Smriti Mandhana: గుర్తుపట్టలేని లుక్‌లో స్మృతి మంధాన.. గ్లామరస్ ఫొటోలు వైరల్.. ఇదే తొలిసారి, కోసేసేలా ఉందంటూ!

Smriti Mandhana In Blue Metallic Gown: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గుర్తుపట్టలేని లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచారు. స్మృతి మంధాన తన గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బ్లూ మెటాలిక్ గౌనులో మెరిసిపోతున్న స్మృతి మంధాన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Mar 20, 2026, 20:19:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా క్రికెట్ కిట్, జెర్సీలో మైదానంలో బౌలర్లను ఉతికేసే స్మృతి మంధానను చూశాం. కానీ, తాజాగా ఆమె అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చి 17న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని స్మృతి మంధాన ఫోటోలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. మెరిసిపోయే బ్లూ మెటాలిక్ డ్రెస్సులో ఆమె ఒక అంతర్జాతీయ మోడల్‌ను తలపించారు.

గుర్తుపట్టలేని లుక్‌లో స్మృతి మంధాన.. గ్లామరస్ ఫొటోలు వైరల్.. ఇదే తొలిసారి, కోసేసేలా ఉందంటూ! (Instagram/@smriti_mandhana)
గుర్తుపట్టలేని లుక్‌లో స్మృతి మంధాన.. గ్లామరస్ ఫొటోలు వైరల్.. ఇదే తొలిసారి, కోసేసేలా ఉందంటూ! (Instagram/@smriti_mandhana)

రాజసం ఉట్టిపడే బ్లూ మెటాలిక్ గౌను

ప్రముఖ డిజైనర్ రిమ్‌జిమ్ దాదు రూపొందించిన కస్టమ్ మెటాలిక్ బ్లూ స్కల్‌ప్చర్ గౌనులో స్మృతి మంధాన మెరిసిపోయారు. ఈ డ్రెస్సులో వాడిన ప్రత్యేకమైన 'కోర్డెడ్' టెక్స్‌చర్ వల్ల అది ద్రవ రూపంలో ఉన్న మెటల్‌లా కనిపిస్తూ, వెలుతురులో వింత కాంతిని వెదజల్లుతోంది.

రాయల్ బ్లూ షేడ్

రాయల్ బ్లూ షేడ్, బాడీకి అతుక్కుపోయేలా ఉన్న బోడిస్, వెనుక వైపు పొడవుగా సాగిపోయే 'ట్రైన్' డిజైన్ స్మృతి ఒక గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ లుక్‌ని ఇచ్చాయి. ఆధునిక కళాత్మకతను, హుందాతనాన్ని కలిపి ఈ డ్రెస్సును రూపొందించారు.

తక్కువలో ఎక్కువ అందం!

డ్రెస్ ఎంత గ్రాండ్‌గా ఉన్నా, స్మృతి తన మేకప్, హెయిర్ స్టైల్‌ను చాలా సింపుల్‌గా ఉంచుకున్నారు. మధ్యలోకి పాపిడి తీసి, లైట్ వేవ్స్ లాంటి హెయిర్ స్టైల్ స్మ్రతి ముఖ వర్చస్సును మరింత పెంచింది. మేకప్ విషయానికి వస్తే.. డ్యూయి బేస్, చిన్న వింగ్డ్ ఐ లైనర్, న్యూడ్-మావ్ లిప్ స్టిక్‌తో తన సహజమైన అందాన్ని ఎలివేట్ చేసుకున్నారు. యాక్సెసరీస్ కూడా చాలా తక్కువగా, కేవలం వెండి స్టడ్స్, సన్నని బ్రాస్‌లెట్‌తో తన లుక్‌ను పూర్తి చేశారు.

నెటిజన్లు ఫిదా.. "క్రికెటర్ కాదు, ఇంటర్నెట్ బ్రేకర్!"

స్మృతి మంధాన ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "పార్ట్ టైమ్ క్రికెటర్.. ఫుల్ టైమ్ ఇంటర్నెట్ బ్రేకర్" అని ఒకరు కామెంట్ చేయగా, "నీ జావ్‌లైన్ (దవడ ఎముక) అంత షార్ప్‌గా ఉందేంటి.. కోసేసేలా ఉంది!" అని మరొకరు స్మృతి ఫీచర్స్‌ని పొగిడారు.

ఇదే తొలిసారి కావడంతో

"నీకంటే నీలి రంగు ఎవరికీ ఇంత అందంగా సెట్ అవ్వదు" అని మరికొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికి స్మృతి ఈ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోయడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

స్మృతి మంధాన గురించి క్లుప్తంగా..

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2025 మహిళల ప్రపంచ కప్ విజయంతో పాటు 2016, 2022 ఆసియా కప్ టోర్నీల్లో భారత్ విజేతగా నిలవడంలో స్మృతి మంధాన బ్యాటింగ్ కీలకంగా నిలిచింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More