Toxic Dhurandhar 2: టాక్సిక్ వెనక్కి తగ్గింది ధురంధర్ 2పై భయంతో కాదు- అసలు కారణం వేరేనట- యశ్ కూడా ఎదురుచూస్తున్నారంటూ!
Yash Toxic Postponed Reasons Over Dhurandhar 2 Fear: యశ్ నటించిన టాక్సిక్ విడుదల వాయిదా పడటంపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2కి భయపడే యశ్ వెనక్కి తగ్గారన్న వార్తల్లో నిజం లేదని, దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సినీ వర్గాలకు సంబంధించిన ఓ విశ్వసనీయ మూలం స్పష్టం చేసింది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’, బాలీవుడ్ స్పై యాక్షన్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ మధ్య బాక్సాఫీస్ పోరు గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.

మొదట ఈ రెండు సినిమాలు మార్చి 19న ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా టాక్సిక్ మేకర్స్ తమ సినిమాను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రణ్‌వీర్ సింగ్ సినిమా పోటీకి భయపడే యశ్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
రణ్‌వీర్ సినిమా అంటే యశ్‌కు ఇష్టం!
కానీ, తాజా సమాచారం ప్రకారం యశ్‌కు ‘ధురంధర్ 2’ అంటే ఎలాంటి భయం లేదని, పైగా ఆయన ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. "యశ్‌కు ధురంధర్ మొదటి భాగం చాలా నచ్చింది. పార్ట్ 2 కోసం ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాల మధ్య పోటీ, ఆందోళన అంతా బయట వ్యక్తులు సృష్టించినవే తప్ప, హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవు" అని ఒక విశ్వసనీయ మూలం వెల్లడించింది.
వాయిదాకు అసలు కారణం ‘యుద్ధం’!
టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి అసలు కారణం మధ్యప్రాచ్యం (Middle East)లో నెలకొన్న యుద్ధ వాతావరణమేనని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్కడ సినిమాను భారీగా విడుదల చేయడం సాధ్యం కాదని మేకర్స్ భావించారట.
"టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరాలన్నదే మా లక్ష్యం. గల్ఫ్ పరిస్థితుల వల్ల మా పార్ట్‌నర్స్‌కి, ప్రేక్షకులకు ఇబ్బంది కలగకూడదనే జూన్ 4కి వాయిదా వేశాం" అని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టీమ్ ప్రకటించింది.
ధురంధర్ 2కి ఆ భయం లేదు ఎందుకు?
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అదే యుద్ధ వాతావరణం ఉన్నా ‘ధురంధర్ 2’ మాత్రం మార్చి 19నే విడుదలవుతోంది. దీనికి కారణం ఆ సినిమాపై ఉన్న ‘యాంటీ పాకిస్థాన్’ ముద్ర.
మొదటి భాగం లాగే రెండో భాగాన్ని కూడా ముస్లిం దేశాల్లో నిషేధించే అవకాశం ఉండటంతో, గల్ఫ్ మార్కెట్ గురించి ఆ చిత్ర యూనిట్ పెద్దగా ఆందోళన చెందడం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 19న థియేటర్లలోకి వస్తామని వారు స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్‌తో పోటీ
ఇదిలా ఉంటే, రణ్‌వీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో తలపడనుంది. మొత్తానికి ‘రాకీ భాయ్’ వెనక్కి తగ్గింది పోటీకి భయపడి కాదని, ఒక పక్కా వ్యూహంతోనే అని ఆయన అభిమానులు గర్వంగా చెబుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


