దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార వచ్చేది ఈ ఓటీటీలోకే.. బడ్జెట్‌లో సగానికిపైగా ఓటీటీ డీల్‌తోనే సొంతం!
'మహానటి', 'లక్కీ భాస్కర్' వంటి విజయాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు పవన్ సాదినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రికార్డు ధరకు దక్కించుకుంది.
మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ దుల్కర్ సల్మాన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న దుల్కర్.. ప్రస్తుతం పవన్ సాదినేని ('దయా' వెబ్ సిరీస్ ఫేమ్) దర్శకత్వంలో ఓ సోషల్ డ్రామాలో నటిస్తున్నారుడు. ఆ సినిమా పేరు 'ఆకాశంలో ఒక తార'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

దుల్కర్ జాక్‌పాట్.. 60% బడ్జెట్ రికవరీ!
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా ఓటీటీ (OTT) హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.
ఈ డీల్ ద్వారా నిర్మాతలు సినిమా బడ్జెట్‌లో దాదాపు 60 శాతం మొత్తాన్ని ఇప్పటికే రికవర్ చేశారని తెలుస్తోంది. దుల్కర్ క్రేజ్, ఎమోషనల్ కంటెంట్ నచ్చడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఆకాశంలో ఒక తార కథేంటంటే..
ఈ ఆకాశంలో ఒక తార సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ఒక చదువురాని వ్యక్తిగా కనిపిస్తాడు. 15 ఏళ్ల వయసులో తనకు పెళ్లి అయిన భార్య (కొత్త నటి సాత్విక వీరవల్లి)కి 'నాసా' (NASA) సైంటిస్ట్ అవ్వాలనే బలమైన కోరిక ఉంటుంది. చదువు లేని భర్త.. తన భార్య కలను నెరవేర్చడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు.. ఆమెను ఎలా ప్రోత్సహించాడు అనేదే ఈ సినిమా ఎమోషనల్ పాయింట్.
ఆకాశంలో ఒక తార విశేషాలు
ఆకాశంలో ఒక తార మూవీలో కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి.. దుల్కర్ భార్యగా, కీలక పాత్రలో నటిస్తోంది. ఇక శృతి హాసన్, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సీనియర్ నటుడు నాజర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
'మహానటి', 'కల్కి', 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన వైజయంతి మూవీస్/స్వప్న సినిమా మేకర్స్.. అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్)తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
షూటింగ్ చివరి దశలో..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో మూవీ టీమ్ గోదావరి జిల్లాల్లో 5 రోజుల పాటు షూటింగ్ జరపనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన 'స్పేస్ సెట్'లో 10 రోజుల పాటు చివరి షెడ్యూల్ జరగనుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డేతో కలిసి మరో రొమాంటిక్ డ్రామాలోనూ నటిస్తున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


