ఆ ఇద్దరు టాప్ హీరోలతో లోకా ఛాప్టర్ 2.. కల్యాణి ప్రియదర్శన్ కామెంట్స్ వైరల్.. అత్యధిక వసూళ్ల మలయాళం మూవీ సీక్వెల్

మలయాళంలో సూపర్ హిట్టయిన 'లోకా: చాప్టర్ 1' (Lokah: Chapter 1) సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కచ్చితంగా ఉంటుందని, షూటింగ్ అప్‌డేట్ గురించి నటి కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు కూడా ఇందులో ఉండనున్నారు.

Published on: Feb 19, 2026, 19:21:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో ఫాంటసీ డ్రామా 'లోకా: చాప్టర్ 1' గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నటి కల్యాణి ప్రియదర్శన్ 'చంద్ర/నీలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించి తన కెరీర్‌లోనే బెస్ట్ బ్రేక్ అందుకుంది. నస్లెన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 303.67 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఆ ఇద్దరు టాప్ హీరోలతో లోకా ఛాప్టర్ 2.. కల్యాణి ప్రియదర్శన్ కామెంట్స్ వైరల్.. అత్యధిక వసూళ్ల మలయాళం మూవీ సీక్వెల్
ఆ ఇద్దరు టాప్ హీరోలతో లోకా ఛాప్టర్ 2.. కల్యాణి ప్రియదర్శన్ కామెంట్స్ వైరల్.. అత్యధిక వసూళ్ల మలయాళం మూవీ సీక్వెల్

సీక్వెల్.. సెప్టెంబర్‌లో షూటింగ్..

తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో కల్యాణి ప్రియదర్శన్ 'లోకా: చాప్టర్ 2' (Lokah: Chapter 2) గురించి ఆసక్తికర అప్‌డేట్ పంచుకుంది. ఈవెంట్ యాంకర్ సీక్వెల్ గురించి అడగగా.. "నిజం చెప్పాలంటే, నాకు తెలిసినంతవరకు సెప్టెంబర్ నెలకల్లా షూటింగ్ ప్రారంభం కావాలి. రెండవ భాగంలో కూడా నేను కచ్చితంగా ఉంటాను. కాబట్టి దయచేసి వెయిట్ చేయండి" అని ఆమె చిరునవ్వుతో బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లోకా మొదటి భాగంలో ఏం జరిగిందంటే?

'లోకా: చాప్టర్ 1' ప్రధానంగా కేరళ జానపద కథల ఆధారంగా కల్లియంకట్టు నీలి (Kalliyankattu Neeli) అనే యక్షిణి కథతో తెరకెక్కింది. కుల వివక్ష కారణంగా ఒక రాజు తన గ్రామాన్ని నాశనం చేయడంతో, కనబడని ఒక నాయకుడు 'మాతోన్' సాయంతో ప్రపంచంలోని అన్యాయాలపై చంద్ర (కల్యాణి) పోరాడుతుంది.

ఈ క్రమంలో ఆమె నేపథ్యం తెలియక సన్నీ (నస్లెన్) ఆమెతో ప్రేమలో పడతాడు. అటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే క్రూరమైన పోలీస్ ఆఫీసర్ నాచియప్ప గౌడ పాత్రలో నటుడు శాండీ నటించాడు. అతను చనిపోవడానికి ముందు వాంపైర్‌గా మారడం మొదటి భాగంలో ఉత్కంఠను రేపింది.

చాప్టర్ 2లో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్

తాజాగా విడుదలైన 'లోకా: చాప్టర్ 2' ప్రమోషనల్ వీడియోలో కేవలం టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ మాత్రమే కనిపించారు. రెండో భాగం ప్రధానంగా 'చాతన్' (Goblin) అనే మరో వింత జీవి చుట్టూ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. ఈ పాత్రలో టొవినో (అతని పేరు మాతన్) కనిపించనుండగా, అచ్చం అతనిలాగే ఉండే ఏకంగా 389 మంది తోబుట్టువులు అతనికి ఉండటం విశేషం.

అంతేకాకుండా మొదటి భాగం పోస్ట్-క్రెడిట్ సీన్‌లో దుల్కర్ సల్మాన్‌ను 'చార్లీ' అనే ఒడియన్ నింజా పాత్రలో పరిచయం చేశారు. సీక్వెల్‌లో కల్యాణి (చంద్ర)తో పాటు వీరంతా కలిసి ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించనున్నారు. సౌబిన్ షాహిర్, శాంతి బాలచంద్రన్, అహానా కృష్ణ, బాలు వర్గీస్ వంటి ఎంతో మంది నటులు ఈ ఫ్రాంచైజీలో భాగమయ్యారు.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More