Zee5 OTT: ఫ్యామిలీని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడు చెడిపోలేదు, చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది:జీ5 ఓటీటీ తెలుగు వైస్ ప్రెసిడెంట్

Zee5 OTT Telugu Vice President On D/O Daughter Of Prasad Rao: జీ5 ఓటీటీలో తెలుగులో రీసెంట్‌గా వచ్చిన క్రైమ్ సస్పెన్స్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఈ సిరీస్ హిట్ అయిన నేపథ్యంలో జీ5 తెలుగు తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ కామెంట్స్ చేశారు.

Mar 11, 2026, 18:52:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి అయిన జీ5లో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’. ఈ ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఫ్యామిలీని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడు చెడిపోలేదు, చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది:జీ5 ఓటీటీ తెలుగు వైస్ ప్రెసిడెంట్
ఫ్యామిలీని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడు చెడిపోలేదు, చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది:జీ5 ఓటీటీ తెలుగు వైస్ ప్రెసిడెంట్

జీ5 ఓటీటీలో

కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా సాధించింది ఈ తెలుగు వెబ్ సిరీస్.

జయంత్ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన నేపథ్యంలో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ5 ఓటీటీ తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది

జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ .. "‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’ కదా.. కానీ డాటర్ ఆఫ్ ప్రసాద్ చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది. జీ5 ఓటీటీలో తెలుగులో చాలా ఏళ్లు నిలబడుతుంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని అన్నారు.

మేం కంటెంట్‌తో ఫ్యామిలీని నమ్మాం

"ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్లెప్పుడూ చెడిపోలేదు. మేం కంటెంట్‌తో ఫ్యామిలీని నమ్మాం. ఆ నమ్మకం నిలబడింది. మా ఓటీటీ సిరీస్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని జయంత్ రాఘవన్ పేర్కొన్నారు.

ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన వారికి

ఇదే ఈవెంట్‌లో దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. "‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’ సిరీస్‌ను ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్లిన మీడియాకు థాంక్స్. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన అనురాధా మేడం, జయంత్ గారికి, శ్రీరామ్ గారికి థాంక్స్" అని చెప్పారు.

ఎంతో ఎగ్జైట్ అయింది

"మా కోసం రాజీవ్ కనకాల గారు ఎంతో కష్టపడ్డారు. ఉదయభాను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. కథ విన్న తరువాత వాసంతిక ఎంతో ఎగ్జైట్ అయింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా? అన్నట్టుగా ఉండేది. ఈ కథలో నాతో పాటు ప్రయాణించిన ప్రభాకర్, కొండల్రావుకి థాంక్స్. ఎడిటింగ్‌లో వాసురెడ్డి, ఫైనల్‌ ఆర్ఆర్‌లో కిరణ్మయి, సిద్దు చాలా సహాయం చేశారు. మా సిరీస్‌ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్" అని కృష్ణ పోలూరు తెలిపారు.

ఎంత ఇంపార్టెంట్ అనేది

"‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌లో స్వాతి లాంటి మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు కృష్ణ గారికి థాంక్స్. ఈ సిరీస్‌ను పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి చూడాలి. కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేం చూపించాం. ప్రతీ ఒక్కరూ నా పాత్రని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీంకు థాంక్స్" అని నటి వాసంతికి పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More