Janhvi Kapoor: అందుకోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు- జాన్వీ కపూర్ కామెంట్స్-అన్నపై వేధింపులకు సాకులు లేవంటూ!

Janhvi Kapoor About Trolling On Her And Arjun Kapoor: సోషల్ మీడియాలో తనపై, అన్న అర్జున్ కపూర్‌పై వచ్చే నెగెటివిటీపై జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. వ్యూస్ కోసం తమను బలిపశువులను చేస్తున్నారని, నెగెటివిటీని పట్టించుకోవడం మానేశానని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.

Published on: Mar 3, 2026, 20:00:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద వచ్చే ట్రోలింగ్, విమర్శలు ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. దీనిపై బాలీవుడ్ బ్యూటీ, పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా మనసు విప్పారు.

అందుకోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు- జాన్వీ కపూర్ కామెంట్స్-అన్నపై వేధింపులకు సాకులు లేవంటూ!
అందుకోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు- జాన్వీ కపూర్ కామెంట్స్-అన్నపై వేధింపులకు సాకులు లేవంటూ!

ఇంటర్నెట్‌లో వ్యక్తం అయ్యే అభిప్రాయాలను తాను పెద్దగా పట్టించుకోనని, అయితే తన సోదరుడు అర్జున్ కపూర్‌ను టార్గెట్ చేస్తూ సాగుతున్న వేధింపులకు మాత్రం ఎలాంటి సాకులు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు. 'గ్రేజియా'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోషల్ మీడియా వేధింపుల వెనుక ఉన్న అసలు కోణాన్ని జాన్వీ కపూర్ విశ్లేషించారు.

"మేము కేవలం క్లిక్ బైట్ వస్తువులమేనా?"

సోషల్ మీడియా సంస్కృతి గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ పాపులారిటీ, వ్యూస్ కావాలి. అందుకే సెలబ్రిటీల గురించి కంటెంట్ చేసేటప్పుడు మమ్మల్ని కేవలం ఒక 'పావు' లేదా బలి పశువు (Scapegoat) లాగా వాడుకుంటున్నారు" అని జాన్వీ కపూర్ తెలిపారు.

"వ్యూస్ పెంచుకోవడానికి (Clickbait), ప్రజల్లో ఆగ్రహం కలిగించి చర్చ జరిగేలా చేయడానికి (Rage bait) మా పేర్లను ఉపయోగిస్తున్నారు. ఈ కోణంలో ఆలోచిస్తే.. వారు చెప్పే మాటలకు, మా నిజ జీవితానికి అసలు సంబంధమే ఉండదని అర్థమవుతుంది. ఆ నిజాన్ని గ్రహించాక, నేను దేన్నీ మనసుకి తీసుకోవడం మానేశాను" అని జాన్వీ కపూర్ వివరించారు.

5 నిమిషాల కంటే ఎక్కువ

తన అన్న అర్జున్ కపూర్ ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై జాన్వీ స్పందిస్తూ.. "ప్రతి ఒక్కరూ తమ ఇల్లు గడవడానికి ఏదో ఒకటి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతోంది. ఏదీ అంత లోతుగా ఆలోచించాల్సిన విషయం కాదు. ఇలాంటి వాటి కోసం ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించడం మూర్ఖత్వమే అవుతుంది" అని అన్నారు.

నెగెటివిటీని మాత్రమే పుట్టిస్తుంది

"అయితే, మనల్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధ కలగడం సహజం. నా సోదరుడి విషయంలో అది వేధింపులుగా మారినప్పుడు మాత్రం నిజంగా బాధేస్తుంది. అలాంటి ప్రవర్తనను సమర్థించడానికి ఎలాంటి సాకులు లేవు. నెగెటివిటీ ఎప్పుడూ మరికొంత నెగెటివిటీని మాత్రమే పుట్టిస్తుంది. అందుకే ఆ వలయం నుంచి మనం బయటపడటమే మంచిది" అని జాన్వీ కపూర్ హితవు పలికారు.

క్రూరంగా ఉందని పోస్ట్

గత కొద్ది కాలంగా అర్జున్ కపూర్ నటనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. గత నెలలో తన తల్లి మోనా శౌరీ కపూర్ జయంతి సందర్భంగా అర్జున్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెడుతూ.. కాలం తన పట్ల క్రూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాతే ఆయనకు కొంతమంది నెటిజన్ల నుంచి మద్దతు లభించడం మొదలైంది.

తెలుగులో రామ్ చరణ్‌తో జాన్వీ 'పెద్ది'

ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ఇటీవల 'సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి'లో కనిపించారు. ప్రస్తుతం అందరి దృష్టి జాన్వీ కపూర్ నటించిన తెలుగు సినిమాపైనే ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ 'పెద్ది' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More