Wedding Menu: విరోష్ పెళ్లి విందు మెనూ తెలుసా? స్పెషల్ గా పంది కూర.. అవును ఆ ఆచారం ప్రకారం!
wedding Menu: డ్రీమ్ వెడ్డింగ్ తో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒక్కటయ్యారు. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెళ్లి విందులో ఓ ఐటెం హాట్ టాపిక్ గా మారింది.
విరోష్ వెడ్డింగ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ మెనూలోని ఓ ఐటెం మరింత వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో విరోష్ వెడ్డింగ్ జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలో అతిథులకు వడ్డించే విందులో పంది మాంసంతో చేసిన స్పెషల్ పాండీ కూర కూడా ఉందని సమాచారం.

విరోష్ వెడ్డింగ్ మెనూ
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. ఉదయం 10.10 గంటల ముహూర్తంలో వీళ్ల పెళ్లి జరిగిందని తెలిసింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారని టాక్. వీళ్ల కోసం ఏర్పాటు చేసిన విందులో పంది మాంసం కూడా ఉంది.
పంది మాంసం
విరోష్ వెడ్డింగ్ విందు మోనూలో పంది మాంసాన్ని చేర్చడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. రష్మిక మందన్నది కర్ణాటకలోని కూర్గ్ జిల్లా. కొడవ సంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ రోజు సాయంత్రం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. కొడవ ఆచారం ప్రకారం వాళ్లు పెళ్లిలో పంది మాంసం వడ్డిస్తారు.
గతంలో వేటాడి
కొడవ వర్గానికి చెందిన ప్రజలు గతంలో అడవి పందులను వేటాడేవాళ్లు. ఏదైనా శుభకార్యాలు జరిగితే ఆ పంది మాంసాన్ని విందుగా లాగించేవాళ్లు. ఇప్పుడు వేటాడటం మానేశారు కానీ ఇంటి దగ్గరే పెంచుకుంటున్న పందుల మాంసంతో మాత్రం విందు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిలో పంది మాంసంతో చేసిన పాండీ కర్రీ అనేది స్పెషల్ గా మారింది.
టేస్ట్ ఇలా
పంది మాంసంతో కొడవ ప్రజలు చేసిన పాండీ కర్రీ టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుందని తెలిసింది. ఇది కొంచెం పుల్లగా, చాలా కారంగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక మసాలాలతో దీన్ని వండుతారంటా.
ఇక విరోష్ పెళ్లి విందులో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేళా బాత్ కూడా అతిథుల కోసం సిద్ధం చేశారని సమాచారం. తమ పెళ్లికి వచ్చిన గెస్ట్ ల కోసం జపనీస్ వంటకాలను కూడా విరోష్ జోడీ రెడీ చేయించిందంటా. అలాగే స్వీట్లు, డీజర్ట్ లతో ఫుల్ ఫుడ్ ఫెస్ట్ అరెంజ్ చేశారని తెలిసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


