Dhanush: ఈ పేరు గుర్తు పెట్టుకోండి, మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి, ఆ ఓటీటీ మూవీ చూశాకే అంటూ హీరో ధనుష్ కామెంట్స్

Dhanush Speech In Kara Movie Pre Release Event: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర. మమితా బైజు హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్, ఓటీటీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ధనుష్.

Published on: Apr 27, 2026, 17:18:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhanush Speech In Kara Movie Pre Release Event: తెలుగులోనూ ధనుష్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి ధనుష్ హీరోగా అలరించేందుకు వస్తున్న సినిమా కర. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్ మమితా బైజు నటించింది.

ఈ పేరు గుర్తు పెట్టుకోండి, మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి, ఆ ఓటీటీ మూవీ చూశాకే అంటూ హీరో ధనుష్ కామెంట్స్
ఈ పేరు గుర్తు పెట్టుకోండి, మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి, ఆ ఓటీటీ మూవీ చూశాకే అంటూ హీరో ధనుష్ కామెంట్స్

కర ప్రీ రిలీజ్ ఈవెంట్

కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన కర చిత్రానికి డైరెక్టర్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కర సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 26) నాడు కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, డైరెక్టర్స్ బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ విఘ్నేష్ రాజా, ఓటీటీ సినిమాపై హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ పేరు గుర్తు పెట్టుకోండి

ధనుష్ మాట్లాడుతూ .. "‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేష్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేష్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ఓటీటీ సినిమా ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను" అని అన్నారు.

"ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమితా గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను" అని ధనుష్ చెప్పారు.

పోరు తోళిల్ ఓటీటీ రిలీజ్

"‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని హీరో ధనుష్ కోరారు.

అయితే, ధనుష్ చెప్పిన పోర్ తోళిల్ సినిమా తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఆర్ శరత్ కుమార్, అశోక్ సెల్వన్ మెయిన్ లీడ్స్‌లో నటుడు శరత్ బాబు, నిఖిల విమల్, సునీల్ సుఖాడా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సోనీ లివ్‌లో పోర్ తోళిల్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8 రేటింగ్ ఉంది.

రెహమాన్ గొప్పగా చెబుతారు

ఇక ఇదే కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. "ధనుష్ గారిని చూసేందుకే ఈవెంట్‌కు వచ్చాను. కాళీపట్నంలో కర మాస్టర్ అని ఉండేవారు. ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు. ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు. రెహమాన్ గారు ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఏప్రిల్ 30న ‘కర’ మంచి విజయాన్ని సాధించాలి" అని కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More