Bhooth Bangla BO: ఫామ్‌లోకి వచ్చిన అక్షయ్ కుమార్- 100 కోట్లు దాటేసిన భూత్ బంగ్లా-ఆ 3 సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ అవుట్!
Bhooth Bangla Box Office Collection Day 5: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వీక్‌డేస్‌లోనూ నిలకడైన వసూళ్లతో ఈ హారర్ కామెడీ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Bhooth Bangla 5 Days Worldwide Collection: చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన పాత ఫామ్‌లోకి వచ్చారు. ఏప్రిల్ 17న విడుదలైన ‘భూత్ బంగ్లా’ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ. 3.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, తొలిరోజే రూ. 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.

వీకెండ్ ముగిసేసరికి దేశవ్యాప్తంగా రూ. 58 కోట్లు కొల్లగొట్టి తన సత్తా చాటింది భూత్ బంగ్లా సినిమా. సోమవారం (ఏప్రిల్ 20) వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, మంగళవారం మళ్లీ పుంజుకుని రూ. 8 కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో ఐదు రోజుల్లో భారతీయ బాక్సాఫీస్ వద్ద భూత్ బంగ్లా సినిమా మొత్తం రూ. 72.75 కోట్ల నెట్ (రూ. 86.62 కోట్ల గ్రాస్) కలెక్షన్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
గ్లోబల్ మార్కెట్‌లోనూ అదే జోరు
కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భూత్ బంగ్లా సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా ఐదు రోజుల్లోనే 3 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ. 118 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే జోరు కొనసాగితే రెండో వారాంతం నాటికి రూ. 150 కోట్ల మార్కును సునాయాసంగా దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ, ఆడియన్స్ మాత్రం అక్షయ్ మార్క్ కామెడీకే పట్టం కడుతున్నారు.
‘భేడియా’ రికార్డులు కనుమరుగు
ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో ‘భూత్ బంగ్లా’ ఇప్పటికే టాప్-3లో నిలిచింది. షాహిద్ కపూర్, తమన్నాల ‘ఓ రోమియో’ (రూ. 92 కోట్లు), రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ (రూ. 78 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను ఐదు రోజుల్లోనే అధిగమించింది భూత్ బంగ్లా చిత్రం.
దీనికంటే ముఖ్యంగా, బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్‌లో సంచలనం సృష్టించిన వరుణ్ ధావన్ ‘భేడియా’ (రూ. 90 కోట్లు) రికార్డును కూడా బద్దలు కొట్టింది. త్వరలోనే ‘ముంజ్యా’ (రూ. 132 కోట్లు) రికార్డుపై కన్నేసిన ఈ చిత్రం.. స్త్రీ, భూల్ భూలయ్యా 2 వంటి చిత్రాల సరసన నిలవడానికి సిద్ధమవుతోంది.
14 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం
దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కలయికలో సినిమా వచ్చి 14 ఏళ్లవుతోంది. గతంలో ‘భూల్ భూలయ్యా’ లాంటి క్లాసిక్ ఇచ్చిన ఈ జోడీ, ఇప్పుడు ‘భూత్ బంగ్లా’తో మరోసారి మేజిక్ రిపీట్ చేసింది. ఇందులో టబు, వామికా గబ్బి కీలక పాత్రలు పోషించగా.. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్‌ల కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచింది. హారర్ ఎలిమెంట్స్‌కు వింటేజ్ కామెడీ తోడవడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


