Dhurandhar 2 Box Office: 3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2- ఆ హీరోల రికార్డ్స్ అవుట్- ధురంధర్ 3పై చర్చ!

Dhurandhar 2 Day 3 Worldwide Box Office Collection: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. దాంతో ఆ హీరోల సినిమాల రికార్డ్స్ కనుమరుగు అయిపోయాయి.

Published on: Mar 22, 2026, 06:41:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. 2025లో ఘనవిజయం సాధించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, కేవలం మూడు రోజుల్లోనే రూ. 300 కోట్లకుపైగా నెట్ వసూళ్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద రద్దీ మరింత పెరిగింది.

3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2- ఆ హీరోల రికార్డ్స్ అవుట్- ధురంధర్ 3పై చర్చ!
3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2- ఆ హీరోల రికార్డ్స్ అవుట్- ధురంధర్ 3పై చర్చ!

మూడు రోజుల వసూళ్ల ప్రస్థానం

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ధురంధర్ ది రివేంజ్ చిత్రం మార్చి 18న జరిగిన ప్రీమియర్ షోల ద్వారానే రూ. 43 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక మార్చి 19న అధికారికంగా విడుదలైన మొదటి రోజు రూ. 102.55 కోట్లు కొల్లగొట్టి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది.

శుక్రవారం (మార్చి 20) నాడు వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినా రూ. 80.72 కోట్లు రాబట్టి సత్తా చాటింది. అయితే శనివారం (మార్చి 21) నాటికి మళ్లీ పుంజుకుని ఏకంగా రూ. 126.27 కోట్ల వసూళ్లను సాధించింది. దీనితో ఇప్పటివరకు ఈ చిత్రం భారతదేశంలో మొత్తం రూ. 339.27 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లయింది. అలాగే, శనివారం నాడు థియేటర్లలో 81.6% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.

పెద్ద పెద్ద రికార్డులు కనుమరుగు

ఈ మూడు రోజుల నెట్ కలెక్షన్స్‌తో ‘ధురంధర్ 2’ సినిమా హృతిక్ రోషన్ ‘వార్’ (రూ. 318 కోట్లు), సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ (రూ. 282.79 కోట్లు) వంటి చిత్రాల లైఫ్ టైమ్ వసూళ్లను అలవోకగా దాటేసింది. గతేడాది విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ (రూ. 236 కోట్లు) రికార్డును కూడా ధురంధర్ ది రివేంజ్ చిత్రం ఎప్పుడో అధిగమించింది.

అలాగే, ధురంధర్ 2 సినిమాకు ఇండియాలో 3 రోజుల్లో రూ. 404.54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సక్నిల్క్ సంస్థ తాజాగా పేర్కొంది. ఓవర్సీస్‌లో రూ. 96.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక వరల్డ్ వైడ్‌గా 3 రోజుల్లో ధురంధర్ 2 సినిమా ఏకంగా రూ. 501.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్‌సైట్ పేర్కొంది.

అంటే, 3 రోజుల్లోనే ధురంధర్ 2 మూవీ 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిపోయింది. దీంతోపాటు ఇవాళ (మార్చి 22) ఆదివారంతో కలిపి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కథా నేపథ్యం, విశ్లేషణ

ఇకపోతే ఆదిత్య ధర్ రాసిన ఈ గూఢచారి కథా చిత్రంలో రణ్‌వీర్ సింగ్ జస్కిరాత్ సింగ్ రంగీ (అలియాస్ హమ్జా అలీ మజారీ) పాత్రలో నటించారు. పాకిస్థాన్‌లోని బలూచ్ ముఠాలోకి చొరబడి ఒక భారతీయ గూఢచారి చేసే సాహసోపేతమైన ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

పట్టు బిగించారు

ధురంధర్ 2 చిత్రంపై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. "ధురంధర్ 2 రెండు భిన్నమైన భాగాలుగా సాగుతుంది. మొదటి భాగంలో ఉన్నంత లోతైన కథనం ఇక్కడ కొంత లోపించినా, సినిమా చేజారిపోతుందన్న సమయంలో దర్శకుడు మళ్లీ పట్టు బిగించారు" అని 'హిందుస్థాన్ టైమ్స్' తన సమీక్షలో పేర్కొంది.

ధురంధర్ 3పై

అలాగే, ధురంధర్ 3వ భాగంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, జస్కీరాత్ సింగ్ రంగీ కథను ఒక చేదు జ్ఞాపకంతో ముగిస్తూ, ఈ మూవీ సిరీస్‌కు దర్శకుడు ఇక్కడే ముగింపు పలికినట్లు కనిపిస్తోంది.

సులభంగా దాటేస్తుందని

ఇకపోతే మొదటి భాగం ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేయగా, ఈ సీక్వెల్ ఆ రికార్డును కూడా సులభంగానే అధిగమిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More