Virosh Wedding: విజయ్ దేవరకొండ అత్తారింట్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? చిట్టి మరదలు.. రష్మిక ఫ్యామిలీ ఇదే

Virosh Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని తెలిసింది. ఇవాళ ఉదయ్ పూర్ లో వీళ్ల వెడ్డింగ్ ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ అత్తారింట్లో ఎవరెవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి రష్మిక మందన్న ఫ్యామిలీ గురించి ఇక్కడ తెలుసుకోండి. 

Published on: Feb 26, 2026, 12:37:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్న దేవరకొండగా మారింది. చాలా రోజులుగా ప్రేమిస్తున్న విజయ్ ను ఆమె ఈ రోజు పెళ్లి చేసుకుందని తెలిసింది. ఉదయ్ పూర్ లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగిందని సమాచారం. తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడని టాక్.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

విరోష్ వెడ్డింగ్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2018లో వచ్చిన గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. అప్పటి నుంచి వీళ్లు తమ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 26) వీళ్లు పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అత్తారింట్లో ఎవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

రష్మిక ఫ్యామిలీ

రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ జిల్లా విరాజ్ పేటలో పుట్టింది. ఆమె తండ్రి పేరు మదన్ మందన్న. ఆయన స్థానికంగా వ్యాపారం చేస్తారు. విజయ్ దేవరకొండ మామ ఓ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు. ఇక విజయ్ దేవరకొండ అత్తగారి పేరు సుమన్ మందన్న. ఆమె హౌస్ వైఫ్. సినీ ఇండస్ట్రీలో రష్మిక ఎదుగుదలలో ఆమె తల్లి పాత్ర కీలకం.

చిట్టి మరదలు

విజయ్ దేవరకొండకు బావమరుదులు ఎవరూ లేరు. ఎందుకంటే రష్మిక మందన్నకు బ్రదర్స్ లేరు. కానీ విజయ్ కు ఓ చిట్టి మరదలు ఉంది. చిట్టి మరదలు అని ఎందుకు అంటున్నారంటే రష్మిక మందన్న చెల్లెలు షిమన్ మందన్న వయసు 14 ఏళ్లు మాత్రమే. రష్మికకు, తన చెల్లెలికి ఏజ్ గ్యాప్ 16 ఏళ్లు కావడం గమనార్హం. అందుకే తన చెల్లెలిని రష్మిక బేబీ సిస్టర్ అని పిలుస్తుంది.

మూడు ముళ్లు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఇవాళ ఒకటయ్యారని తెలిసింది. ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో గురువారం ఉదయం 10.10 గంటల ముహూర్తంలో విరోష్ వెడ్డింగ్ జరిగినట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కొడవ సంప్రదాయంలో మరోసారి వీళ్ల పెళ్లి జరగనుంది.

విరోష్ వెడ్డింగ్ కు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు. తక్కువ మందితో అత్యంత ఘనంగా ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ జరగబోతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More