విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి 'గ్లోబల్' ప్రొటెక్షన్.. వెడ్డింగ్ కార్డ్ బయటకు రావడంతో షాకింగ్ నిర్ణయం!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి హైప్ మామూలుగా లేదు. ఈ స్టార్ కపుల్ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వెడ్డింగ్ కార్డు లీకవడం, దీంతో సెక్యూరిటీని మరింత టైట్ చేయాలన్న నిర్ణయం తీసుకొని ఏకంగా ఇంటర్నేషనల్ సెక్యూరిటీని రంగంలో దించడం విశేషం.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. అయితే ఇప్పటివరకు తమ వ్యక్తిగత జీవితాన్ని, ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గా ఉంచిన ఈ జంట.. తమ పెళ్లి వేడుకను కూడా అత్యంత ప్రైవసీతో జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అంతర్జాతీయ సెక్యూరిటీని రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి.

వెడ్డింగ్ కార్డు లీక్‌తో..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి శుభలేఖ ఆన్‌లైన్‌లో లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కార్డులో పెళ్లి తేదీ, సమయం, వేదిక, ముఖ్యమైన కాంటాక్ట్ నంబర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో తమ ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఈ జంట సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పెళ్ళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి విజయ్, రష్మిక ఒక అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని ఆశ్రయించారు. ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ తమ పెళ్లికి సంబంధించిన ఏదో ఒక కొత్త విషయం లీక్ అవుతుండటంతో, తమ పెళ్లి రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరూ అనధికారికంగా లోపలికి రాకుండా చూసుకునే బాధ్యతను ఈ గ్లోబల్ టీమ్‌కు అప్పగించారు.
ఇండియా టుడే (India Today) రిపోర్టు ప్రకారం.. ఈ విదేశీ భద్రతా సిబ్బంది స్థానిక రాజస్థాన్ పోలీసులతో, అధికారులతో కలిసి పనిచేయనున్నారు. పెళ్లి వేడుకలు సజావుగా సాగేలా వీరు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని సృష్టించనున్నారు.
నో-ఫోన్ రూల్, అగ్రిమెంట్లు..
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఈ జంట చాలా పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అతిథులు, ఈవెంట్ మేనేజర్లు, వెండర్స్, ఇతర సిబ్బంది అందరితో ‘నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్స్’ పై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం.
అంటే పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వారు బయట వ్యక్తులతో పంచుకోకూడదు. అలాగే పెళ్లికి హాజరయ్యే అతిథులందరికీ 'నో-ఫోన్ రూల్' అమలు చేస్తున్నారు. పెళ్లి మండపంలోకి మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధించారు. తమ పెళ్లి వేడుక పూర్తి ప్రైవేట్‌గా, కేవలం అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరగాలని విజయ్, రష్మిక కోరుకుంటున్నారు.
ఉదయ్‌పూర్‌లో పెళ్లి.. హైదరాబాద్‌లో రిసెప్షన్..
విజయ్, రష్మిక వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఒక విలాసవంతమైన ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. ఆ తర్వాత తమ సినీ పరిశ్రమలోని స్నేహితులు, సహచరులు, ఇతర ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా సమాచారం.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వారు తమ బంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా అంగీకరించలేదు, చాలా రహస్యంగా ఉంచారు. గతేడాది ఎంగేజ్‌మెంట్ జరిగినా కూడా దానినీ ఇప్పటి వరకూ అధికారికంగా ఈ జంట వెల్లడించలేదు. ఇప్పుడు ఫైనల్‌గా వీరు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


