Rajamouli Priyanka: ఆమె టాలెంట్ ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది: ప్రియాంక చోప్రాపై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి
గ్లోబల్ ఐకాన్ ప్రియంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ 'ది బ్లఫ్' (The Bluff)పై దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. రాజమౌళి ట్వీట్‌కు ప్రియంక స్పందిస్తూ.. "త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం" అని సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గ్లోబల్ స్టార్ ప్రియంక చోప్రా తన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’తో మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ చూస్తే ఆమె టాలెంట్ ఏంటో తెలుస్తుందని అనడం విశేషం.

రాజమౌళి ఏమన్నారంటే?
ప్రియాంక చోప్రా నటనలోని వైవిధ్యాన్ని కొనియాడుతూ రాజమౌళి ఎక్స్ లో ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. "ఒకే సమయంలో రెండు భిన్నమైన భావోద్వేగాలను పండించగల అతికొద్ది మంది నటుల్లో ప్రియాంక ఒకరు. ఆమె ఒక క్షణంలో ఎంతో సున్నితంగా కనిపిస్తూనే, మరుక్షణంలో ఎంతో శక్తివంతంగా మారిపోగలరు. 'ది బ్లఫ్' సినిమా ఆమెలోని ఈ అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. ఇందులో ఆమె చేసిన ప్రమాదకరమైన స్టంట్లు అద్భుతం" అని రాజమౌళి పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ సినిమా వేగం, మూడ్ తనకు ఎంతో నచ్చాయని అతడు ప్రశంసించాడు.
ప్రియంక అదిరిపోయే రిప్లై
రాజమౌళి ప్రశంసలపై ప్రియాంక చోప్రా కూడా అంతే ఉత్సాహంగా స్పందించింది. అతని ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. "థాంక్యూ సార్.. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం" అని సమాధానమిచ్చింది. ప్రియంక ఇచ్చిన ఈ చిన్న హింట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ 'వారణాసి' (Varanasi)లో ప్రియాంక.. మందాకిని అనే పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 14 నెలలుగా షూటింగ్ లో ఆమె పాల్గొంటోంది. మరో ఆరు నెలల షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే ఈ మూవీ మరో షెడ్యూల్లో ఆమె పాల్గొనబోతున్నట్లు ఈ ట్వీట్ తో స్పష్టమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
'ది బ్లఫ్' లో ప్రియంక రోల్
ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది బ్లఫ్' లో ప్రియాంక చోప్రా మాజీ సముద్రపు దొంగ పాత్రలో నటించింది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తన గతాన్ని ఎదుర్కొనే ఒక సాహసోపేతమైన మహిళగా ఆమె కనిపిస్తుంది. ఇందులో ఆమె చేసిన కత్తి యుద్ధాలు, క్లోజ్ కాంబాట్ సీన్లు ప్రియంకను ఒక 'యాక్షన్ హీరో'గా నిలబెట్టాయి. రాజమౌళి వంటి దర్శకుడి నుంచి ప్రశంసలు దక్కడం ప్రియాంక అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
అంతకుముందు వారణాసి కోస్టార్ మహేష్ బాబు కూడా ప్రియాంకను ప్రశంసించాడు. "ఆకట్టుకునే యాక్షన్ & ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించిన సినిమా ది బ్లఫ్. ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఆత్మవిశ్వాసంతో చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో అన్ని విధాలుగా సత్తాచాటింది. అమేజింగ్ గా పని చేసిన ఆ టీమ్ మొత్తానికి నా ప్రేమను పంపుతున్నా’’ అని ఎక్స్ పోస్టులో మహేష్ బాబు రాసుకొచ్చాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


