Rajamouli Dhurandhar 2 Review: ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి-రణ్‌వీర్ యాక్టింగ్ మాస్టర్‌క్లాస్-ధురంధర్ 2పై రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి 'ధురంధర్ 2' సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఈ బ్లాక్ బస్టర్ మూవీపై తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఇది తెగ వైరల్ గా మారింది. 

Published on: Mar 21, 2026, 13:40:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రానికి స్పెషల్ గుర్తింపు దక్కింది. భారతీయ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించాడు. సినిమా స్థాయి, రచన, అందులోని భావోద్వేగ లోతును ఆయన ప్రత్యేకంగా కొనియాడాడు.

ధురంధర్ 2పై రాజమౌళి రివ్యూ
ధురంధర్ 2పై రాజమౌళి రివ్యూ

రాజమౌళి రివ్యూ

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2పై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రివ్యూ పంచుకున్నాడు. "నేను ధురంధర్-1 ను ఎంతగానో ప్రేమించాను, కానీ 'ది రివెంజ్' దాని స్థాయి, ఆత్మ రెండింటిలోనూ అసలు సినిమాను మించిపోయింది" అని రాజమౌళి రాసుకొచ్చాడు.

గట్స్ ఉండాలి

‘‘సినిమా సాంకేతిక అంశాలు, నటీనటుల ఎంపిక, ప్రపంచ స్థాయి రూపకల్పనలో ఎలాంటి లోపం లేదు. నాలుగు గంటల సుదీర్ఘ నిడివి గల సినిమాను తీయడానికి గట్స్ ఉండాలి. డైరెక్టర్ ఆదిత్య ధర్ అదరగొట్టాడు. లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు’’ అని రాజమౌళి తన రివ్యూలో పేర్కొన్నాడు.

రణ్‌వీర్ నటనపై ప్రశంసలు

ధురంధర్ 2 హీరో రణ్‌వీర్ సింగ్ నటనను రాజమౌళి ఒక 'స్టాండౌట్' అని వర్ణించాడు. "ఏమి నటన మిత్రమా! షెడ్‌లో సోదరితో వచ్చే సన్నివేశం.. నటనలో ఒక మాస్టర్‌క్లాస్. ప్రారంభం నుంచి హృదయ విదారక క్లైమాక్స్ వరకు హమ్జా, జస్కిరాత్ పాత్రల్లో మమ్మల్ని మంత్రముగ్ధులను చేశావ్" అని రాజమౌళి కొనియాడాడు.

మాధవన్ కూడా

రణ్‌వీర్ తో పాటు ఆర్.మాధవన్ నటనను కూడా రాజమౌళి ప్రశంసించాడు. ఒక దేశపు నిస్సహాయతను ఆయన తన పాత్ర ద్వారా అద్భుతంగా పండించాడని రాజమౌళి పేర్కొన్నారు.

మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి కూడా 'ధురంధర్ 2' పై ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది.

ధురంధర్ 2 గురించి..

డిసెంబర్ 5, 2025లో ధురంధర్ మూవీ రిలీజైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ 2 కూడా బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ తదితరులు నటించారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో ధురంధర్ 2 మూవీ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పాకిస్థాన్ లోని అండర్ వరల్డ్ గ్యాంగ్ లో చేరి అక్కడి టెర్రరిస్టులను చంపేసే క్యారెక్టర్ లో రణ్‌వీర్ సింగ్ నటించాడు. మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More