Priyadarshan: బాలీవుడ్‌లో జరుగుతున్న అతి ఘోరమైన విషయం, సౌత్‌లో ఇలా ఉండదు.. హీరోయిన్ తండ్రి ప్రియదర్శన్ కామెంట్స్
Director Priyadarshan On Bollywood Entourage Culture: సినిమా సెట్స్‌పై హీరో హీరోయిన్ల వెంట వచ్చే భారీ సిబ్బంది వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై కొత్త లోకా హీరోయిన్ తండ్రి ప్రియదర్శన్ ఘాటుగా స్పందించారు. సీనియర్ నటుల కంటే ఈ సహాయకులకే ఎక్కువ రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా రంగంలో గత కొన్నాళ్లుగా 'స్టార్ కల్చర్' చుట్టూ ఉన్న ఒక అంశం నిర్మాతలకు, దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. అదే.. హీరో హీరోయిన్ల వెంట సెట్స్‌కు వచ్చే భారీ సిబ్బంది (Entourage).

మేకప్ ఆర్టిస్టులు, మేనేజర్లు, పీఆర్ హెడ్స్, ట్రైనర్లు, వంట మనుషులు.. ఇలా పదుల సంఖ్యలో సిబ్బంది షూటింగ్ స్పాట్‌లో వాలిపోతుండటంపై ప్రముఖ దర్శకుడు, కొత్త లోకా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రియదర్శన్ ఇప్పుడు బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది బాలీవుడ్‌లో జరుగుతున్న 'అత్యంత దారుణమైన విషయం' అని డైరెక్టర్ ప్రియదర్శన్ అభివర్ణించారు.
"నా కెమెరా ఫ్రేమ్ కూడా కనిపించడం లేదు"
ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ ఈ అంశంపై దుమ్మెత్తిపోశారు. "నిజం చెప్పాలంటే నాకు ఇది అస్సలు నచ్చదు. నలుగురు నటులు ఉంటే, వారి వెంట 40 నుంచి 60 మంది సహాయకులు ఉంటున్నారు. దీనివల్ల అసలు నా కెమెరా ఫ్రేమ్ ఎక్కడుందో కూడా నాకు కనిపించడం లేదు" అని ప్రియదర్శన్ అన్నారు.
"ఏ పని లేకపోయినా జుట్టు సరిచేయడం వంటి చిన్న చిన్న కారణాలతో వాళ్లంతా సెట్ చుట్టూ తిరుగుతుంటారు. ప్లీజ్.. ఇక్కడి నుంచి వెళ్లండి అని నేను పదే పదే అడగాల్సి వస్తోంది. నా సినిమా సెటప్ కంటే నటుల చుట్టూ ఉండే ఈ హడావుడే ఎక్కువగా ఉంటోంది" అని దర్శకుడు ప్రియదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు.
లెజెండరీ నటుడు అశ్రాని కంటే వారికే ఎక్కువ జీతమా?
ఈ సందర్భంగా ప్రియదర్శన్ ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. గతంలో అశ్రాని వంటి దిగ్గజ నటులకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే, ఇప్పుడు నటుల వెంట వచ్చే ఈ సిబ్బందికే ఎక్కువ డబ్బులు అందుతున్నాయని ప్రియదర్శన్ పేర్కొన్నారు. "స్థిరపడిన నటుల కంటే వీరే ఎక్కువ సంపాదిస్తున్నారు. మనందరికీ తెలిసిన అశ్రాని సార్ వంటి వారికి కూడా ఒకప్పుడు చాలా తక్కువ చెల్లించేవారు" అని గుర్తుచేశారు.
సౌత్‌లో ఇలా ఉండదు
దక్షిణాది సినిమాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదని, అక్కడ సిబ్బంది వచ్చినా సెట్ బయటే ఉంటారని దర్శకుడు ప్రియదర్శన్ వివరించారు. నటులు పిలిస్తే తప్ప వారు లోపలికి రారని, కానీ బాలీవుడ్‌లో మాత్రం అందరూ సెట్ మధ్యలోనే తిష్టవేస్తున్నారని ప్రియదర్శన్ విమర్శించారు.
చివరిసారిగా 'భూత్ బంగ్లా'లో..
ప్రియదర్శన్, అశ్రానిలది దశాబ్దాల అనుబంధం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అయితే, దురదృష్టవశాత్తూ 2025లో అశ్రాని కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం 'భూత్ బంగ్లా' త్వరలోనే విడుదల కానుంది.
హారర్ కామెడీ చిత్రంగా
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్ వంటి భారీ తారాగణం ఉంది. 'భాగం భాగ్', 'హేరా ఫేరి' వంటి క్లాసిక్ సినిమాల తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ జోడీ మళ్లీ ఈ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


