Ravi Teja Review: ధురంధర్ 2పై రవితేజ కూడా రివ్యూ ఇచ్చేశాడు- బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియెన్స్, రాకేష్ బేడీ నటన అద్భుతం అంటూ!

Ravi Teja Review On Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ధురంధర్ 2పై రివ్యూ ఇస్తూ రణ్‌వీర్ సింగ్ నటనను పొగిడారు రవితేజ.

Published on: Mar 22, 2026, 08:46:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ ది రివేంజ్ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి ప్రశంసలు, రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఆఖరికి ధురంధర్ 2పై మాస్ మహారాజా రవితేజ కూడా రివ్యూ ఇచ్చేశారు.

ధురంధర్ 2పై రవితేజ కూడా రివ్యూ ఇచ్చేశాడు- బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియెన్స్, రాకేష్ బేడీ నటన అద్భుతం అంటూ!
ధురంధర్ 2పై రవితేజ కూడా రివ్యూ ఇచ్చేశాడు- బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియెన్స్, రాకేష్ బేడీ నటన అద్భుతం అంటూ!

బాక్సాఫీస్ ప్రభంజనం

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా, సౌత్ ఇండియాలోని అగ్ర తారలు సైతం ఈ సినిమాను చూసి ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి స్టార్స్ ధురంధర్ 2 చిత్రాన్ని మెచ్చుకోగా తాజాగా మాస్ మహారాజా రవితేజ ఈ జాబితాలో చేరారు.

రవితేజ ఏమన్నారంటే?

ధురంధర్ ది రివేంజ్ సినిమా చూసిన తర్వాత తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రవితేజ స్పందిస్తూ.. "ధురంధర్ 2 చూడటం ఒక బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్. స్క్రీన్ మీద రణ్‌వీర్ సింగ్ నిప్పులు చెరిగారు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తమ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా రాకేష్ బేడీ గారి నటన అద్భుతం" అని అన్నారు.

"ఇంతటి భారీ చిత్రాన్ని ఎంతో నేర్పుతో తెరకెక్కించిన ఆదిత్య ధర్ గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమా వెనుక ఉన్న రీసెర్చ్, కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు" అని రవితేజ పేర్కొన్నారు. ప్రస్తుతం ధురంధర్ 2పై రవితేజ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రకాష్ రాజ్ సెటైర్లు

ఇదిలా ఉంటే, సౌత్ అగ్ర హీరోలు ధురంధర్ 2 సినిమాను ప్రశంసించడం పట్ల ప్రముఖ నటుడు ప్రకాష్ సెటైర్లు వేశారు. "కృతజ్ఞత అవసరాలు సౌత్ వైపుకు పాకాయి" అని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. అంటే, కేవలం అవసరానికో, ఏదో ఒక కారణంతో మాత్రమే అలా ప్రశంసిస్తున్నారనే అర్థంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది.

అల్లు అర్జున్ ప్రశంసల జల్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా గురించి చెబుతూ.. "ఇదొక స్వ్యాగ్ ఉన్న దేశభక్తి చిత్రం. ప్రతి దేశభక్తుడు గర్వపడేలా సినిమా ఉంది. రణ్‌వీర్ లాంటి వెర్సటైల్ యాక్టర్ మన దేశంలో ఉండటం గర్వకారణం. ఆదిత్య ధర్ గారు బంతిని స్టేడియం దాటించారు (సిక్సర్ కొట్టారు). ఇండియన్ స్టోరీకి ఇంటర్నేషనల్ స్వ్యాగ్ అద్ది అదరగొట్టారు" అని ప్రశంసించారు.

రిషబ్ శెట్టి రివ్యూ

అలాగే, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి సైతం ధురంధర్ 2పై స్పందిస్తూ.. "ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఒక స్టేట్‌మెంట్. ప్రతి ఫ్రేమ్ యుద్ధనగారా మోగించినట్టు ఉంది" అని రివ్యూ ఇచ్చారు.

ధురంధర్ 2 కథ

ఒక భారతీయ గూఢచారి పాకిస్థాన్ అండర్‌వరల్డ్‌లోకి చొరబడి, అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఎలా కూల్చాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. రణ్‌వీర్ సింగ్ నటనతో పాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్‌ల పర్ఫామెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

ధురంధర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్స్

ప్రస్తుత సమాచారం ప్రకారం, 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ధురంధర్ 2 సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఇండియాలో రూ. 404 కోట్ల గ్రాస్ వసూళ్లు, రూ. 339 కోట్ల నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More