OTT Heroine: సీ వ్యూ ఇల్లు కొన్న ఓటీటీ హీరోయిన్- ఇంటి ప్రతి గోడ నాకు అది గుర్తు చేస్తుందంటూ సాన్య మల్హోత్రా ఎమోషనల్!

OTT Heroine Sanya Malhotra New House Ceremony Photos: బాలీవుడ్ హీరోయిన్, ఓటీటీ క్రేజీ బ్యూటీ సాన్య మల్హోత్రా తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు. ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఆమె, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Mar 14, 2026, 20:09:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన 'మిసెస్' సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరోయిన్ సాన్య మల్హోత్రా జీవితంలో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ముంబై నగరంలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు సాన్య. తాజాగా సాన్య మల్హోత్రా కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.

సీ వ్యూ ఇల్లు కొన్న ఓటీటీ హీరోయిన్- ఇంటి ప్రతి గోడ నాకు అది గుర్తు చేస్తుందంటూ సాన్య మల్హోత్రా ఎమోషనల్!
సీ వ్యూ ఇల్లు కొన్న ఓటీటీ హీరోయిన్- ఇంటి ప్రతి గోడ నాకు అది గుర్తు చేస్తుందంటూ సాన్య మల్హోత్రా ఎమోషనల్!

గృహ ప్రవేశ వేడుక

ఈ క్రమంలో తన కొత్త ఇంటిలోకి సాంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశ వేడుకతో అడుగుపెట్టారు. దీంతో సాన్య మల్హోత్రా గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

కళ్లకు కట్టేలా కొత్త ఇల్లు

సాన్య మల్హోత్రా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె ఇల్లు అత్యంత విలాసవంతంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇంటి నుంచి అరేబియా సముద్ర అందాలు స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. అంటే సీ వ్యూతో సాన్య మల్హోత్రా తన ఇంటి కలను నిజం చేసుకున్నారు.

ఇంటి నిండా ధారాళంగా వెలుతురు వచ్చేలా కిటికీలు, ఆధునిక హంగులతో కూడిన ఇంటీరియర్ ఆకట్టుకుంటున్నాయి. గృహప్రవేశ పూజలో భాగంగా సాన్యా పింక్ కలర్ చీర ధరించి, తలపై కలశం పెట్టుకుని శాస్త్రోక్తంగా ఇంట్లోకి అడుగుపెట్టారు.

ఓర్పుకు దక్కిన ఫలితం: సాన్య భావోద్వేగం

తన కొత్త ఇంటి గురించి సాన్యా ఎమోషనల్ నోట్ రాశారు. "హర హర మహాదేవ్.. ఎన్నో ఏళ్ల కలలు, కష్టం, ఎదుగుదలకు ప్రతిరూపం ఈ ఇల్లు. ఓర్పు, నమ్మకం ఉంటే ఫలితం ఎంత అందంగా ఉంటుందో ఈ ఇంటి ప్రతి గోడ నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది" అని సాన్య మల్హోత్రా రాసుకొచ్చారు.

"ఈ ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితులు చూపిన నమ్మకమే నాకు కొండంత అండ. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, నా జీవిత ప్రయాణంలో ఒక భాగం. వెల్‌కమ్ టు మై ఘర్" అని సాన్య మల్హోత్రా పేర్కొన్నారు.

సాన్య పోస్ట్‌పై బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, శ్వేతా త్రిపాఠి, పుల్కిత్ సామ్రాట్ వంటి సినీ ప్రముఖులు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సాన్య మల్హోత్రా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని స్నేహితులు ప్రశంసించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మూవీ

ఇదిలా ఉంటే, వృత్తిపరంగా కూడా సాన్య మల్హోత్రా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవల వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌లతో కలిసి 'సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి'లో కనిపించిన ఆమె, త్వరలో రాజ్‌కుమార్ రావుతో కలిసి 'టోస్టర్' అనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఒరిజినల్ మూవీలో నటించనున్నారు.

న్యాయ వ్యవస్థలోని లోపాలను

దీనితో పాటు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బందర్' సినిమాలోనూ సాన్య మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే కథాంశంతో రానుంది.

సాన్య మల్హోత్రా ఓటీటీ సినిమాలు

ఇదిలా ఉంటే ఓటీటీ హీరోయిన్‌గా సాన్య మల్హోత్రా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మిసెస్ (జీ5 ఓటీటీ), కథల్ (నెట్‌ఫ్లిక్స్), పాగ్లైట్ (నెట్‌ఫ్లిక్స్), లవ్ హాస్టల్ (జీ5 ఓటీటీ), మీనాక్షి సుందరేశ్వర్ (నెట్‌ఫ్లిక్స్) వంటి ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బాగా క్లిక్ అయ్యారు దంగల్ బ్యూటీ సాన్య మల్హోత్రా.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More