మలయాళం హారర్ కామెడీ మూవీ సర్వం మాయలో డెలులు లవర్ ప్రభేందుయేనా? డైరెక్టర్ రియాక్షన్ ఇదీ.. దుల్కర్ సల్మాన్ ఉండాలంటూ..
నివిన్ పాలీ హీరోగా నటించిన ఫీల్ గుడ్ మలయాళ హారర్ కామెడీ మూవీ 'సర్వం మాయ' జియోహాట్‌స్టార్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అఖిల్ సత్యన్ ఓటీటీప్లేతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇందులో డెలులు లవర్ ఎవరన్నదానిపై నోరు విప్పాడు.
ప్రముఖ మలయాళ దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన తాజా హారర్ కామెడీ మూవీ 'సర్వం మాయ'. నివిన్ పాలీ తనదైన శైలిలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులకు ఒక ప్రశ్న మిగిలిపోయింది. సినిమాలో డెలులు (Delulu) లవర్ ఎవరు? ఆ పాత్రను ఎందుకు స్పష్టంగా చూపించలేదు? దీనిపై దర్శకుడు అఖిల్ సత్యన్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చాడు.

మా నాన్న సలహా మేరకే..
సర్వం మాయ సినిమాలో డెలులు ప్రేమికుడి పాత్రను చూపించకపోవడం పొరపాటు కాదని, అది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమేనని అఖిల్ తెలిపాడు. "నిజానికి మొదట ఆ పాత్ర చుట్టూ ఒక సబ్-ప్లాట్ రాద్దామని అనుకున్నాను. కానీ 'హృదయపూర్వం' సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు మా నాన్న (ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతికాడ్)తో ఈ కథ గురించి చర్చించాను. అప్పుడు ఆయన.. 'ఆ పాత్రను ప్రేక్షకులే ఊహించుకునేలా వదిలేయడం మంచిది' అని సలహా ఇచ్చారు. అది నిజంగానే వర్కవుట్ అయ్యింది. ప్రేక్షకులు ఆ పాయింట్‌కి బాగా కనెక్ట్ అయ్యారు" అని అఖిల్ వివరించాడు.
ఆ పాత్రలో దుల్కర్ సల్మాన్ అయితే..
ఒకవేళ ఆ లవర్ పాత్రలో ఎవరినైనా ఊహించుకోవాల్సి వస్తే మీ ఛాయిస్ ఎవరు? అని అడగ్గా.. అఖిల్ నవ్వుతూ.. "నన్ను అడిగితే దుల్కర్ సల్మాన్‌నే ఎంచుకుంటాను. ఆ పాత్రలో ఎవరినైనా ఊహించుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉంది కదా" అని చమత్కరించాడు.
సోషల్ మీడియా థియరీలపై ఇలా..
సినిమా రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల ఫ్యాన్ థియరీలను తాను గమనిస్తున్నట్లు అఖిల్ చెప్పాడు. "కొందరేమో ప్రభేందు పాత్రే డెలులు ప్రేమికుడిని అని రాస్తున్నారు. డెలులు అతన్ని ఆన్‌లైన్‌లో కలుసుకుని, తర్వాత అతని మ్యూజిక్ విని ఫ్యాన్ అయ్యిందని, కమిట్మెంట్ ఫోబియాతో అతను ఆమెను కలవలేదని.. ఇలా చాలా లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. మరికొందరేమో అసలు ప్రేమికుడే లేడని, అది కేవలం ఆమె ఊహ అని అంటున్నారు. ఈ విశ్లేషణలు చదవడం నాకు చాలా ఆసక్తిగా ఉంది" అని అఖిల్ చెప్పాడు.
విలన్లు లేని కథ.. ఎమోషన్లే బలం
ఈ సినిమా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతూ.. "నాకు పూర్తి కల్పిత కథలు రాయడం రాదు. మన రోజువారీ జీవితంలో జరిగే సాధారణ సంఘటనలే నాకు స్ఫూర్తి. 'సర్వం మాయ'లో విలన్లు ఉండరు. కేవలం పరిస్థితులు మాత్రమే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి. భావోద్వేగాలే సినిమాకు ప్రధాన బలం. నా జీవితంలో నేను చూసిన, విన్న చిన్న చిన్న సంభాషణల నుంచే ఈ సినిమాలోని హాస్యం పుట్టింది" అని అఖిల్ తెలిపాడు.
సర్వం మాయ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గొప్ప గిటారిస్టు కావాలనుకొని అనుకోకుండా పూజారి అయిన తన బావ దగ్గర అసిస్టెంట్ గా చేరే హీరో.. ఓ దెయ్యంతో ఎలా స్నేహం చేస్తాడు? ఇంతకీ ఆ దెయ్యం ఎవరు అన్నదే ఈ సర్వం మాయ మూవీ స్టోరీ.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


