ఓటీటీలోకి నిన్న నేరుగా వచ్చిన తెలుగు డివోషనల్ డ్రామా- సత్య సాయి బాబాపై జగపతి బాబు, సుహాసిని మూవీ- 3 భాషల్లో స్ట్రీమింగ్

ఓటీటీలోకి నిన్న (జనవరి 13) స్ట్రీమింగ్‌కు వచ్చేసిన తెలుగు డివోషనల్ డ్రామా సినిమా అనంత. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా బోధనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. 3 భాషల్లో నేరుగా రిలీజ్ అయిన అనంత ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 14, 2026, 15:22:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎన్నో జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చినా డివోషనల్ కథాశంతో రిలీజ్ అయ్యే మూవీస్ చాలా అరుదు. ఈ క్రమంలో తెలుగులో డివోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ అనంత. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్య సాయి బాబాపై తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని కీలక పాత్రలు పోషించారు.

ఓటీటీలోకి నిన్న నేరుగా వచ్చిన తెలుగు డివోషనల్ డ్రామా- సత్య సాయి బాబాపై జగపతి బాబు, సుహాసిని మూవీ- 3 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి నిన్న నేరుగా వచ్చిన తెలుగు డివోషనల్ డ్రామా- సత్య సాయి బాబాపై జగపతి బాబు, సుహాసిని మూవీ- 3 భాషల్లో స్ట్రీమింగ్

వెటరన్ డైరెక్టర్

చాలా కాలం నిరీక్షణ తర్వాత వెటరన్ డైరెక్టర్ సురేష్ కృష్ణ (భాషా ఫేమ్) రూపొందించిన ఆధ్యాత్మిక చిత్రమే ఈ ‘అనంత’. ఈ మూవీలో జగపతి బాబు, సుహాసినితోపాటు రామరావు జాదవ్, వైజీ మధువంతి, వైజీ మహేంద్రన్, అర్జున్ రమన్, శ్రీ రంజని, నిళల్‌గల్ రవి, టెంపర్ వంశీ, అభిరామి వెంకటాచలం, తలైవాసల్ విజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

కుదరని థియేట్రికల్ రిలీజ్

గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంత సినిమా థియేటర్లలో విడుదల కావాల్సింది. అనంత థియేట్రికల్ రిలీజ్ కోసం మూవీ యూనిట్ చాలా ప్రయత్నాలు చేసినట్లు, కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని సమాచారం. దాంతో ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది అనంత మూవీ.

అనంత ఓటీటీ రిలీజ్

నిన్నటి (జనవరి 13) నుంచి జియో హాట్‌స్టార్‌లో అనంత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నేరుగా హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు భాషల్లో అనంత ఓటీటీ రిలీజ్ అయింది. ఆధ్యాత్మిక సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు దేవా సంగీతం అందించిన అనంత సినిమాపై లుక్కేయవచ్చు.

భక్తి చిత్రమే కాకుండా

ఇదిలా ఉంటే అనంత సినిమాను భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించారు. ఇది కేవలం ఒక భక్తి చిత్రం మాత్రమే కాదు.. ఐదు విభిన్న జీవితాల ప్రయాణాన్ని, వారి సమస్యలను దైవ స్పర్శ ఎలా మార్చిందనే కోణంలో సాగుతుంది.

ప్రేమ తత్వాన్ని పంచుకోవడం

పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నేపథ్యంలో అనంత సినిమా మొదలవుతుంది. అక్కడ కలిసిన కొందరు వ్యక్తులు తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలను, బాబా చూపిన ప్రేమ తత్వాన్ని ఒకరికొకరు పంచుకోవడం ఈ చిత్రంలోని ప్రధానాంశం.

ఆధ్యాత్మిక మూడ్‌ను

‘భాషా’ వంటి కమర్షియల్ బ్లాక్‌ బస్టర్ తీసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ ఈసారి ఆధ్యాత్మికతను ఎంచుకుని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు దేవ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ఆధ్యాత్మిక మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి వచ్చిన పాటలు భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయని సమాచారం.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఒక గంభీరమైన, ఆధ్యాత్మికత నిండిన పాత్రలో జగపతి బాబు నటించగా.. చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ పాత్రలో సుహాసిని కనిపించారు. ఇలాంటి విశేషాలు ఉన్న అనంత సినిమాను జియో హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More