Dhurandhar 2: ధురంధర్ 2లో సరికొత్తగా 7 పాత్రలు- డైరెక్టర్ భార్య యామీ గౌతమ్ నుంచి దావూద్ ఇబ్రహీంగా చేసిన డానిష్ వరకు!
Dhurandhar 2 New 7 Characters And Actors: రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సీక్వెల్ ది రివేంజ్‌లో కొత్తగా ఏడుగురు నటులు, పాత్రలు ప్రభావం చూపించాయి. వారిలో దర్శకుడి భార్య యామీ గౌతమ్ నుంచి దావూద్ ఇబ్రహీం పాత్ర చేసిన డానిష్ ఇక్బాల్ వరకు ఎవరెవరో చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ‘ఉరి’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ధురంధర్’. రెండు భాగాలుగా వచ్చిన ఈ స్పై యాక్ష్న్ థ్రిల్లర్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గూఢచారి వ్యవస్థలోని చీకటి కోణాలను, ప్రభుత్వాలు అధికారికంగా అంగీకరించలేని రహస్య ఆపరేషన్లను వెండితెరపై ఆవిష్కరించే ఒక భారీ ప్రయత్నం.

మొదటి భాగం పాత్రల పరిచయంతో అదిరిపోయే సీన్లతో సాగితే, రెండో భాగం ధురంధర్ ది రివెంజ్ పాకిస్థాన్ సైనిక వ్యవస్థ వరకు ఈ కథను తీసుకెళ్తుంది. అయితే, ధురంధర్ సినిమాలోని రోల్స్ కాకుండా ఏడు కొత్త పాత్రలు ధురంధర్ 2లో దర్శనం ఇచ్చాయి. ఆ పాత్రలు ఏంటీ, వాటిని ఎవరు పోషించారు అనే విషయాలపై లుక్కేద్దాం.
రెండో భాగం ధురంధర్ 2లో కొత్తగా చేరిన వారు:
యామీ గౌతమ్ (షాజియా బానో - అతిథి పాత్ర): పాకిస్థాన్‌లో నర్సు వేషంలో ఉన్న భారతీయ గూఢచారిగా డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, హీరోయిన్ యామీ గౌతమ్ కనిపిస్తారు. ఒక కీలక సమయంలో పాక్ ఉగ్రవాదిని అంతం చేసి, హమ్జాతో కళ్లతోనే సంజ్ఞ చేసి వెళ్లే ఆమె పాత్ర సినిమాకు హైలైట్.
డానిష్ ఇక్బాల్ (దావూద్ ఇబ్రహీం అలియాస్ 'బడే సాబ్'): 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ పాత్రలో డానిష్ కనిపిస్తారు. మరణ పడకపై ఉండి కూడా విధ్వంసకర ప్లాన్లు వేసే విలన్‌గా ఆయన నటన భయాన్ని కలిగిస్తుంది.
ఉదయ్‌బీర్ సంధు (గుర్బాజ్ "పిండా" సింగ్): ఈ సినిమాలో అత్యంత విషాదకరమైన పాత్ర ఇదే. జస్కీరాత్ సింగ్ పాత జీవితంలో అతడికి ప్రాణ స్నేహితుడు, కష్టాల్లో అండగా నిలిచిన వ్యక్తి పిండా. అయితే, డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుని కరాచీలో హమ్జా కంటపడతాడు. తన గతాన్ని, వర్తమానాన్ని ఎదురెదురుగా నిలబెట్టి.. హమ్జాను మానసిక సంఘర్షణకు గురిచేసే ఈ పాత్ర ప్రేక్షకులను కలిచివేస్తుంది.
సువిందర్ పాల్ (బ్రిగేడియర్ జహంగీర్): మేజర్ ఇక్బాల్ తండ్రిగా సువిందర్ పాల్ కనిపిస్తారు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అయిన ఇతను, వికలాంగుడై చక్రాల కుర్చీకే పరిమితమైనా.. తన కొడుకును నిరంతరం కించపరుస్తూ, అవమానిస్తూ ఉంటాడు. మేజర్ ఇక్బాల్ ఇంత క్రూరంగా మారడానికి గల కారణం.. తన తండ్రి దృష్టిలో తనేంటో నిరూపించుకోవాలనే కసి అని ఈ పాత్ర ద్వారా మనకు అర్థమవుతుంది.
రాజ్ జుత్షీ (లెఫ్టినెంట్ జనరల్ శంషాద్ ఖాన్): పాకిస్థాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న అవినీతికి ఈయన పాత్ర నిదర్శనం. పైకి ఎంతో పద్ధతిగా కనిపిస్తూనే, లోపల అత్యంత ప్రమాదకరమైన కుట్రలు చేసే బ్యూరోక్రాటిక్ విలనిజాన్ని రాజ్ జుత్షీ అద్భుతంగా పండించారు.
సలీం సిద్దిఖీ (ఆతిఫ్ అహ్మద్): యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ ఛాయలున్న పాత్ర ఇది. పాకిస్థాన్ దొంగ నోట్ల చలామణికి, ఇండియాలోని నేరగాళ్లకు మధ్య అనుసంధానకర్తగా సలీం కనిపిస్తారు.
ఆదిత్య ఉప్పల్ (ఏఎస్పీ ఒమర్ హైదర్): దుబాయ్ ఆఫీసర్ ఒమర్ షాహిద్ హమీద్ స్ఫూర్తితో రూపొందించిన పాత్ర. హమ్జా అసలు నిజాన్ని కనిపెట్టి, అతడిని అరెస్ట్ చేసే నిజాయితీ గల పోలీస్ అధికారిగా ఇతని పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
మిగతా పాత్రలు
వీటితోపాటు ధురంధర్ ది రివేంజ్‌లో కొనసాగిన ధురంధర్ మొదటి భాగం పాత్రలుగా రణ్‌వీర్ సింగ్ (హంజా అలీ మజారీ / జస్కీరాత్ సింగ్ రంగీ), ఆర్ మాధవన్ (అజయ్ సన్యాల్), అర్జున్ రాంపాల్ (మేజర్ ఇక్బాల్), సంజయ్ దత్ (ఎస్పీ చౌదరి అస్లాం), సారా అర్జున్ (యాలీనా జమాలి), రాకేష్ బేడీ (జమీల్ జమాలి) ఉన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


