Kalyani Priyadarshan: ప్రేమకు సాక్ష్యంగా నిలవడం ఎంత అదృష్టమో-అందమైన ఆరంభం-విజయ్, రష్మిక పెళ్లిపై కళ్యాణి ప్రియదర్శన్

ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి హాజరైన కొద్దిమంది సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్  కూడా ఉంది. విరోష్ వెడ్డింగ్ గురించి ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. 

Updated on: Feb 27, 2026, 05:47:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రష్మిక, విజయ్ ఏడు అడుగులు నడిచారు. ఈ విరోష్ వెడ్డింగ్ కు అటెండ్ అయిన వాళ్లలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఉంది. ఈ పెళ్లి గురించి ఆమె హత్తుకునే పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

పెళ్లి ఫొటోలతో

రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలను కళ్యాణి ప్రియదర్శన్ తన స్టోరీస్‌లో షేర్ చేసింది. క్యాప్షన్ లో.. "ఈరోజు నేను అత్యంత అందమైన ప్రదేశంలో తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూశా. అతను వెనకాలకు తిరిగి కూర్చున్నప్పుడు ఆమె అతని వైపు నడిచింది. అప్పుడు ఆమె వేసిన ఒక్కో అడుగు బరువును మీరూ ఫీల్ కావచ్చు. ఆ నెమ్మదిగా పడిన అడుగులు, స్థిరమైన శ్వాస, ఉప్పొంగిన కళ్లు అన్ని విషయాలను చెప్పేశాయి’’ అని కళ్యాణి ప్రియదర్శన్ పేర్కొంది.

ప్రేమకు సాక్ష్యంగా

"ఎఫర్ట్, రెస్పెక్ట్, డీప్ ఫ్రెండ్ షిప్ తో ఏర్పడిన ప్రేమకు సాక్ష్యంగా నిలవడం ఎంత అదృష్టమో. నా ప్రియమైన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు అభినందనలు ఇది అత్యంత అందమైన ఆరంభం కావాలి" అని తన క్యాప్షన్ లో కళ్యాణి ప్రియదర్శన్ రాసుకొచ్చింది.

కళ్యాణి ప్రియదర్శన్ స్టోరీ
కళ్యాణి ప్రియదర్శన్ స్టోరీ

విరోష్ పెళ్లి గురించి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం 10.10 గంటలకు జరిగింది. ఫస్ట్ తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మందన్న మెడలో విజయ్ దేవరకొండ మూడు ముళ్లు వేశాడు. ఆ తర్వాత కొడవ ఆచారం ప్రకారం మరోసారి వివాహ తంతు నిర్వహించారు. విజయ్, రష్మిక తమ విరోష్ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫ్యాన్స్ తో తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

విజయ్, రష్మిక లవ్

విజయ్, రష్మిక 2018లో రిలీజైన ‘గీత గోవిందం’ కోసం తొలిసారి కలిసి నటించారు. 2019లో విడుదలైన 'డియర్ కామ్రేడ్' మూవీలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే విజయ్, రష్మిక మధ్య ప్రేమ కలిగిందనే టాక్ ఉంది. అప్పటి నుంచి ఈ జంట డేటింగ్ లో ఉందని సమాచారం. కానీ దీని గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More