virosh wedding: రష్మిక మెడలో మూడుముళ్లు వేసిన విజయ్ దేవరకొండ.. ఒక్కటైన విరోష్ జోడీ.. కల్యాణ మండపం వీడియో చూశారా?
విరోష్ ఒక్కటయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డ్రీమ్ వెడ్డింగ్ తో కలిసిపోయారు. ఇవాళ ఉదయ్ పూర్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగిందని సమాచారం. కల్యాణ మండపానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ ఇప్పుడు అఫీషియల్ గా ఒకటైనట్లు తెలుస్తోంది. మూడు ముళ్ల బంధంతో వాళ్ల ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారని సమాచారం. ఇవాళ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి జరిగినట్లు తెలిసింది. విరోష్ వెడ్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

విరోష్ వెడ్డింగ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరిగిందని సమాచారం. కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న విరోష్ వెడ్డింగ్ లో కీలక ఘట్టం ఈ రోజు పూర్తయిందని టాక్. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రష్మిక మందన్న మెడలో విజయ్ దేవరకొండ తాళి కట్టినట్లు తెలిసింది. ముహూర్తం ప్రకారమే వివాహ బంధంతో ఈ జోడీ ఒక్కటైందని అంటున్నారు.
కల్యాణ మండపం వీడియో
విరోష్ పెళ్లికి ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ వేదికగా నిలిచింది. ఇక్కడ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం కోసం ఏర్పాటు చేసిన కల్యాణ మండపం డెకరేషన్ అదిరిపోయింది. ఈ మండపానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘రష్ అండ్ విజయ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు స్వాగతం’’ అని ఎంట్రీలోనే బోర్డు పెట్టారు. పూలు, కొబ్బరి బోండాలు, గంటలతో అలంకరించారు.
ఏడు అడుగులు
మూడు ముళ్లు, ఏడు అడుగులతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారని సమాచారం. అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో విరోష్ పెళ్లి జరిగిందని తెలిసింది. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వీళ్ల వివాహం నిర్వహించారని అంటున్నారు. సాయంత్రం మళ్లీ కొడవ సంప్రదాయంలో మరోసారి పెళ్లి తంతు నిర్వహించనున్నారు.
సెలబ్రిటీ గెస్ట్ లు
విరోష్ పెళ్లికి అతి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం పంపారు. వీళ్లలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, ఆషిక రంగనాథ్, సందీప్ రెడ్డి వంగా, కల్యాణి ప్రియదర్శన్ తదితర సెలబ్రిటీలు పెళ్లికి అటెండ్ అయ్యారు. మార్చి 4న హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు.
ప్రీ వెడ్డింగ్ సందడి
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రీ వెడ్డింగ్ వేడుకలు సందడిగా సాగాయి. హల్దీ, సంగీత్, మెహందీ ఈవెంట్లను గ్రాండ్ గా నిర్వహించారు. సంగీత్ లో తన కోడలు రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ అమ్మ మాధవి కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను బహుమతిగా ఇచ్చారని తెలిసింది. 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాలో రష్మిక, విజయ్ తొలిసారి కలిసి నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


