Virosh Wedding: విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక మందన్న గతంలో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న హీరో ఎవరో తెలుసా? ఏమైందంటే?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఈ రోజు జరుగుతోంది. ఉదయపూర్‌లో గ్రాండ్ గా విరోష్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. అయితే విజయ్ దేవరకొండతో పెళ్లి కంటే ముందు మరో హీరోతో రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న సంగతి తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డ్రీమ్ వెడ్డింగ్ ఈ రోజు జరుగుతోంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో ఒక రాయల్, ప్రైవేట్ వేడుకగా వీళ్ల వివాహం అట్టహాసంగా సాగుతోంది. సంగీత్, హల్దీ, మెహందీ లాంటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు సందడిగా సాగాయి. గురువారం పెళ్లి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న గతంలో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

రష్మిక, రక్షిత్
గురువారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరుగుతోంది. అయితే గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. 2016లో వచ్చిన కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటించారు. ఇది రష్మికకు డెబ్యూ మూవీ. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ మొదలైందని అంటారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వీళ్లు డేటింగ్ లో ఉన్నారని టాక్.
ఎంగేజ్మెంట్
2017లో రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో విరాజ్‌పేటలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లో వీళ్లు ఉంగరాలు మార్చుకున్నారు. కానీ వాళ్ల రిలేషన్ షిప్ పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయింది. ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక, రక్షిత్ విడిపోయారు. తమ ఇద్దరికి సెట్ కావడం లేదని నిర్ణయించుకుని 2018లో ఈ డిసిషన్ తీసుకున్నారు.
రక్షిత్ శెట్టి గురించి
కన్నడలో పాపులర్ హీరోగా రక్షిత్ శెట్టి ఎదిగాడు. 2010లో సినిమాల్లో అడుగుపెట్టిన రక్షిత్.. 'గోధి బన్న సాధరన మైకట్టు', 'అవనే శ్రీమన్నారాయణ', '777 చార్లీ' వంటి చిత్రాలతో ప్రేక్షకులు, విమర్శకులను ఆకట్టుకున్నాడు. వాటిలో '777 చార్లీ' అతని కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 40 ఏళ్ల రక్షిత్ నేషనల్ అవార్డు, రెండు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఐదు సైమా అవార్డులతో సహా అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నాడు.
విరోష్ జోడీ
2018లో రష్మిక, రక్షిత్ విడిపోయారు. అదే ఏడాది రిలీజైన గీత గోవిందం సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ తొలిసారి కలిసి నటించారు. అప్పటి నుంచే విరోష్ జోడీ మధ్య బంధం మొదలైందని చెప్తారు. 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాతో ఈ బంధం మరింత బలపడింది. అప్పటి నుంచే విరోష్ జోడీపై డేటింగ్ రూమర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


