Mahesh Babu Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ఊచకోత.. 'ధురంధర్ 2' చూసి మహేష్ బాబు సంచలన రివ్యూ.. ఏమన్నాడంటే?

Mahesh Babu Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రూ.146 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను చైసి సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. 

Published on: Mar 20, 2026, 11:06:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ స్టార్ల ప్రశంసలతో నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది.

ధురంధర్ 2 సినిమాపై మహేష్ బాబు రివ్యూ
ధురంధర్ 2 సినిమాపై మహేష్ బాబు రివ్యూ

మహేష్ బాబు రివ్యూ

ధురంధర్ 2 సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. "ధురంధర్ 2 అద్భుతంగా పేలింది! రణ్‌వీర్ సింగ్ తన అత్యుత్తమ వెర్షన్‌ను బయటపెట్టాడు. ఆదిత్య ధర్ విజన్, మేకింగ్ స్టైల్ నన్ను ఆశ్చర్యపరిచాయి. మాధవన్ యాక్టింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి" అని మహేష్ బాటు ఎక్స్ లో రాసుకొచ్చాడు.

ఆదిత్య ధర్ మహేష్ బాబు ప్రశంసలకు స్పందిస్తూ.. "మీ మాటలకు కృతజ్ఞతలు మహేష్. ధురంధర్ ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని రిప్లే ఇచ్చాడు.

ఎన్టీఆర్ కూడా

మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ధురంధర్ 2 సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. "భారతీయ ప్రేక్షకులకు ఆదిత్య ధర్ ఒక తుఫానును అందించాడు. రణ్‌వీర్ సింగ్ తెరపై ఒక మాస్టర్ క్లాస్ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ" అంటూ చిత్ర బృందానికి తారక్ బిగ్ సల్యూట్ చేశారు.

చరిత్ర సృష్టించిన కలెక్షన్లు

ధురంధర్ 2 మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.146 కోట్లు వసూలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇందులో ప్రివ్యూ షోల ద్వారానే రూ.43 కోట్లు రావడం విశేషం. రణ్‌వీర్ సింగ్ భారతీయ గూఢచారిగా పాకిస్థాన్ గ్యాంగ్స్‌లో చొరబడి, తన పవర్‌ను ఎలా చాటుకున్నాడనే కథాంశం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతోంది.

ధురంధర్ 2 గురించి

ఆదిత్య ధర్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ధురంధర్ 2 తెరకెక్కింది. డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ధురంధర్ 2 ఇప్పుడు థియేటర్లకు వచ్చింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు.

రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక మాస్ గూఢచారిగా, గ్యాంగ్‌స్టర్‌గా విశ్వరూపం చూపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More