OTT Show: హీరో ప్రాంక్, భయంతో వణికిపోయిన హీరోయిన్లు- ఓటీటీ రియాలిటీ షోలో అక్షయ్ కుమార్ పంచ్‌లు, డైరెక్టర్ సెటైర్లు!
Akshay Kumar Pranks Jacqueline Fernandez Bhumi Pednekar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరించిన ఓటీటీ రియాలిటీ గేమ్ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అట్టహాసంగా ముగిసింది. ఈ షోలో అక్షయ్ చేసిన అల్లరి, ప్రాంక్‌ల గురించి హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, భూమి పెడ్నేకర్ షేర్ చేసుకున్నారు.
Akshay Kumar Pranks Jacqueline Fernandez Bhumi Pednekar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, షూటింగ్ సెట్స్‌లో తోటి నటీనటులపై ప్రాంక్‌లు చేయడంలో కూడా ఆయన దిట్ట. తాజాగా ఓటీటీ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ముగింపు వేడుకలో పాల్గొన్న గ్లామర్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తన కెరీర్ మొదట్లో అక్షయ్ తనను ఎంతగా భయపెట్టారో గుర్తుచేసుకున్నారు. ‘హౌస్‌ఫుల్’ సినిమాలో తాను ‘ధన్నో’ ఐటమ్ సాంగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పారు.

భయంతోనే ఐటమ్ సాంగ్ కంప్లీట్
"సెట్‌లో చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉండటం చూసి, వీరంతా పోలీసులు ఏమో అని అక్షయ్ సార్‌ని అడిగాను. దానికి ఆయన చాలా సీరియస్‌గా మొహం పెట్టి.. 'జాక్వెలిన్, నువ్వు ఏదైనా తప్పు చేశావా? పోలీసులు నీ కోసమే వచ్చారు. షూటింగ్ పూర్తి కాగానే నిన్ను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు' అని చెప్పారు. ఆ మాటలతో నాకు ప్రాణం పోయినంత పనైంది. ఆ పాట మొత్తం షూట్ చేస్తున్నంత సేపు నేను భయం భయంగానే ఉన్నాను" అని జాక్వెలిన్ ఆ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
వీసా గొడవతో అక్షయ్ సెటైర్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాటలకు అక్షయ్ కుమార్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "నువ్వు ఆ రోజు పోలీసులకు భయపడలేదు.. నీ దగ్గర అప్పుడు సరైన వీసా లేదేమోనని భయపడ్డావు" అని నవ్వుతూ ఆటపట్టించారు. ఆ తర్వాత సరదాగా ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు అక్షయ్ కుమార్.
ఇలా కేవలం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రమే కాదు.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ షూటింగ్ సమయంలో బైక్ స్పీడ్ అంటే తనకు భయమని తెలిసినా, అక్షయ్ కావాలని చాలా వేగంగా బైక్ నడిపి తనను భయపెట్టారని భూమి పెడ్నేకర్ కూడా చెప్పుకొచ్చారు.
ఫరా ఖాన్ పంచ్.. నవ్వుల పూత
ఇదే వేడుకలో పాల్గొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తనదైన స్టైల్లో అక్షయ్‌పై పంచ్‌లు వేశారు. అక్షయ్ ఆమెను చూసి "నేను నీతో ఎప్పుడైనా ప్రాంక్ చేశానా?" అని అడగ్గా.. "నువ్వు నాతో 'తీస్ మార్ ఖాన్', 'జోకర్' వంటి సినిమాలు చేశావు కదా.. అంతకంటే పెద్ద ప్రాంక్ ఇంకేముంటుంది?" అని సమాధానమిచ్చారు. దీంతో సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ విశేషాలు
చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ టెలివిజన్ ప్రేక్షకులను పలకరిస్తూ చేసిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ మొత్తం 65 ఎపిసోడ్ల పాటు సాగి, సామాన్యులకు అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు భారీగా నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. ఈ షోను చూడాలనుకునే వారు ప్రస్తుతం సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


