వెడ్డింగ్ వైబ్.. కొత్త కోడలు రష్మిక రాక కోసం ముస్తాబవుతున్న విజయ్ దేవరకొండ ఇల్లు.. లైట్స్ తో మెరిసిసోతూ.. వీడియో చూశారా?
కొత్త కోడలిని ఆహ్వానించేందుకు విజయ్ దేవరకొండ ఇల్లు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటిని లైట్స్ తో మెరిసేలా డెకరేషన్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయారు. వెడ్డింగ్ వైబ్స్ తో గ్రాండ్ మ్యారేజీకి రెడీ అవుతున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్ లో వివాహం చేసుకోనున్నారు. తమ వెడ్డింగ్ పై ఈ జంట సైలెంట్ గానే ఉన్నా సోషల్ మీడియాలో లీక్ అయిన పెళ్లి పత్రిక ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి
విజయ్ దేవరకొండ ఇల్లు
రష్మిక మందన్నతో పెళ్లి నేపథ్యంలో హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటిని గోల్డెన్ కలర్ లైట్స్ తో మెరిసేలా డెకరేషన్ చేశారు. పెళ్లి అయ్యాక కొత్త కోడలు రష్మిక మందన్నకు వెల్ కమ్ చెప్పేందుకు ఇంటిని ముస్తాబు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ ఇంటి బయట నుంచి తీసిన ఒక వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
రష్మిక మందన్న రాక కోసం ముస్తాబవుతున్న విజయ్ దేవరకొండ ఇల్లు ఫొటోలు, వీడియోలపై ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్ గా మారింది. ‘‘ఇది చూసి నేను అరవకుండా ఉండలేకపోతున్నా’’ అని ఒక ఫ్యాన్ కామెంట్ చేశాడు. ‘‘వావ్ చివరికి పెళ్లి వైబ్స్’’ అని మరో అభిమాని రాసుకొచ్చాడు. ‘‘అభినందనలు క్యూటీస్’’, ‘‘వాళ్ల పెళ్లి కోసం వెయిట్ చేయలేకపోతున్నా’’, ‘‘ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్’’ అనే కామెంట్లు వస్తున్నాయి.
పెళ్లి కార్డు
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కార్డు రీసెంట్ గా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇందులో ఫిబ్రవరి 26న అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని ఉంది. మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నట్లు పెళ్లి పత్రికలో పేర్కొన్నారు. ఈ వెడ్డింగ్ కార్డుతో పాటు స్పెషల్ గిఫ్ట్ బాక్స్ ను కూడా అతిథులకు రష్మిక, విజయ్ పంపిస్తున్నారు.
పెళ్లి పత్రికతో పాటు అతిథులకు ఓ ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ అందిస్తున్నారు. ఈ బాక్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కు చెందిన ఓ టీషర్ట్ ఉంది. రష్మిక మందన్న కంపెనీకి చెందిన నేషనల్ క్రష్ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. చేతులకు, కాళ్లకు రాసుకునే ఓ ఆయుర్వేదిక్ క్రీమ్, ఓ జీడిపప్పు ప్యాకెట్, స్వీట్ బాక్స్ కూడా ఉన్నాయి.