OTT: ఓటీటీ సిరీస్ రిసార్ట్ వివాదం- పారితోషికం ఎగ్గొట్టి బూతులు తిట్టారని నటి ఏడుపు- పరువు నష్టం దావా వేస్తానన్న హీరో!
OTT Web Series Resort Controversy Anugraha Nambiar Vijay Kumar: తమిళ ఓటీటీ వెబ్ సిరీస్ రిసార్ట్ షూటింగ్ సెట్‌లో చెలరేగిన వివాదం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ నటి అనుగ్రహ నంబియార్ చేసిన ఆరోపణలు, దానికి హీరో విజయ్ కుమార్ ఇచ్చిన కౌంటర్లతో ఈ ఇష్యూ మరింత ముదిరింది.
OTT Series Resort Controversy Anugraha Nambiar Vs Vijay Kumar: ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన తమిళ వెబ్ సిరీస్ 'రిసార్ట్'. ఈ ఓటీటీ సిరీస్‌లో నటిస్తున్న అనుగ్రహ నంబియార్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

కాంట్రాక్ట్ పేరుతో ఉచ్చులోకి
రిసార్ట్ ఓటీటీ సిరీస్ యూనిట్ తన పారితోషికం చెల్లించకుండా వేధిస్తోందని, కాంట్రాక్టు పేరుతో తనను ఉచ్చులోకి లాగారని అనుగ్రహ నంబియార్ ఆరోపించారు. కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తనలాంటి నటీమణులను ఇండస్ట్రీలో ఎలా వేధిస్తున్నారో వివరిస్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
"ఈ ఓటీటీ సిరీస్ కోసం నా డేట్స్ లాక్ చేయించుకున్నారు. తీరా చూస్తే పారితోషికం ఇవ్వడం లేదు. పోనీ వేరే ప్రాజెక్ట్స్ చేసుకుందామంటే ఈ కాంట్రాక్టు (ఏడాది) అడ్డు వస్తోంది. 4 నెలలుగా షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంచారు. దీనివల్ల నేను తిండికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాగే కొనసాగితే నాకు చావే దిక్కు" అని అనుగ్రహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగా తనకు ఫిట్స్ (ఎపిలెప్టిక్ సీజర్స్) వచ్చాయని, ఆసుపత్రి పాలయ్యానని అనుగ్రహ పేర్కొన్నారు.
హీరో విజయ్ కుమార్ దంపతులపై తీవ్ర ఆరోపణలు
ఈ వివాదంలో రిసార్ట్ ఓటీటీ సిరీస్ లీడ్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ విజయ్ కుమార్ రాజేంద్రన్, ఆయన భార్య నక్షత్ర మూర్తిపై అనుగ్రహ మరిన్ని ఆరోపణలు గుప్పించారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తన స్నేహితుడికి నక్షత్ర అసభ్యకరమైన వాయిస్ మెసేజ్‌లు పంపారని, పనిలోకి రావాలని ఒత్తిడి చేశారని ఆమె తెలిపారు.
విజయ్ కుమార్‌కు తన పరిస్థితి వివరించినా కనికరం చూపలేదని మండిపడ్డారు. మరో నటి మాళవిక శ్రీనాథ్ కూడా అనుగ్రహకు మద్దతుగా నిలిచారు. ఆడిషన్స్ పేరుతో కేరళ నుంచి చెన్నైకి పిలిపించి వేల రూపాయలు ఖర్చు చేయించారని, తీరా సెట్‌లోకి వెళ్తే నటీనటులను చాలా హీనంగా చూస్తారని ఆమె కామెంట్ చేశారు.
విజయ్ కుమార్ వెర్షన్ ఇదీ.. పరువు నష్టం దావాకు సిద్ధం!
ఈ వివాదం ముదరడంతో హీరో విజయ్ కుమార్ స్పందించారు. అనుగ్రహ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. "నేను కేవలం నటుడిని మాత్రమే, నిర్మాతను కాదు. ఆమెకు పారితోషికం ఇవ్వాల్సింది ప్రొడక్షన్ టీమ్. వాళ్లతో మాట్లాడితే ఇప్పటికే ఆమెకు రూ. 25,000 అడ్వాన్స్ ఇచ్చామని, అందులో ఆమె ఇంకా పది పదిహేను వేలు తిరిగి ఇవ్వాల్సి ఉందని చెప్పారు" అని విజయ్ పేర్కొన్నారు.
పబ్లిసిటీ కోసమే టార్గెట్
నటి అనుగ్రహ తన పాత్ర ప్రాధాన్యత పెంచమని కోరిందని, అందుకు నిరాకరించినందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విజయ్ కుమార్ ఆరోపించారు. కోలీవుడ్‌లో ఎవరికీ తెలియని ఆమెకు ఈ సిరీస్ ద్వారా గుర్తింపు వచ్చిందని, ఇప్పుడు పబ్లిసిటీ కోసం తమను టార్గెట్ చేస్తోందని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, త్వరలోనే ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నటి అనుగ్రహ నంబియార్ ప్రధాన ఆరోపణ ఏమిటి?
తమిళ వెబ్ సిరీస్ 'రిసార్ట్' మేకర్స్ తన పారితోషికం చెల్లించలేదని, డేట్స్ బ్లాక్ చేసి ఇతర అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
2. హీరో విజయ్ కుమార్ దీనిపై ఎలా స్పందించారు?
ఆమెకు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చామని, పారితోషికం విషయంతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు.
3. ఈ వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందా?
నటి మాళవిక శ్రీనాథ్ కూడా ప్రొడక్షన్ టీమ్ ప్రవర్తనపై విమర్శలు చేస్తూ అనుగ్రహకు మద్దతు తెలిపారు. మరోవైపు విజయ్ భార్య నక్షత్ర కూడా ఈ ఆరోపణలను ఖండించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


