ఓరి మూర్ఖుల్లారా.. నేను మాట్లాడింది 2 సినిమాల శైలి గురించి.. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 కామెంట్లపై ఆర్జీవీ క్లారిటీ
మార్చి 19న అతిపెద్ద బాక్సాఫీస్ పోటీ టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 మధ్య నడవనుంది. ఈ విషయంపై నిన్న (ఫిబ్రవరి 22) సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆయన చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఆర్జీవీ.
తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. రీసెంట్‌గా టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, తన కామెంట్లపై ఎప్పుడు వివరణ ఇచ్చుకోని ఆర్జీవీ తాజాగా క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ పోటీ
మార్చి 19న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ పోటీ జరగనుంది. అందుకు కారణం ధురంధర్ 2, టాక్సిక్ వంటి భారీ సినిమాలు అదే రోజున విడుదల కావడం. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై గత కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు.
రీసెంట్‌గా నిన్న (ఫిబ్రవరి 22) ఆదివారం రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటల్లో దాదాపుగా ధురంధర్ 2 సినిమాను పొగుడుతున్నట్లుగానే ఉంది. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఓరి మూర్ఖుల్లారా
దీంతో ఇప్పుడు ఆ కామెంట్లపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ వేశారు రామ్ గోపాల్ వర్మ. "నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలని ఓరి మూర్ఖుల్లారా.. మీకోసమే ఈ క్లారిటీ ఇస్తున్నాను. ఈ రెండు సినిమాల (ధురంధర్ 2, టాక్సిక్) రిలీజ్ సందర్భంగా నేను చెప్పింది కేవలం సినిమా శైలిల గురించి మాత్రమే తప్పా ఏదో ఒక ఫిల్మ్ గురించి కాదు" అని ఆర్జీవీ రాసుకొచ్చారు.
పాత ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. గత ట్వీట్‌లో రామ్ గోపాల్ వర్మ "భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక వింత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో కేజీఎఫ్ ’ సాధించిన భారీ వసూళ్లు ధురంధర్ ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు ధురంధర్ 2 అనే డేవిడ్ ముందు టాక్సిక్ అనే కొత్త గోలియత్ నిలబడింది" అని తెలిపారు.
ఒక్క నటుడినే దేవుడిలా
"ధురంధర్ మేకర్స్ ప్రేక్షకుల తెలివితేటలను గౌరవిస్తారు. కానీ, టాక్సిక్ మేకర్స్ మాత్రం ప్రేక్షకులు మూర్ఖులని భ్రమపడతారు. కేవలం ఒక్క నటుడిని దేవుడిలా చూపించడానికి రూ. 700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రను మనిషిలా చూపించడానికి రూ. 130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప" అంటూ రాసుకొచ్చారు ఆర్జీవీ.
ఇదిలా ఉంటే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్ నటించిన సినిమానే టాక్సిక్. నయనతార, హ్యూమా ఖురేషీ, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో బ్రూటల్ వయోలెన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి.
ఒకేరోజు పోటీ
మరోవైపు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ధురంధర్ సినిమా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్ 2 లేదా ధురంధర్ ది రివేంజ్ తెరకెక్కింది. బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు తలపడనుండటంతో ఆర్జీవీ వరుసగా ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


