రిలీజైన శర్వానంద్, సంయుక్త, సాక్షి నారీ నారీ నడుమ మురారి- అదిరే టాక్‌తో 8 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ నారీ నారీ నడుమ మురారి స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించిన ఈ సినిమాకు 8 రేటింగ్ వచ్చింది. మరి నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 15, 2026, 13:32:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఇప్పుడు క్యూరియాసిటీ నెలకొంది. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్‌పై బజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలోనే నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్‌పై అందరి కన్ను పడింది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన శర్వానంద్, సంయుక్త, సాక్షి నారీ నారీ నడుమ మురారి- అదిరే టాక్‌తో 8 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన శర్వానంద్, సంయుక్త, సాక్షి నారీ నారీ నడుమ మురారి- అదిరే టాక్‌తో 8 రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఐదు సినిమాల కంటే ఎక్కువగా

ఎందుకుంటే 2026 సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో మిగతా వాటి కంటే ఎక్కువగా పాజిటివ్ టాక్‌ను నారీ నారీ నడుమ మురారి సంపాదించుకుంటోంది. సంక్రాంతి పండుగ చివరి సినిమాగా లేట్‌గా రిలీజ్ అయినప్పటికీ లేటెస్ట్‌గా అదరగొట్టిందంటూ టాక్ నడుస్తోంది.

10కి 8 రేటింగ్

ఇలా అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతున్న నారీ నారీ నడుమ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి కూడా పదికి 8 రేటింగ్ వచ్చింది. జనవరి 14న సాయంత్రం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య జోడీగా నటించారు.

సామజవరగమన డైరెక్టర్

సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మాతలుగా నిర్మించారు. నారీ నారీ నడుమ మురారిలో హీరో హీరోయిన్లతోపాటు సీనియర్ నటుడు వీకే నరేష్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, సిరి హనుమంత్, సంపత్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

నారీ నారీ నడుమ మురారి రివ్యూ

లవర్, ఎక్స్ మధ్య హీరో నలిగిపోయే కథగా నారీ నారీ నడుమ సినిమా వచ్చినప్పటికీ డిఫరెంట్ ట్రాక్‌తో కామెడీని బాగా హ్యాండిల్ చేశారని రివ్యూలో చెప్పారు. ముఖ్యంగా సినిమా రైటింగ్, డైలాగ్స్, సిచ్యువేషనల్ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు.

నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్

ఇంత మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్‌పై అమితమైన ఆసక్తి నెలకొంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిందని సమాచారం.

నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రైట్స్ ధర

థియేట్రికల్ రిలీజ్‌కు ముందే రూ. 17.5 కోట్లు వెచ్చించి నారీ నారీ నడుమ మురారి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని టాక్. ఈ లెక్కన చూస్తే అమెజాన్ ప్రైమ్‌లోనే నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అయితే, సినిమాకు వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్, రెస్పాన్స్, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు అయితే అధికారికంగా నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More