గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్, తారక్ డ్రైవింగ్ అంటే భయమే- కానీ! జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్‌పై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్
‘ఆర్‌ఆర్ఆర్’ బ్రోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ ఒక ‘క్రేజీ మ్యాడ్ డ్రైవర్’ అంటూనే, అతనితో ప్రయాణం ఎందుకు సేఫ్ అనిపిస్తుందో వివరించారు.
టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ స్నేహం కేవలం వెండితెరకే పరిమితం కాదు. బయట కూడా వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉంటారు. తాజాగా కార్లకు సంబంధించిన పాపులర్ షో ‘కార్స్ విత్ స్టార్స్’ (Cars With Stars) సీజన్ 2 ఫినాలేలో గెస్ట్‌గా పాల్గొన్న రామ్ చరణ్.. తన మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన, సరదా విషయాలను పంచుకున్నారు.

తారక్ ఒక ‘క్రేజీ మ్యాడ్’ డ్రైవర్!
ఇంటర్వ్యూలో భాగంగా, "సినిమా ఇండస్ట్రీలో మీరు పక్క సీట్లో కూర్చున్నప్పుడు.. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో కారు నడిపే ధైర్యం ఎవరికి ఉందని మీరు నమ్ముతారు?" అనే ప్రశ్న చరణ్‌కు ఎదురైంది. దీనికి రామ్ చరణ్ ఏమాత్రం ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు.
"నేను సాధారణంగా డ్రైవింగ్ సీటులో ఉండటానికే, డ్రైవింగ్ చేయడానికే ఇష్టపడతాను. కానీ, తారక్ గురించి చెప్పాలంటే.. తను ఒక క్రేజీ, మ్యాడ్ డ్రైవర్. అతని పక్కన కూర్చున్నప్పుడు చాలా విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని నా స్నేహితులు చెబుతుంటారు. నాకు కూడా ఒకసారి అలాంటి అనుభవమే ఎదురైంది. కానీ, అందరిలోకి తారక్ డ్రైవింగే అత్యంత సురక్షితం (Safest) అని నేను నమ్ముతాను" అని రామ్ చరణ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
వైరాన్ని వీడి.. ప్రాణ స్నేహితులై..
అయితే, ఎవరితో కలిసి కారులో ప్రయాణించడానికి అస్సలు ఇష్టపడరు అన్న ప్రశ్నకు మాత్రం రామ్ చరణ్ పేర్లు చెప్పడానికి నిరాకరించారు. ఇదిలా ఉంటే, నందమూరి - కొణిదెల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఫ్యాన్ వార్‌ను చెరిపేస్తూ రాజమౌళి వీరిద్దరితో ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.
కానీ, ఆ సినిమా వీరి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచింది. "ముప్పై ఏళ్లుగా మా మధ్య వైరం ఉందనే వార్తలు విని మాకే బోర్ కొట్టింది. అందుకే మేము స్నేహాన్ని ఎంచుకున్నాం" అని ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్ అన్నారు. తారక్ కూడా చరణ్‌ను తన ‘సపోర్ట్ సిస్టమ్’గా అభివర్ణిస్తారు.
కెరీర్ ముచ్చట్లు
2025 సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో పలకరించగా, జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’తో అలరించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


