OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే! ఈ వారం రిలీజయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే! 14 స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం (మార్చి 16 నుంచి 22 వరకు) సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో 'బోర్డర్ 2', సిలియన్ మర్ఫీ 'పీకీ బ్లైండర్స్' మూవీతో పాటు సుధీర్ బాబు 'జటాధర', సుహాస్ 'హే బల్వంత్' వంటి సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. స్పెషల్, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే.

Published on: Mar 16, 2026, 22:30:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా ప్రియులకు ఈ వారం ఓటీటీలో వినోదాల విందు భోజనం సిద్ధంగా ఉంది. మార్చి 16 నుంచి నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ ఇలా అన్ని రకాల జోనర్లలో విడుదలవుతున్న ఈ వారం ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీ లవర్స్‌కు పండగే! ఈ వారం రిలీజయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే! 14 స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్
ఓటీటీ లవర్స్‌కు పండగే! ఈ వారం రిలీజయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే! 14 స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్

1. బోర్డర్ 2 (Border 2)

1997 నాటి క్లాసిక్ వార్ ఫిల్మ్ 'బోర్డర్'కు ఇది సీక్వెల్. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1971 నాటి 'ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్' నేపథ్యంలో సాగుతుంది. యుద్ధ భూమిలో మన సైనికుల పరాక్రమాన్ని ఈ సినిమా మరోసారి కళ్లకు కట్టనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 19 నుంచి బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

2. పీకీ బ్లైండర్స్ - ది ఇమ్మోర్టల్ మ్యాన్

ప్రముఖ ఓటీటీ సిరీస్ 'పీకీ బ్లైండర్స్'కు ముగింపుగా వస్తున్న ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ మరోసారి టామీ షెల్బీగా అలరించనున్నారు. తన కుటుంబాన్ని, వారసత్వాన్ని కాపాడుకోవడానికి టామీ చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 20న పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ ఓటీటీ రిలీజ్ కానుంది.

3. జటాధర (Jatadhara)

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం కేరళలోని పద్మనాభస్వామి ఆలయ నేపథ్యంలో సాగుతుంది. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. జీ5లో మార్చి 20 నుంచి జటాధర ఓటీటీ ప్రీమియర్ అవనుంది.

4. హే బల్‌వంత్ (Hey Balwanth)

సుహాస్, శివాని నాగారం మరోసారి జంటగా నటించిన హే బల్‌వంత్ చిత్రంలో తన తండ్రి చేసే వ్యాపారం గురించి తెలిసిన ఒక యువకుడి జీవితంలో ఎదురైన గందరగోళ పరిస్థితులను కామెడీగా చూపించారు. హే బల్వంత్ కూడా జీ5లోనే మార్చి 20న ఓటీటీ రిలీజ్ కానుంది.

5. రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ (Radioactive Emergency)

బ్రెజిల్‌లో జరిగిన యథార్థ క్షేమకర సంఘటన (Cesium-137) ఆధారంగా రూపొందించిన రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీ సినిమా మార్చి 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది. ఒక రేడియోధార్మిక విపత్తును మానవాళి ఎలా ఎదుర్కొందనేది ఇందులో చూడవచ్చు.

6. జాజ్ సిటీ (Jazz City):

1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట నేపథ్యంలో కోల్‌కతాలోని ఒక జాజ్ క్లబ్ ఎలా గూఢచారులకు నిలయంగా మారింది? అనే ఆసక్తికరమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. సోనీ లివ్ ఓటీటీలో మార్చి 19 నుంచి జాజ్ సిటీ స్ట్రీమింగ్ కానుంది.

7. సీతా పయనం

యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కిన రోడ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా సీతా పయనం మార్చి 20న సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది. అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.

8. ల్యాండ్‌లార్డ్

కన్నడ మూవీ ల్యాండ్‌లార్డ్ 1980ల నాటి కర్ణాటక గ్రామీణ నేపథ్యంలో సాగే సామాజిక పోరాట సినిమా. ఇందులో దునియా విజయ్ హీరోగా చేశాడు. శతాబ్దాలుగా సాగుతున్న ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటు చేసి, తమ భూమిని, హక్కులను, గౌరవాన్ని ఎలా కాపాడుకున్నారనదే ఈ మూవీ స్టోరీ. జీ5లో మార్చి 19న ల్యాండ్‌లార్డ్ ఓటీటీ రిలీజ్ కానుంది.

9. చిరయా ఓటీటీ

బాలీవుడ్ నటి దివ్యా దత్తా మెయిన్ లీడ్ రోల్ చేసిన చిరాయ మ్యారిటల్ రేప్ అంశంపై తెరకెక్కింది. జియో హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి చిరయా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

10. కాసరగోడ్ ఎంబసీ

2000వ దశకం చివరలో జరిగే క్రైమ్ కథాంశంతో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ'. డైరెక్టర్ అతీష్ ఎం. నాయర్ తెరకెక్కించిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో మార్చి 20 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

11. సుమతీ శతకం

బిగ్ బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హీరోగా తెరకెక్కిన తెలుగు రొమాంటిక్ విలేజ్ డ్రామా సినిమా 'సుమతీ శతకం'. ఎంఎం నాయుడు దర్శకత్వం వహించారు. మార్చి 19 నుంచి ఈటీవీ విన్‌లో సుమతీ శతకం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం ఓటీటీ సినిమాల పూర్తి జాబితా:

సినిమా / సిరీస్ పేరుఓటీటీ ప్లాట్‌ఫామ్ఓటీటీ రిలీజ్ డేట్
బోర్డర్ 2 (Border 2)నెట్‌ఫ్లిక్స్మార్చి 19
పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్నెట్‌ఫ్లిక్స్మార్చి 20
జటాధర (Jatadhara)జీ5మార్చి 20
హే బల్‌వంత్ (Hey Balwanth)జీ5మార్చి 20
వికెడ్: ఫర్ గుడ్ (Wicked)జియో హాట్‌స్టార్మార్చి 21
జాజ్ సిటీ (Jazz City)సోనీ లివ్మార్చి 19
ఇంపర్ఫెక్ట్ విమెన్ (Imperfect Women)యాపిల్ టీవీ+మార్చి 18
ది ప్లాస్టిక్ డెటాక్స్ (Docu)నెట్‌ఫ్లిక్స్మార్చి 16
రేడియో యాక్టివ్ ఎమర్జెన్సీనెట్‌ఫ్లిక్స్‌మార్చి 18
సీతా పయనంసన్ నెక్ట్స్మార్చి 20
ల్యాండ్‌లార్డ్జీ5మార్చి 19
చిరయాజియో హాట్‌స్టార్‌మార్చి 20
కాసరగోడ్ ఎంబసీజీ5మార్చి 20
సుమతీ శతకంఈటీవీ విన్‌మార్చి 19

మొత్తం 14, ఇంట్రెస్టింగ్‌గా 4

ఇలా ఈ వారం (మార్చి 16 నుంచి 22 వరకు) 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వీటిలో అన్ని చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో సీతా పయనం, సుమతీ శతకం, హే బల్‌వంత్, జటాధర వంటి 4 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More